రాష్ట్ర విభజన జరిగితే బాగుంటుందని తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, అత్యధిక ప్రజలు, సీమాంధ్రలోని ప్రధాన పార్టీల నాయకులు ( సిపి(ఐ)ఎం మినహా) ఒక నిర్ణయానికి వచ్చారు. విభజన వద్దు సమైక్యంగా ఉండాలని సీమాంధ్రలో ప్రజలు , కొందరు రాజకీయ నాయకులు ఆందోళన చేశారు. రాయల తెలంగాణా కావాలని ఒకరిద్దరు రాజకీయ నాయకులు, అనంతపురం, కర్నూలు జిల్లాలోని కొందరు ప్రజలు కూడా కోరారు. సమస్యలేంటని అధ్యయనం చేశాక ప్రజల్లో పలుకుబడి ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలు(సిపిఎం మినహా) రాష్ట్ర విభజనకు అంగీకరించాయి. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆమేరకు విభజనకు అంగీకరించింది. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఐదేళ్లపాటు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. యుపిఏ భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, బిజూజనతాదళ్, ఎన్‌సిపి, బిఎస్‌పి, సిపిఐ, ఆర్‌జెడి, ఎల్‌జిపి, ప్రధాన ప్రతిపక్షం బిజెపి బిల్లుకు అనుకూలంగా మాట్లాడి ఓటేశారు. సిపిఐ(ఎం), ఎస్‌పి, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, అకాళిదల్, ఎజిపి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు. టిడిపి తెలంగాణ వాళ్లు అనుకూలంగా, సీమాంధ్ర సభ్యులు వ్యతిరేకంగా మాట్లాడారు. లోక్‌సభలో 2014 ఫిబ్రవరి18న, రాజ్యసభలో 20న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలిపారు.
కాంగ్రెస్‌లోఉండి సమైక్య వాదం వినిపించిన కొందరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ప్రయోగించి సంచలనం సృష్టించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీకి, ఎమ్మెల్యే , ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాజ్యసభలో టిడిపి ఎంపి సిఎం రమేష్ రాజ్యసభ కార్యదర్శి వద్ద వున్న టి బిల్లు ప్రతులను లాక్కోవడానికి దౌరజ్యనం చేశారు. ఆ అంశంపై సభ్యులు ప్రశ్నించడంతో క్షమాపణ చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డు పట్టుకుని రోజంతా నిరసన తెలిపిన కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రాంచందర్‌రావు సభలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. బిజెపి తెలంగాణకు అనుకూలం అంటూనే సీమాంధ్రలో సానుభూతికోసం అనేక ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ ఉద్యమాలు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాలు జరిగాయి. తరువాత తెలంగాణా ప్రజాసమితి 1971లో మర్రిచెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిరది. ఆయన నాయకత్వంలో ఉధృత పోరాటం జరిగింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆతరువాత వచ్చిన ఎన్నికల్లో మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆయనను ఖాళీగా ఉంచితే ఉద్యమాలు చేస్తారని గవర్నర్ పదవి ఇచ్చిం పంపింది. ఆతరువాత తెలంగాణ ఉద్యమం పెద్దగా జరగలేదు. టిడిపి నుంచి బయటకు వచ్చి ఇంద్రారెడ్డి తెలంగాణా ఉద్యమం ప్రారంభించి కొంతకాలం నిర్వహించి కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆపార్టీనేత రాజశేఖర్‌రెడ్తితో కుమ్మక్కయ్యారు. ఆతరువాత అనేక మలుపులు తిరిగిన ఉద్యమం 2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిని( టిఆర్‌ఎస్) ఏర్పాటు చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. 2009లో ఎన్నికలకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. ఎన్నిల తరువాత మాటమార్చారు. రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యయం పెరిగింది. దీంతో కెసిఆర్ ఆందోళన ఉదృతం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వ దిగివచ్చింది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చారు. 2010లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం అనుకున్న సమయానికి తిరిగి స్పందించ లేదని తెలంగాణా ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పడిరది. అందులో ఉద్యోగులు, ప్రజాసంఘాల చేతిల్లోకి ఉద్యమం వెళ్లింది. ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ఎక్కువ మంది ఆందోళనలోకి వచ్చారు. తెలంగాణలో2011లో 42 రోజులు సమ్మె చేశారు. అఖిల పక్ష పార్టీలతో రెండు దపాలు చర్చలు జరిపారు. కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి, బిజెపి, సిపిఐ తెలంగాణా ఏర్పాటుకు సానుకూలంగా మాట్లాడారు. కొందరు లేఖలు కూడా ఇచ్చారు. 2013 జులై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని తీర్మానం చేసింది. సీమాంధ్రలో ప్రజలు ఆందోళన చేశారు. 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రి మండలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదించింది. జిఓఎంను ఏర్పాటు చేసింది. సీమాంధ్రలో ఆందోళన ఉధృతమైంది. చివరికి 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రం స్వరూపం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు విభాగాలలో తెలంగాణా ఒకటి. మిగతా రెండు విభాగాలనూ కోస్తా ఆంధ్ర లేదా ఆంధ్ర, లేదా సర్కారు, రాయలసీమ అని పిలుస్తారు. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతుంది. ప్రస్తుత తెలంగాణా ప్రాంతం నిజాం తన రాజ్యంలోని ప్రాంతాలను రకరకాల కారణాలతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలినది తెలుగు ప్రాంతం. ప్రస్తుతం తెలంగాణా ప్రాంతంలో 10 జిల్లాలున్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. తెలంగాణా ప్రాంతంలో 10 జిల్లాలున్నాయి. దేశంలోని 7వ నెంబరు జాతీయ రహదారి, 9వ జాతీయ రహదారి ఈప్రాంతం గుండా వెళ్తుంది. హైదరాబాద్`వాడి, సికింద్రాబాద్`కాజీపేట, సికింద్రాబాద్` విజయవాడ, సికింద్రాబాద్`డోన్, వికారాబాద్`పర్బని, కాజీపేట`బల్హర్షా రైతు మార్గాలు తెలంగాణా ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. సికింద్రాబాద్, కాజీపేట రైల్వేజంక్షన్లు దక్షిణమధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్లుగా పేరెన్నికగలవి. ఆరు దశాబ్ధాల పాటు కలిసి ఉన్న తెలుగు భాష మాట్లాడే వాళ్లను రెండుగా విభజించారు.
తెలంగాణా వాదుల వాదనలు
1. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏనాడు ఆంధ్రులు అమలు చేయలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదు.
2. కృష్ణాగోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నాళ్లు వాళ్లవి. కరెండు 70 శాతం ూత్పత్తి మాది. 80 శాతం పంట రుణాలు వాళ్లవి. మూడొంతుల ఉద్యోగాలు వాళ్లవి.
3. శాంతి యుతంగా అన్నదమ్ముళ్లా విడిపోదాం.
4. తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్రప్రాంతం ఇప్పటికేచాలా ప్రయోజనం పొందింది.
5. ప్రత్యేక తెలంగాణ స్వాభిమానానికి ప్రతీక. ప్రత్యేక తెలంగాణాపై 50 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది.
6. రాజ్యాంగం ప్రకారం. చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండాను కేంద్రం ఆమోదించవచ్చు.
7. తమిళనాడుకు తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణానుంచి అంధ్రకు నీళ్లుఅందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు.
8. భౌగోళిక , చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్ తెలంగాణాలో అంతర్భాగమే.
9. విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాబైఏళ్లుగా తెలంగాణా చాలాత్యాగాలు చేసింది. ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువభాగానాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణా వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్ని చోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.
10. బడ్జెట్‌లో కేటాయింపుల్లోనూ ఆంధ్రాకే అగ్రస్ధానం.
సమైక్యాంధ్రుల వాదనలు
1. పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్లాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు.
2. తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సి నీటిని అడ్డుకుంటారు. ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది.
3. తెలంగాణానుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమేస్తారు. కోస్తాంధ్రాకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.
4. తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్ధాలు పోరాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత ూంది.
5. దేశంలో వెనుకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేది. తెలంగాణాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ూండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ూన్నాయి. ఇలాంటి విభజన కొనసాగిస్తే విభజన రేఖ ఎక్కడ గీయగలం.
6. ప్రత్యేక వాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేక వాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈసమస్య తలెత్తవచ్చు.
7. చిన్నరాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి.
8. తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు.
9 . ఐటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి స్థిమవుతున్నాయి.
ప్రత్యేకాంధ్రుల వాదనలు
1. కోస్తాలోని వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు.
2. హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధి గురించి ఎన్నడూ ఆలోచించలేదు.
3. రెండు లేదా మూడు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి?. దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా?.
4. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావసమైక్యత లేదు.
5. తెలంగాణ ప్రాంతమంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కలిసే ఉందామనడం సమంజసం కాదు.
6, ఒక వేళ తెలంగాణా ఇవ్వదలిస్తే పూర్వం భద్రాచలం డివిజన్ ను మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి.
7. ఆంధ్రులకు మరో ముఖ్యపట్టణం అవసర ఉంది. ఆరోగ్యం, విద్య, న్యాయ, వ్యాపార, సాంకేతిక పరమైన అంశాలకు హైదరాబాద్ అందరికీ అందుబాటులో లేదు.
8. కోస్తా ఆంధ్రులకు సుదీర్ఘమైన 960 కిమీ తీరప్రాంతం ఉంది. అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే అవేవీ అక్కడ పేద ప్రజలకు ఉపయోగపడటం లేదు.
9. విశాఖపట్టణాన్ని పారిశ్రామిక కేంద్రంగా , కర్నూలును న్యాయ వ్యవస్థా కేంద్రంగా , తిరుపతిని సాంస్కృతిక కేంద్రంగా మలుచుకోవచ్చు.
10. భౌగోళికంగా విడిపోవడం వల్ల తెలుగుభాషకు నష్టం లేదు. వివిధ మాండలికాలు అభివృద్ధి చెందుతాయి.
11. తెలంగాణ ఇవ్వడం వల్ల తెలంగాణ వారికి ఎంత ప్రయోజనమో ఆంధ్రావారికి అంతకు రెట్టింపు ప్రయోజనం.
సామాన్యుల వాదనలు
1. తెలంగాణా ఉద్యమాల్లాంటివి దేశమంతటా ఉన్నాయి.
2. తెలంగాణా రాష్ట్రం ఏర్పడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు చేపడితే సరిపోతుంది.
3. ఒక్క రాష్ట్రం ఏర్పడటానికే దేశంలో డబ్బులేదు.
4. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఇతర రాష్ట్ర్ర ఉద్యమాల వల్ల దేశసమైక్యత తెబ్బతింటుంది.
ఎట్టకేలకు అన్ని వాదనలకు తెరపడిరది
ఎట్టకేలకు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వ అడుగుముందుకేసింది. ఆ తరువాత డోలాయమానంలో ఉన్న బిజెపి కూడా తెలంగాణ బిల్లుకు మద్దతు తెలిపింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్య సభలో ఆమోదం తెలిపారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని, నదీ జలాల వివాదం, తదితరాలకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సి ఉంది. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా ప్రభుత్వం విభజించింది. ఈవార్తలు విని తెలంగాణలో సంభరాలు జరుపుకోగా, సీమాంధ్రలో నిరసన తెలిపారు. ఫిబ్రవరి 18న తీవ్రంగా నిరసన తెలిపారు. 20న పెద్దగా నిరసనలు కనిపించలేదు.
4 కామెంట్‌లు:
Very detailed analysis..first of all Congratulations to all Telangana people..wish you good luck on forming new governance for better lifestyle..
for Seemandhra people,there s disappointment about political game..but every setback there is a new beginning..especially Seemandhra region faced somany nature calamities in the past..but our ancestors show us great strength to rebuild their home and start new life..we never cursed on nature...we have to consider this as another congress/bjp calamity..but things will improve better soon..No need to raise another set of aligations on Semandhra people....now you got your own state..every telanganite own this state..develop better state..we will come and join your developments..be united and show the strength of telugu/indian people to the world..we will also learn some good practices from you..
This victory belongs to the people. This proud moment is dedicated to the martyrs.
thank you mr.krishna,mr.jaigottimukkula bloggers.
60 years of investment and labour of seemandhra people is being looted by the Telangana people. Congress and BJP trying to encash the situation. If Seemandhra people exploited Telangana people North Indians have been exploiting South Indians ever since the Independence.It is my personal experience that a Madrasi cab driver afraid to be identified as Madrasi at Delhi Airport. A day will come when seemandhra people want a separate country to get rid of the bossism of North Indians
కామెంట్‌ను పోస్ట్ చేయండి