నాగ్‌పూర్ : పాలకులు మారినా నేలతల్లిని నమ్ముకున్న వారి బతుకులు ఏ మాత్రం మారటంలేదు. పెట్టుబడి వర్గాలను ప్రసన్నం చేసుకోవటానికి పాలకులు చూపుతున్న శ్రద్ధ... రైతుల గురించి అసలే పట్టించుకోవటంలేదనటానికి ఎన్నో ఉదాహరణలు.. మరెన్నో సజీవసాక్ష్యాలు. దేశంలో ఎక్కువమంది జీవనాధారం వ్యవసాయం.పెట్టుబడులకోసం ప్రైవేటు అప్పుల చుట్టూ తిరగలేక..పెట్టిన పెట్టుబడులు రాక ...రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. గత్యంతరంలేక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నారు. అయినా పాలకులకు కనువిప్పు కలగటంలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చటానికి పాడి పశువులనూ అమ్మేసుకుంటున్నారు.. ఇంతగా విధి వారి జీవితాలతో ఆడుకున్నా.. కనీసం నాలుగు గింజలు పండిరచుకుందామన్న ఆరాటం రైతుల్లో కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఇద్దరు మహిళలు కాడిపడితే... మరో మహిళ విత్తనాలు వేస్తున్న దృశ్యం చూస్తే... రైతు బతుకు ఎంత దయనీయంగా మారిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయితే పొట్టకూటికి పుట్టెడు కష్టాలు మీవే అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.
ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
27, జూన్ 2015, శనివారం
కాడెద్దులను అమ్ముకుని ..కాడిపట్టిన మహిళలు
నాగ్‌పూర్ : పాలకులు మారినా నేలతల్లిని నమ్ముకున్న వారి బతుకులు ఏ మాత్రం మారటంలేదు. పెట్టుబడి వర్గాలను ప్రసన్నం చేసుకోవటానికి పాలకులు చూపుతున్న శ్రద్ధ... రైతుల గురించి అసలే పట్టించుకోవటంలేదనటానికి ఎన్నో ఉదాహరణలు.. మరెన్నో సజీవసాక్ష్యాలు. దేశంలో ఎక్కువమంది జీవనాధారం వ్యవసాయం.పెట్టుబడులకోసం ప్రైవేటు అప్పుల చుట్టూ తిరగలేక..పెట్టిన పెట్టుబడులు రాక ...రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. గత్యంతరంలేక ఆత్మహత్యలే శరణ్యమనుకుంటున్నారు. అయినా పాలకులకు కనువిప్పు కలగటంలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చటానికి పాడి పశువులనూ అమ్మేసుకుంటున్నారు.. ఇంతగా విధి వారి జీవితాలతో ఆడుకున్నా.. కనీసం నాలుగు గింజలు పండిరచుకుందామన్న ఆరాటం రైతుల్లో కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఇద్దరు మహిళలు కాడిపడితే... మరో మహిళ విత్తనాలు వేస్తున్న దృశ్యం చూస్తే... రైతు బతుకు ఎంత దయనీయంగా మారిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయితే పొట్టకూటికి పుట్టెడు కష్టాలు మీవే అన్నట్లుగా పాలకులు వ్యవహరిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి