స్వారోస్‌డేలో వక్తల పిలుపు
రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లన్నింటినీ గురుకుల పాఠశాలలుగా మారుస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడిరచారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ, స్వారోస్(సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఓల్డ్ స్టూడెండ్స్) సంయుక్తంగా 2013 అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని రవీంద్రభారతీలో ఎస్‌ఆర్ శంకరన్ జయంతి వేడుకలు నిర్వహించారు. దాదాపు రెండువేలకుపైగా మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శంకరన్ మరణించినా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, పీపుల్ ఐఎఎస్‌గా పేరొందారని, ఆయన సామాజిక స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. శంకరన్‌ను ఆదర్శంగా తీసుకుని గురుకుల విద్యాసంస్థల అధికారులు, ఉపాధ్యాయులు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ పాఠశాలలను స్థాపించిన ఘనత శంకరన్‌కు దక్కుతుందన్నారు. సబ్‌ప్లాన్ ద్వారా ఈ సంవత్సరానికి గురుకుల విద్యాసంస్థలకు 9వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. డిజిపి బి ప్రసాదరావు మాట్లాడుతూ అట్టడుగు నుంచి వచ్చిన డాక్టర్ భీంరావ్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ూన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రవీణ్‌కుమార్ సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. అవకాశాలు వాటంతట అవి రావని వాటిని వెతుక్కుంటూ మనమే వెళ్లాలని అన్నారు. మహాభారతంలోని ఏకలవ్యుని జీవితాన్ని ూటంకిస్తూ మనసులో ఫలానా దాన్ని సాధించాలనుకున్న వారికి లక్ష్యమే ముందుంటని చెప్పారు. లక్ష్యాలు ూన్నతంగా ూన్నప్పుడు వాటిని చేరుకోవడం కష్టం కాదని సూచించారు. రిటైర్డ్ ఐఎఎస్, ఎఐసిసి ఎస్సీసెల్ ఛైర్మన్ కె రాజు మట్లాడుతూ కార్యాలయాలను నడిపే వారందరూ నాయకులు కారని, వ్యవస్థను ప్రభావితం చేయగలిగిన వాడు నాయకుడని అన్నారు. పేదరికం అసమానతలు పోవడానికి అట్టడుగున్న వారంతా విద్యావంతులు కావాలని సూచించారు. కలలు ూన్నతంగా కని సాకారం చేసుకున్ననాడే నిజమైన సాధికారత అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ.. ఎస్‌ఆర్ శంకరన్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. శంకరన్ టిఎస్ కృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశారన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఐపిఎస్ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. స్వారోస్ అనేది ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌గా ఏర్పడుతుందన్నారు. ప్రతి విద్యార్థి కచ్చితంగా ఆంగ్లం నేర్చుకోవాలని, ప్రణాళికతో ముందుకెళ్లాలని, స్వారోస్ అందరూ ఎక్కడ ఉన్నా పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఆత్మగౌరవంతో బతకాలంటే ూన్నత శిఖరాలను అధిరోహించాలని స్వారోస్‌కు పిలుపునిచ్చారు. అందుకు పది ూన్నతమైన నినాదాలు చదిరి అందరితో పలికించారు. అనంతరం ఎస్‌సి కమిషన్ ఓఎస్‌డి సుబ్బారావు, డిక్కీసౌత్ ఇండియా కో`ఆర్డినేటర్ నర్రా రవికుమార్, పాల్ దివాకర్ మాట్లాడారు. జెఎన్‌యు ప్రొఫెసర్ గోపాల్‌గురు, జైభీం యూత్ అధ్యక్షులు ఆర్ సురేష్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు శంకరన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహబుబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది.అంతకు ముందు ఆలేరు విద్యార్థులు చక్కటి గీతం వినిపించారు. సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ విద్యాసంస్థలు సాధిస్తున్న విజయాలపై వీడియో ప్రదర్శన చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి