16, డిసెంబర్ 2013, సోమవారం

రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి లేఖ సారాంశమిది


                      రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు`2013ను శాసనసభకు పంపుతూ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన లేఖ   సారాంశం క్లుప్తంగా :
‘భారత ప్రభుత్వం భాగస్వాములతో విస్తృత చర్చలు, సంప్రదింపుల తరువాత , అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత మున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా రాష్ట్రాన్ని కొత్తగా  ఏర్పాటు చేయడానికి ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు `2013ను ప్రతిపాదించింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో రూపొందించిన బిల్లును ఆచరణలో సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిఉంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని భౌగోళిక సరిహద్దులను విస్తీర్ణాన్ని ఈ బిల్లు ప్రభావితం చేస్తుంది. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో కూడి ఉంటుంది. అందువల్ల, భారత రాజ్యాంగంలోని 3వ అధికరణంను అనుసరించి, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు `2013ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ 2014 జనవరి 23వ తేది నాటికి తన అభిప్రాయాలను తెలపడానికి పంపుతున్నాను.’
                                  బిల్లు ప్రతులను చింపేసిన టిడిపి, వైఎస్‌సిపి సభ్యులు 
                   . తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు డిసెంబర్‌ 16న స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు  టిడిపి అధ్యక్షడు నారాచంద్రబాబు నాయుడు కూడా లేరు. సీమాంధ్ర శాసనసభ్యులు టిడిపి, వైఎస్‌ఆర్‌సి శాసనసభ, శాసనమండలిలో గందరగోళం శృష్టించారు. బిల్లు ప్రతులను చింపేశారు.  అయితే బిఎసిలో చర్చించలేదని, ముందుగా చెప్పకుండా బిల్లు పెట్టడం సరైంది కాదని వాదించారు. సీమాంధ్ర, తెలంగాణా సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బిల్లు అధ్యయనానికి సమయం కావాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు కోరారు. రాత్రి పొద్దు పోయేదాకా నిరసన తెలిపారు. అసెంబ్లీలో నిరసన తెలిపిన వారిని అరెస్టు చేసి పార్టీ కార్యాలయాలకు తరలించారు. 

కామెంట్‌లు లేవు: