వనపర్తి ' తెలుగువాడ' పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి తెలుగు వాడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. 1977 -1984 బ్యాచ్ 7వ తరగతి ఎ, బి సెక్షన్ల పూర్వ విద్యార్థులు మంగళవారం (31-05-2011) వనపర్తి భగీరథ పంక్షన్‌హాలులో సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. సమావేశానికి వసంత్, వై.వెంకటేష్, కె.చంద్రుడు, మల్లికార్జున్ అధ్యక్షత వహించారు. '' ఆనాటి ఆ స్నేహమానందగీతం- ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం '' అన్న విధంగా హాజరయిన వారందరూ తమ అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులు చంద్రకళ, సరోజనమ్మ, వనజ, జగదీశ్వరమ్మ, నిరీక్షణమ్మ, శశికళ, ఆనందం, బాలస్వామి, బసవపని, యోగానందం, రాములుశెట్టి, అప్పటి అటెండర్ సయ్యజ్ జలాల్ తదితరులను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ఈ సమ్మేళనం అపూర్వం, అద్భుతమని కొనియాడారు. మరుపురాని ఈ సన్నివేశాన్ని వర్ణించడానికి భాష సరిపోదేమో అని అన్నారు. తాము చెప్పిన చదువుతో మీరంతా వివిధ స్థాయిలో సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. 7వ తరగతి విద్యార్థుల సమ్మేళనం జరగడం వనపర్తి చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పానుగంటి చంద్రయ్య, కె.కృష్ణయ్య, శాంతయ్య, గఫూర్, రాజేష్, అరుణ్, కిరణ్, యాదగిరి, లతీఫ్, జయప్రకాష్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రమేష్, తదితర 50 మంది దాకా హాజరయ్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి