2013 డిసెంబర్ 26న అరవింద్‌కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రివాల్ మంత్రివర్గం కూడా ఖరారైనట్లు సమాచారం. గిరీష్ సోని, సతేందర్‌జైన్, సురభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి, మనీష్ సిసోడియా, రాఖీ బిర్లా తదితర ఆరుగురు సభ్యులకు తొలివిడతగా స్థానం లభించినట్లు ఆ పార్టీ వర్గాల కథనం. ఈ నెల 26న రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణస్వీకారోత్సవంలో కేజ్రీవాల్‌తో పాటు మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు మంగళవారం ఉదయం ఢిల్లీ ప్రధాన కార్యదర్శి డి.ఎం.సపోలియా కేజ్రీవాల్‌ను కలిసి అధికార నివాసం, భద్రతకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అయితే వ్యక్తిగత సెక్యూరిటీకి, అధికార నివాసానికి ఆయన తిరస్కరించినట్లు పార్టీ నేత శిశోడియా విలేకరులకు తెలిపారు. కాగా పోలీసులు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తామని చెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం.
ప్రిన్సిపల్ సెక్రటరీగా రాజేందర్ కుమార్?
ఢిల్లీ పగ్గాలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీ వాల్‌కు సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేందర్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించ ను న్నారు. 47 ఏళ్ల కుమార్ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
బిజెపి ఆగ్రహం
కేజ్రివాల్ కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన సీట్లు రాలేదు. మొత్తం 70 అసెంబ్లీస్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు రావాలి. అధికారం కోసం పోటీపడిన బిజెపి 32, కాంగ్రెస్ 8, ఆమ్‌ఆద్మీ 28 , ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. అవీవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆమ్‌ఆద్మీపార్టీ పదిరోజుల సమయం తీసుకుని రెండుపార్టీల్లో ఏది ఎంత ప్రమాదకరమో అంచనా వేసింది. బిజెపి, కాంగ్రెస్ రెండూ ప్రమాదకరమైనవే కాని బిజెపితో పోల్చినప్పుడు కొంత తక్కువ అవినీతి, అదేవిధంగా తక్కువ ప్రమాదకరమైనది కాంగ్రెస్ అని నిర్ధారణకు వచ్చింది. అదే విధంగా ఎక్కువ సీట్లున్న బిజెపి మద్దతు తీసుకుంటే ఎప్పుడైనా కొందరు ఎమ్మెల్యేలను కొనేసి ఆమ్‌ఆద్మీపార్టీని దెబ్బతీయవచ్చని ఆలోచించినట్లు కనబడుతుంది. అయితే కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బిజెపి జీర్ణించుకోలేక పోతుంది.2014లో దేశంలో జరిగే జనరల్ ఎన్నికల్లో కూడా బిజెపి, కాంగ్రేసేతర పార్టీలు గెలుస్తాయని గతంలో బిజెపి నేత ఎల్‌కె అద్వాని తన ట్విట్టర్‌లో పేర్కొట్లుగా జరగవచ్చనిపిస్తోంది. దేశంలో మొత్త 28 రాష్ట్రాలుంటే 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోఉంది. 10 రాష్ట్రాల్లో బిజెపి కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ూన్నాయి. ఐదు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి ఉంది. బిజెపి అధికారంలోఉన్న చత్తీస్‌ఘడ్, గోవా రాష్ట్రాల్లో ఒకటి, రెండేసి ఎంపీలున్నాయి. ఎక్కువ ఎంపీసీట్లున్న,ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బిజెపికి గడ్డు పరిస్థితులేఉన్నాయి. కాబట్టి అద్వాని చెప్పినట్లే 2014 జనరల్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిల ప్రమేయం లేని ప్రభుత్వం ఏర్పడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి