2017 మార్చి 6న అంత్యక్రియలు
అవధాన సౌర్వభౌముడిగా, అవధాన పితామహుడుగా పేరుగాంచిన డాక్టర్ కడప వెంకటసుబ్బన్న (88) 2017 మార్చి 5న (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటకు తుదిశ్వాస విడిచారు. కొంతకా లంగా అనారోగ్యంగా ఉండడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. 1929 నవంబర్ 12న ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరంలో జన్మించిన సివి సుబ్బన్న ప్రాథమిక విద్య ప్రొద్దుటూరులో పూర్తి చేశారు. ఇంటర్ మీడియట్ విద్యను మదనపల్లెలో అనంతరం ఎంఎ డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాయంలో పూర్తి చేశారు. డాక్టర్ సుబ్బరామప్ప పర్యవేక్షణలో ‘అవధాన విద్య’ అనే అంశంపై పరిశోధన చేసి మైసూర్ విశ్వవిద్యాయం నుండి పిహెచ్‌డి పట్టాను తన 52వ ఏట 1981లో పొందారు. ఇంటర్ మీడియట్ చదువుతున్న సమయంలోనే 1950లో శివరాత్రి పర్వదినాన తొలి సారి అవధాన ప్రక్రియలో పాల్గొన్నారు. అవధాన ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు పేరుపొందిన కవులు ఉన్నారు. వారిలో ఇద్దరు తిరుపతి వెంకటకవులైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి , దివాకర్ల తిరుపతి శాస్త్రి కాగా మూడవ వ్యక్తి సివి సుబ్బన్న. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మృతిచెందిన నాటినుంచి సుబ్బన్న అవధానం ప్రారంభించారు. తెలుగు ముంగిళ్ళల్లో అవధానం కనుమరుగు అవుతున్న సమయంలో జనం మధ్యకు అవధానాన్ని తీసుకెళ్ళి ఆ కళను సుసంపన్నం చేసిన ఘనుడు సివి సుబ్బన్న. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శివైక్యం పొందిన 1950 సంవత్సరం మహాశివరాత్రి నాడు సుబ్బన్న అవధానం ప్రారంభించడం యాదృచ్చికం. సుబ్బన్న ఐదువందలకు పైగా అవధానాలు చేశారు. సుబ్బన్నకు 1964లో గుంటూరు జిల్లా భట్టిప్రోలులో కనకాభిషేకం చేసి గజారోహణ మహోత్సవం నిర్వహించారు. 1965లో ఇదే జిల్లా తెనాలిలో అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్ బెజవాడ గోపాల్‌రెడ్డి సుబ్బన్న వామపదానికి గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు. పది పర్యాయాలు కనకాభిషేకం పొందడం విశేషం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, పీఠాధిపతుల ద్వారా సత్కారాు, సన్మానాలు అనేకం. కృష్ణదేవరాయ విశ్వవిద్యాయం గౌరవ డి.లిట్ పట్టా ఇచ్చి సుబ్బన్నను గౌరవించింది. శతవధాన సభలో ఉద్దండుడైన కవులను, పండితులను తన కవితా వాక్ఫటిమతో ఎదుర్కొన్న శతావధాని సివి సుబ్బన్న. ఆయన 15 కావ్యాులు, నాలుగు శతకములు, రెండవ వచనముతో పాటు 1955లో చెంచుక్ష్మి నాటకాన్ని రచించారు. ఐదు ప్రబంధాలు రాశారు. వ్యాసవిలాస ప్రబంధం, కబీర్‌దాస్ ప్రబంధం, బీబీ నాంచారి ప్రబంధం, భద్రాచలరామదాసు ప్రబంధం రాశారు. నాలుగు లఘు కావ్యాు లు రచించారు. సివి సుబ్బన్నపై అష్టావధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు, లక్ష్మణ కుమారశస్టి, బి.సూరి, చెన్నారెడ్డి లఘు గ్రంధాలు రాశారు. ఆయన అవధాన సంపుటాలు 3 అచ్చయ్యాయి.
రెండు తెలు గు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో శిష్య బృందం ఉంది. ప్రముఖ అవధాన శిశ్యులలో అష్టావధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు ఒకరు. కవులు డాక్టర్ సి.నారాయణరెడ్డి, నండూరి కృష్ణమాచార్యు, గడియారం వెంకటశాస్త్రి, పుట్టపర్తి నారాయణచార్యులు, కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి మొదలగు వారిచే ప్రశంసలు పొందారు. స్వయంకృషితో సాహితీదిగ్గజంగా ఎదిగిన సివి సుబ్బన్న పేరుతో విశ్వవిద్యాయాలు ‘ సివిసుబ్బన్న అవధాన సాహితీపీఠం’ ఏర్పాటు చేయాలని ఆయన రచనలపై పరిశోధనలు చేయించాలని ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించాలని రచయితల జిల్లా సంఘం అధ్యక్షుడు జింకా సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. సుబ్బన్న అంత్యక్రియలు సోమవారం పద్మశాలీయ స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సంతాపం
అవధాన శిశ్యులలో ప్రముఖులు అష్టావధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సివి సుబ్బన్న అస్తమయం పట్ల ప్రఘాడ సంతాపాన్ని ప్రకటించారు. తిరుపతి వేంకట కవుల తరువాత అంతటి పేరుగాంచిన సివి సుబ్బన్న లేని లోటు సాహితీ లోకానికి తీర్చలేనిదని పేర్కొన్నారు. ఆయన స్వయం సాధనతో అవధాన విద్యలో అత్యున్నతస్థాయికి ఎదిగారని తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి