1, డిసెంబర్ 2011, గురువారం

ఎఫ్‌డిఐని వ్యతిరేకిద్దాం

             రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐని వ్యతిరే కించి, చిల్లర వర్తకులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ అన్నారు. బుధవారం కర్నూలు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో ప్రజాశక్తి ఆధ్వర్యంలో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకి స్తూ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య అధ్యక్షత వహించారు. ఎంఏ గఫూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిరుద్యోగులకు కోట్ల ఉద్యోగాలు విదేశీ పెట్టుబడుల వల్ల లభిస్తాయని మోసపూరిత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిటైల్‌ రంగంలో చిల్లర దుకాణాలు పెట్టుకుని కోట్లాది మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎఫ్‌డిఐ దేశంలో ప్రవేశిస్తే వీదేశాలు పెట్టుబడులు పెట్టడం వల్ల వారి పెత్తనంతో పాటు ఆదాయాలు కూడా వారికే పోతాయన్నారు. ప్రధాని వీటి ద్వారా ఉపాధి కలుగుతుందని చెప్పడం బూటకమన్నారు. ఎఫ్‌డిఐ ప్రవేశం వల్ల భారతదేశ వస్తు ఉత్పత్తి పరిశ్రమలు దెబ్బతింటాయన్నారు. వీటితో పాటు వ్యవసాయరంగం కూడా వారి ఆధీనంలోకి వెళ్తుందని తెలిపారు. దేశ నవనాడులన్నీ విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోతున్నాయని చెప్పారు. ఇలా ఒక్కో రంగంలో ప్రవేశిస్తూ పత్రికా రంగంలో ప్రవేశించనుందన్నారు. పాలకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని తెలిపారు. రిటైల్‌ రంగాన్ని కాపాడుకునేందుకు గురువారం చేపట్టే బంద్‌కు అందరూ సంఘీభావం తెలపాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ఈసమావేశంలో టిడిపి జిల్లా నాయకులు ఆకెపోగు ప్రభాకర్‌,సిపిఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయి, బిజెపి నాయకులు దామోదర్‌రెడ్డి, సమాజ్‌వాది పార్టీ నాయకులు శేషుఫణి, మెడికల్‌ రెప్స్‌ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌శర్మ, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎండి ఆనంద్‌బాబు, డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు లక్ష్మణ్‌, చిన్న వ్యాపారుల సంఘం నాయకులు షరీఫ్‌, వ్యాపారులు సుధాకర్‌, ప్రకాష్‌, ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ ఎం.రాజు, ప్రతినిధి బి.గోరంట్లప్ప, సిబ్బంది సుజాత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

17 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

మీ పోస్టుతో ఏకీభవిస్తున్నాను.రిటైల్ రంగంలో FDIని మనమంతా పూర్తిగా వ్యతిరేకించాలి.కాని high technologyలో అహ్వానించవచ్చును.

Saahitya Abhimaani చెప్పారు...

చిన్న రిటైల్ దుకాణదారులు అదేమీ పెద్ద విషయం కాదన్నట్టుగా చేస్తున్న మోసాలు:

1 తూకాల్లో మోసాలు.
2 చిల్లరగా కొనుక్కునే తిండి వస్తువులు, బియ్యం, పప్పులు వగైరాలో కల్తీ
3 ఇష్టం వచ్చిన లాభాలు వేసుకుని వినియోగదారుని దోచుకోవటం. ఎంత తక్కువ కొనేవాడు వెళ్తే అంత ఎక్కువ రేటు వెయ్యటం.
4 పాక్ చేసిన వస్తువులతోపాటు తయారీదారు ఇచ్చే ఉచితాలు దాచేసి ఇవ్వకపోవటం, అడిగి గోల చేసే వాళ్లకు కూడా కంపెనీ నుంచి రాలేదు అంటూ మోసగించటం
5 పనివేళలు, శలవలు లేకుండా తమ దగ్గర పనిచేసే వాళ్ళను కాల్చుకు తినటం.
6 బిల్లు వ్రాయకుండా టాక్స్ ఎగ్గొట్టటం, మనదగ్గర మాత్రం ఆ టాక్స్ వసూలు చెయ్యటం.
7 నకిలీ వస్తువులు అంటగట్టటం
8 దొంగ లెక్కలు వ్రాసి ఆదాయపు పన్ను ఎగవేయ్యటం.
9 బాగాలేని వస్తువు తిరిగి ఇవ్వటానికి వెళ్ళిన వినియోగదారుడిని, నా దగ్గర కొనలేదు ఫో అనటం, దీనిని నివారించటానికి ముందుగానే బిల్లు ఇవ్వ మంటే ఇవ్వకపోవటం, పైగా టాక్స్ అంటూ బూచిని చూపింఛి భయపెట్టటం. ఆ టాక్స్ అప్పటికే మనం కట్టే రేటులో కలిపేసే ఉంటుంది, బిల్లు ఇవ్వ కుండా ఆ టాక్స్ మొత్తం కూడా జేబులో వేసుకోవటం, దీనికి తనకొచ్చే లాభంల్ నుంచి ఒకటో రెండో శాతం సేల్స్ టాక్స్ వాళ్ళ చేతులు తడపటం ఈ అవినీతి ఎవరు అంతం చెయ్యగలరు!
9 తన కొట్టు కొద్దిగా ఎదగగానే, పక్కన ఉన్న లేదా కొత్తగా వచ్చిన కోట్లను అక్కడనుంచి తరలింప చేసే యత్నాలు, చాలా సార్లు లోకల్ గూండాలతో కలిసి ఈ పనులు చేయించటం

ఇంకా ఇలా చాలా.....

ఇవన్నీ ఇప్పుడు వచ్చే లేదా రాబొయ్యే మాల్స్ లో జరగవని కాదు, రెండిటిల్లో వినియోగదారునికి ఏమిటి పెద్ద తేడా??

చైనా నుంచి వెల్లువలా వస్తున్న చెత్త సరుకులు ముఖ్యంగా ఎలెక్ట్రానిక్ మరియు ఎలెక్ట్రికల్ వస్తువుల గురించి ఎవ్వరూ వ్రాయరు. వీటివల్ల మన దేశీయ పరిశ్రమలు,అందునా కుటీర పరిశ్రమలు మూతపడే స్థితి వచ్చింది.

ఏది ఏమైనా ప్రస్తుతం చిన్న షాపులు వాళ్ళ పొట్ట కొడుతున్నారు ఈ మార్టులు వచ్చి అన్నప్పుడు, ఈ సో కాల్‌డ్ చిన్న షాపులు వినియోగదారుల పొట్ట దశాబ్దాలుగా కొడుతూనే ఉన్నారు. ఆ విషయం కూడ చర్చకి రావాలి. చిన్న పచారి కొట్లకు మద్దతుగా ప్రజలు ఎందుకు రావటం లేదు అన్న విషయం ఆలోచించి తీరాలి.

నీహారిక చెప్పారు...

సాఫ్ట్వేర్ వాళ్ళొచ్చారు ఇక్కడివాళ్ళకు జీతాలతో పాటు విదేశీ సంస్కృతి కూడా తీసుకొచ్చారు. ఇపుడు మీరు నేను ఇంట్ళో కూర్చుని కూడా కబుర్లు చెపుతున్నాం అంటే వాళ్ళు రాబట్టే కదా ???

కంప్యూటర్ వచ్చేటపుడు కూడా బ్యాంక్ పోటీ పరీక్షల్లో కంప్యూటర్ ల వాడకం మంచిదేనా??? లేదా ??? వంద పదాల్లో వివరింపుడు అని ప్రశ్నలు అడిగేవారు. ఇపుడు కంప్యూటర్ లేకుండా మీరుండగలరా ?

అన్నిటిలోనూ మంచి ఉంది, చెడు ఉంది మనం ఏం తీసుకుంటున్నాం అన్నదే ప్రధానం . మనం వాడే సబ్బు దగ్గరనుండి రాత్రి పడుకునేటపుడు వాడే మస్కిటో కాయిర్ వరకూ విదేశాలవే ఎక్కువ.

ఇప్పటిదాకా లేని అభ్యంతరం ఇపుడు మాత్రం ఎందుకు? ఏది కొత్తగా వచ్చినా ,ఎవరు కొత్తగా చెప్పినా గుడ్డిగా వ్యతిరేకించడం, రొమాంటిక్ ఐడియా అని వెటకరించడం మాకు మామూలే !!!!

మీరేమీ కంగారుపడకండి, మన్మోహన్ సింగ్ గారు మధ్యంతరానికైనా సిద్ధమే అని కుండ బద్దలుకొట్టి చెప్పినపుడు ప్రజలకు మేలు కలిగించేదే కానీ కీడు జరుగదు. నమ్మండి !!!

కమనీయం చెప్పారు...

నీహారికగారితో ఏకీభవించ లేను .ఇక్కడ ప్రశ్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం .పరికరాలను వద్దనడం కాదు.వాటిని మన దేశంలో ఉన్న పెద్ద సంస్థలనే అమ్మమనండి.సమస్య కోట్లమంది చిన్న వర్తకుల జీవనోపాధి దెబ్బ తింటుందని.పప్పులూ, ఉప్పులూ, సబ్బులూ ,పౌడర్లూ ,కూరలూ ,పళ్ళూ అమ్మడానికి వాల్మార్టులూ FDIలూ ఎందుకు?స్పష్టంగా మన్మోహన్ ప్రభుత్వం ,అమెరికా ఒత్తిడికి లొంగి వాళ్ళ రిటైల్ బిజినెస్స్ ని ఇండియా లో వ్యాపింప జెయ్యడానికి చేసుకొన్న ఒప్పందం ఫలితమే.

panuganti చెప్పారు...

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇప్పటికే చాలా ఉన్నాయి. 1991లో వచ్చిన సరళీకరణ నూతన ఆర్థిక విధానాల కారణంగా మన గ్రామీణ వ్యవస్థ , చేతివృత్తులు బాగా దెబ్బదిన్నాయి. స్వదేశీ ఉత్పత్తుల విలువలు పడిపోయాయి. పరిశమ్రలు మూతబడ్డాయి. పలువురు కార్మికులు వీధుల పాలయ్యారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగిపోయింది. మనదేశ సామాజిక , ఆర్థిక వ్యవస్థల్లో బాగా నష్టాలు కలిగాయి. ఆర్థిక అంతరాలు పెరిగాయి. రాజకీయ వ్యవస్థలో అవినీతి పెరిగి పోయింది. ఈ క్రమంలో రిటైల్‌ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులు వస్తే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విదేశీయులతో చేసుకున్న ఒప్పందం ముఖ్యమని భావిస్తున్నారు. కాని మన వందకోట్ల మంది ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆలోచన అస్సలు లేదు. 'శివరామప్రసాదు కప్పగంతు ' అభిప్రాయంతో నేను ఏకీభవించను. కల్తీకి కారకులెవరు. అవినీతిని ప్రోత్సహిస్తున్నదెవరు తెలుసుకోవాలాయన. 'నీహారిక ' చెప్పారు. ఇప్పటికే అన్నీ వచ్చాయి. కదా ఈమాత్రం రిటైల్‌ రంగంలో వస్తే ఏముందిలే అంటున్నారు. అది సరికాదు. ఇప్పటికి జరిగిన నష్టాన్ని చూశాక కూడా ఇంకా విదేశీవస్తువులు పెట్టుబడుల పట్ల వ్యతిరేకత లేక పోతే ఇంకా నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మనం మేల్కొనాలి. ఇప్పటికి వ్యతిరేకించక పోయినదానికి ముందు జరగబోయే దాన్ని కూడా వ్యతిరేకించకూడదనే అభిప్రాయం సరయినది కాదు. 'కమనీయం' ఆలోచన బాగుంది. అందుకు హ్యాట్సాప్‌.

Rao S Lakkaraju చెప్పారు...

చదవటం, వ్రాయటం, చదువు ఉన్న వాళ్లకి FDI రావటం మూలాన ఏ ప్రమాదం ఉండక పోవచ్చు. పెద్ద చదువులు ఉన్న వాళ్లకి ఏ ప్రమాదము ఉండదు. వాళ్లకి ఉద్యోగాలు కూడా ఎక్కువ అవుతాయి. వచ్చిన ప్రాబ్లం అల్లా చదువు రాని చిన్నా చితకా వ్యాపారులకే. ఏ చదువు రాకపోయినా ఏదో బడ్డీ కొట్టు పెట్టుకునో కూరలు అమ్ముకునో జీవించే వాళ్లకి ప్రాబ్లం. మనకి నిరక్షరాస్యత లేదనుకుంటే FDI చాలా మంచిది. ఉద్యోగాలు చాలా వస్తాయి. చిన్న చిన్న వ్యాపారులందరూ వ్యాపారం మానేసి ఉద్యోగులుగా మారుతారు (వారి దగ్గర కొనే వారు ఉండరు కనుక). చదువు రాని చిన్నా చితకా వ్యాపారులకు జీవనోపాధి కష్టమవు తుంది.

Rao S Lakkaraju చెప్పారు...

నేను పైన చెప్పినవన్నీ అమెరికాలో మార్టులు రావటం మూలాన జరిగినవే.

Saahitya Abhimaani చెప్పారు...

"...కల్తీకి కారకులెవరు. అవినీతిని ప్రోత్సహిస్తున్నదెవరు తెలుసుకోవాలాయన..."
కారణం ఎవరంటారు మీ దృష్టిలో? చేసే వాళ్ళు కాకుండా మరెవరన్నా ఉంటారా!! మీకు తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాము. "నూతన ఆర్థిక విధానాల కారణంగా మన గ్రామీణ వ్యవస్థ.....ఆర్థిక వ్యవస్థల్లో బాగా నష్టాలు కలిగాయి..." వగైరా వగైరా ఈ మాటలకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేక పడికట్టుగా వాడేస్తున్న భావ జాలమా? ఈ ఎఫ్ డి ఐ చైనా నుంచి అని ఉంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేది? 1980 ల వరకూ మన డిఫెన్స్ అంతా రష్యన్ మయం. అప్పుడు ఎవరూ గొంతెత్తి మాట్లాడలేదు. 1990 ల నుంచి చైనా వస్తువులు వరద ప్రారంభం అయ్యింది. ఇప్పుడు కూడా మరింత పెరిగి మనదగ్గర కుటీర పరిశ్రమల మూతపడేట్టుగా చేస్తున్నది. చైనా వస్తువులవల్ల జరిగే నష్టం బాగుంటుందా, ఎఫ్ డి ఐ వల్ల ఊహించుకునే కష్టాలు ఎక్కువయ్యాయా!!?? విదేశీ బూచిని చూపించి జనాన్ని భయపెట్టడం చాలా కాలం నుంచి జరుగుతున్నది. మనకు కేబుల్ టి వి వచ్చి స్టార్ టి వి వచ్చినప్పుడు గగ్గోలెత్తి పోయి ఏమయిపోతుంది అని నానా యాగీ చేశారు. ఏమయ్యింది, ఆ స్టార్ టి వి నామరూపాలు లేకుండాపోయింది. మన చానెల్స్ తెగ పెరిగిపొయ్యాయి. ఓటెయ్యటం ఇన్సల్టుగా అనుకుని ఆరొజు సినిమాకి వెళ్ళే మన డ్రాయింగ్ రూం మేధావుల కన్నా ప్రజలు ఎంతో తెలివిగలవాళ్ళు. వాళ్ళకి ఏమికావాలో అది తీసుకుని వాళ్ళకి ప్రమాదం అనుకున్నది వెంటనే తన్ని తగలేస్తారు.దీనికోసం పార్లమెంటులో పదోవంతు సభ్యులు కూడా లేని పార్టీలు ప్రజల తరఫున వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నట్టుగా భ్రమ కలిగించటం మానుకోవాలి. వాళ్ళ అల్లరి మరీ హాస్యాస్పదం అయిపోయింది. వాళ్ళ తండ్రి దేశంలో సంస్కరణల పేరిట వస్తున్నవి అన్నీ మంచిట, మన దేశంలో ప్రజా వ్యతిరేకమట. దీనికి రైట్ వింగ్ అని పేరెట్టుకున్న ఒక పార్టీ, ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఏమి చేసినా సరే వ్యతిరేకించాలి అన్న "మానియా" నుంచి బయటపడే పరిపక్వత ఇంకా రాని పార్టీ, మద్దతు.చిత్రం!

కొద్దిగా ప్రాక్టికల్ గా ఆలోచించ గలిగితే, ఈ మార్టులు ఇప్పటికే ఉన్నాయి. వాటిల్లో విదేశీ పెట్టుబడి 51% నుంచి 100% సాటం పెంచటానికి అనుమతి ఇచ్చే బిల్లు ఇది. ఇప్పటికి ఈ మార్టుల వల్ల జరిగిన నష్టం ఏంత. ఎన్ని షాపులు మూతపడ్డాయి, ఎంత మంది చిన్న షాపుల వాళ్ళు తమ షాపులు మూసుకుని ఈ మార్టుల్లో ఉద్యోగులు అయ్యారు, ఏమన్నా స్టాటిస్టిక్స్ ఉన్నాయా లేక ఊకదంపుడుగా చెప్పెయ్యటమేనా. ఈ మార్టులు ఎప్పటికి కూడా మన దేశంలో మూల మూలలకూ వెళ్ళలేవు. మహా ఐతే చిన్న నగరాల వరకూ మాత్రమే పరిమితం అవుతాయి. అక్కడ కూడా అన్ని చిన్న షాపులూ మూత పడేంతగా ప్రభావాన్ని చూపించలేవు. కారణం మనకున్న జనాభా. 100% వాళ్ళ దగ్గరకు వెళ్ళరు. ప్రతి ఊళ్ళొనూ మార్టులు వచ్చేస్తాయి, ఇక చిన్న షాపులు ఉండవు అనేది ఊహాజనిత "భయం" . చిన్న వ్యాపారులకు పోటీ పెరుగుతుందన్న మాట వాస్తవమే కాని వాళ్ళు తమ వ్యాపారాన్ని మరింత చురుకుగా, న్యాయవంతంగా, నిజాయితీగా చేసుకుంటే, వాళ్ళకు ఈ మార్టులవల్ల పెద్ద ఘోరమేమీ జరగదు.

షాపుల మధ్య ఎంత పోటీ పెరిగితే (మార్టుల మధ్య , మార్టులకు చిన్న షాపుల మధ్య, చిన్న షాపుల మధ్య) వినియోగదారులమైన మనకు అంత మంచిది.

Rao S Lakkaraju చెప్పారు...

Dr Raj Patel, author of Stuffed and Starved: Markets, Power and the Hidden Battle for the World Food System, said in a lecture at the University of Melbourne on 18 September 2007, that a study in Nebraska looked at two different Wal-Marts, the first of which had just arrived and "was in the process of driving everyone else out of business but, to do that, they cut their prices to the bone, very, very low prices". In the other Wal-Mart, "they had successfully destroyed the local economy, there was a sort of economic crater with Wal-Mart in the middle; and, in that community, the prices were 17 per cent higher".[126]

http://en.wikipedia.org/wiki/Walmart

Saahitya Abhimaani చెప్పారు...

ఈ విషయంలో ఈ కింది లింకులు పరిశీలించండి:

http://www.eximguru.com/Export-Import-News/Heavy-Equipment-Imports-from-China-9275.aspx

http://www.indianexpress.com/news/lack-of-regulation-pushes-lowquality-chines/445664/

http://www.merinews.com/article/impact-of-chinese-goods-on-our-economy/125659.shtml

మనం మన వాదనలకు సరిపొయ్యే విధంగా ఎన్నెన్నో ఆధారాలు వెతికి తెచ్చి చూపించవచ్చు. కాని నిజానికి ఏది మంచి ఏది చెడు కాలమే నిర్ణయిస్తుంది. నా ఉద్దేశ్యంలో వస్తు తయారీదారులకు, వినియోగదారునికి మధ్య ఎక్కువ మంది ఉంటే అది అటు వస్తు తయారీదారుకు, ఇటు మనకు ఉపయోగం లేదు.

Pavani చెప్పారు...

లక్కరాజు గారు, వికిపీడియా లో మీకు నచ్చిన రెండు లైన్లు కాపీ చేసి అదో విషయనగా చెప్తున్నారు.వాల్ మార్ట్ గురించి భయం అనవసరం. 70 శాతం మంది ఉన్న గ్రామీణ, చిన్న పట్టణాల జోలికి అది వెళ్ళలేదు.పెద్ద వూళ్ళల్లో దానివల్ల భయం లేదు.దేసీ వి ఆల్రెడీఉన్నాయి. ఇదింకోటి. పోటీ తత్వం పెరిగి ఇండియాలో కూడా ఇంకో వాల్మార్ట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ తయ్యారవ్వొచ్చు.

అన్నిటినీ మించి దేశానికి నష్టం చేసే పని సింగు గారు అంత పట్టు బట్టి మరీ చేస్తారంటే నమ్మను కాక నమ్మను. కోటి మంది కమ్యూనిష్టులు గొంతు చించుకున్నా లేదా కోసుకున్నా సరే!

Rao S Lakkaraju చెప్పారు...

రెండు లైనులు కాదు చాలా మంది చాలా స్టడీస్ చేసారు. పూర్తిగా వికీ చదవండి. మొదట చేసే పని ధరలు బాగా తగ్గించటం. డబ్బులు ఉన్నాయి కాబట్టి నిలబడుతుంది. కస్టమర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. చిన్న చితకా వ్యాపారాలు పోతాయి. అన్నీ మునిగిన తరువాత ధరలు పెంచుతారు. ఇవన్నీ అమెరికాలో జరిగినవే. అక్షరాస్యతలో అమెరికాకి ఇండియాకి చాలా తేడా ఉంది. నేను మళ్ళా చెబుతున్నాను చదువున్న వాళ్లకి ప్రాబ్లం ఉండదు. ఆర్కాన్సా లో వాల్ మార్ట్ హెడ్ క్వార్టర్స్ లో మనవాళ్ళు చాలా మంది ఉన్నారు.

చదువు ఉన్న వాళ్లకి ఒకరికింద పనిచేసే ఉద్యోగాలు వస్తాయి. లేని వాళ్ళు చేతులేత్తుతారు(చదువులేక కూరగాయలు మొదలయినవి అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు).

Pavani చెప్పారు...

.... ... ఇది కూడా ఆ వికిపీడియాలోనే అక్కడే రాశారండి.

"A June 2006 article published by the libertarian Ludwig von Mises Institute suggested that Wal-Mart has a positive impact on small business.[116] It argued that while Wal-Mart's low prices caused some existing businesses to close, the chain also created new opportunities for other small business, and so "the process of creative destruction unleashed by Wal-Mart has no statistically significant impact on the overall size of the small business sector in the United States"

Pavani చెప్పారు...

అదంతా ఒదిలెయ్యండి. US లో మీ కార్నర్ గాస్ స్టేషన్ షాపులోకెళ్ళి 1)గేలన్ పాలు 2)ఒక బ్రెడ్ లోఫ్ 2)ఆరు బేగిల్స్ కొనండి. అవ్వే వాల్మార్ట్లో కనీసం 25% తక్కువకు దొరుకుతాయో లేదో చూడండి. అయినా ఆ చిన్న షాపు ఎలా బతికి బట్టగలుగుతోందో ఆలోచించండి. ప్రతి ఊళ్ళో నైబర్ హూడ్ ప్లాజాల్లో ఉండే చిన్న చిన్న షాపులు మీరెప్పుడూ గమనించలేదా

Rao S Lakkaraju చెప్పారు...

Wal-Mart's low prices caused some existing businesses to close,

అది చాలు నాశనానికి. వాళ్ళెం చేస్తారు? అమెరికాలో లాగా సప్పోర్ట్ సర్వీసెస్ లేవు. మనకి కొత్త పనుల్లోకి దూకటానికి అంత అక్షరాస్యత కూడా లేదు. అమెరికా లో ప్రైసింగ్ చాలా వ్యత్యాసలతో ఉంటాయి. ఒక కొట్లో ఒక డాలర్ కు అమ్మేది పక్క కొట్లో నాలుగు డాలర్లకి అమ్ముతారు. రెండు కొట్లూ నడుస్తూనే ఉంటాయి. మీకు కావాలంటే నా బ్లాగ్లో సెల్ పేపర్లు చూడండి.
http://aurorabargains.blogspot.com/

నా బాధంతా చదువులు లేక చిన్న చిన్న స్వంత వ్యాపారాలు చేసి జీవించే వాళ్ళ గురించే.

Pavani చెప్పారు...

రెండువారాలక్రితమే నేను ఇండియా వెళ్ళొచ్చాను.నేను విన్న, గమనించిన అతి ముఖ్యమైన విషయం ..పనివారి కొరత. హైదెరాబాదు కావొచ్చు, పల్లెటూళ్ళో పొలం కూలీలు కావొచ్చు, రెండు చోట్లా కాస్త నమ్మకమైన పనివారి కొరత విపరీతంగా ఉంది. అనెంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం మాత్రమే చూసే వారికండి, work is worship న్యాయమైన పని ఏదైనా మంచిదే అని వొళ్ళొంచి పని చేసే వారికి కాదండి.
అక్షరాస్యత గురించి మరీ ఎక్కువ సార్లు గుర్తు చేస్తున్నారు. 70% శాతం తక్కువేమీ కాదండి.
ధరలో తేడా ఉన్న రెండు షాపులు నడుస్తొనే వుంటాయన్నారు. తెల్సండి.నేననేది కూడా సరిగా అదే నండి. మా ఇంటి ఎదురుగా వున్న Big Y కి పోవటం నాకు తేలిక,ధరెక్కువైనా. ఆరు మైళ్ళ దూరంలో ఉన్న వాల్మార్ట్ కెళ్ళి, పార్కింగ్ వెతుక్కోని, ఒకటి కొంటానికి వెళ్ళి పది కొని, క్యూ లో పదినిమిషాలు నించోని..ఏమంత సుఖం కాదు, వీకెండైతే తప్ప. అందుకే అన్ని రకాల షాపులకి వాటి place వాటికుంటుంది. భయం అనవసరం. ముఖ్యంగా మనదేసపు street smarts ముందు ఈ multi nationals వేగత్టం తేలిక్కాదు. వాళ్ళే కొన్నాళ్ళు చూసి బిచాణా ఎత్తేస్తారు :-)

Rao S Lakkaraju చెప్పారు...

ఏది ఏమయినా మన ఉద్దేశాలు మనం చెప్పుకున్నాము. జరిగేది ఎల్లాగూ జరగ బోతోంది. అక్షరాశ్యత గురించి నేను చెప్పటానికి కారణం. నేను U.S లో షె లట్ ర్స్ లో వాలంటీర్ గ చదువు చెప్పాను. ఉద్యోగాలు లేని వారికి retraining కి.

రెండు మూడేళ్ళ బట్టీ అమెరికా మల్టీ నేషనల్సు నడుస్తున్నది ఏసియా నుండి వచ్చే డబ్బుతో. వాళ్ళ పీజ్జా వాళ్ళ చికెన్ మొదలయినవి అమ్ముకుని. ఉన్న డబ్బు దేశం వదిలి పోతే రూపాయ ధర ఇంకా పడిపోతుంది.