ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం కర్నూలు నగరంలో 2013 ఫిబ్రవరి 9న భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
నగర శివారు నందికొట్కూరు రోడ్డులో ఉన్న అరుంధతి నగర్‌లో జరిగిన ఈ ఘోర
అగ్నిప్రమాదంలో 119 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఈ దుర్ఘటనలో రెండు
కోట్లరూపాయలకు పైబడి ఆస్తి నష్టం వాటిల్లింది. అరుంధతినగర్‌లో ఐదారేళ్లుగా
పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అక్కడ నివసించే పేదలంతా నగరంలోకి
వచ్చి పనులు చేసుకుని రాత్రికి తిరిగి ఇళ్లకు వెళ్తారు. ఎండతీవ్రత ఎక్కువ
ఉండటంతో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఒక ఇంటికి అంటుకున్న నిప్పు కాలనీ
అంతా వ్యాపించింది. అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకునే లోపు గుడిసెలన్నీ
కాలిపోయాయి. ఇళ్లలో నిల్వ ఉంచుకున్న దాన్యం, దుస్తులు, చీరలు, టివిలు ఇలా
ప్రతి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఖాళీ బూడిదయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో రెండు
కోట్ల రూపాయలకు పైబడి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
దానమయ్య అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం అప్పు చేసి తెచ్చుకున్న నాలుగు
లక్షల రూపాయల నగదు కాలిపోయింది. 500 రూపాయల నోట్లు కాలిన బూడిదలో
కనిపించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి