20, నవంబర్ 2015, శుక్రవారం

నితీష్‌కుమార్‌ ప్రమాణస్వీకారం

            
             నితీష్‌ కేబినెట్‌లో మంత్రిలుగా ప్రమాణం చేసిన లాలు పెద్దకుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రమాణస్వీకార సమయంలో కొన్ని పదాలు సరిగ్గాపలకలేక పోయారు. అపేక్షితను ఉపేక్షితగా పలికారు. దీంతో గవర్నర్‌ రామ్‌నాథ్‌  లాలు తనయుడితో రెండోసారి ప్రమాణం చేయించారు. రెండోసారికూడా తేజ్‌ ప్రతాప్‌ మళ్లీ తప్పుగా చదివారు. లాభం లేదనుకుని మూడోసారి మాత్రం చెప్పకుండా గవర్నర్‌ ప్రమాణస్వీకారం ముగించారు. 

                                               పార్టీ వారీగా మంత్రి పదవులు పొందినవారు
జెడియు: రాజీవ్‌ రంజన్‌సింగ్‌ లాలెన్‌, బిజెందర్‌ప్రసాద్‌ యాదవ్‌, శ్రవన్‌కుమార్‌, జయ్‌కుమార్‌ సింగ్‌, మహేశ్వర్‌హజారి, కృష్ణనందన్‌ప్రసాద్‌వర్మ, సంతోష్‌నిరా, ఖుర్షిద్‌నందన్‌ ఫిరోజ్‌ అహ్మద్‌, శైలేష్‌కుమార్‌, కుమారిమంజువర్మ, మదన్‌సాహ్ని, కపిల్దేవ్‌కామత్‌
ఆర్‌జెడి: తేజశ్వియాదవ్‌, తేజ్‌ప్రతాప్‌యాదవ్‌, అబ్దుల్‌బారి సిద్ధిఖ్‌, అబ్ధుల్‌గఫూర్‌,  విజయ్‌ప్రకాశ్‌,  చంద్రికారాజ్‌, అలోక్‌కుమార్‌మెహతా, రామ్‌విచార్‌రాయ్‌, శోచందర్‌రామ్‌, మునేశ్వర్‌చౌదరి, చంద్రశేఖర్‌, అనితాదేవి,
కాంగ్రెస్‌ : అశోక్‌చౌదరి, మదన్‌మోహన్‌జా, అబ్దుల్‌జలీల్‌ మస్తాన్‌, అవదేశ్‌కుమార్‌ సింగ్‌.

  అంగరంగవైభవంగా బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. 2015 నవంబర్‌ 20న శుక్రవారం బీహార్‌ రాజధాని పాట్నాలోని గాంధీమైదానంలో నితీష్‌కుమార్‌ సహా పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మహోత్సవానికి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ,  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తొమ్మిది రాష్ట్రా ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్‌ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో  జెడియు 12, ఆర్‌జెడి 12, కాంగ్రెస్‌ నలుగురికి మంత్రి పదవులు దక్కాయి.  ఎన్నికల్లో మహాకూటమి మొత్తం 243 అసెంబ్లీస్థానాల్లో 178 శాసనసభస్థానాలను సొంతం చేసుకుంది. అందులో ఆర్‌జెడి 80, జెడియు 71, కాంగ్రెస్‌ 27 సీట్లు గెలుచుకున్నాయి.

కామెంట్‌లు లేవు: