హైదరాబాద్ మహా
నగరంలో ఎటుచూసినా పండుగ వాతావరణమే. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు
పలుకరిస్తున్నాయి. హరిదాసుల పాటలు. గంగిరెద్దుల ఆటలు.. సంప్రదాయ
వస్త్రధారణతో మెరిసిపోతున్న చిన్నారులతో సంక్రాంతి ముందుగానే
వచ్చినట్టుంది. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు
ఒక్కచోటకు చేరి రంగవల్లికలు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలకు భోగిపండ్లు
పోస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. చదువులు.. ర్యాంకుల మధ్య పోటీ పడుతున్న ఈ
తరం పిల్లలకు పండుగల గొప్పతనం తెలిపేందుకు పలు పాఠశాలలు, కళాశాలల
నిర్వాహకులు వేడుకల ఏర్పాటు చేస్తున్నారు. వేషధారణలు, ముత్యాల ముగ్గుల
పోటీలు పెడుతున్నారు. సంప్రదాయ పిండివంటలను రుచి చూపుతున్నారు.
నగరంలోని
పలు చోట్ల పండుగ గొప్పతనం వివరించేలా సాంస్కృతిక ప్రదర్శనలు
నిర్వహిస్తున్నారు. నిజాంపేటలో ఉండే.. రమణి, సువర్ణ, సుజాత.. మూడేళ్లుగా
తాము ఇక్కడే సంక్రాంతి చేసుకుంటున్నట్లు చెప్పారు. చిన్నప్పుడు తాము చూసిన
సంక్రాంతి... గడిపిన బాల్యాన్ని గుర్తుచేస్తూ పిల్లలతో నాటి ముచ్చట్లను
పంచుకుంటున్నట్లు వివరించారు. మెదక్ నుంచి గంగిరెద్దులను రప్పించి..
పిల్లలకు హరిదాసుల వేషధారణతో ఇళ్ల ముందు ఉత్సవాలు చేసుకుంటూ పల్లె
వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. నిత్యం పని
ఒత్తిళ్లతో సతమతమయ్యే మహిళలు, యువతులు అందరూ ఒక్కచోట చేరుతున్నారు.
అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు భోగిపండ్లు పోస్తున్నారు. నూతన వస్త్రాలు
పంపిణీ చేస్తున్నారు. తెల్లవారుజామునే.. భోగిమంటలు వేసి.. కొత్త సరదాలను
ఆస్వాదిస్తున్నారు.
పేడ కావాలా.. పిడకలు పంపాలా!
సంక్రాంతి... పది రోజులు ముందుగానే.. పల్లెల్లో పండుగ మొదలవుతుంది. ఉదయం, సాయంత్రం.. ఇంటిముందు కళ్లాపి చల్లి... అందమైన ముగ్గులు వేస్తారు. ఆవుపేడతో గొబ్బెమ్మలు చేస్తారు. పూలు, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. గ్రామాల్లో ఆవులు, గేదెలు ఉంటాయి కాబట్టి పేడకు కొదవ ఉండదు. ఇది మహానగరం... సంప్రదాయంగా పండుగ చేసుకునేందుకు నానాతంటాలు పడాల్సిందే. నాలుగయిదు రోజులు ముందుగా ఆర్డరిస్తే తప్ప ఏదైనా దొరకని పరిస్థితి. భోగి మంటలకు పిడకలు, గొబ్బెమ్మలకు పేడ కావాలి. ఈ రెండింటినీ తామే అందిస్తున్నామంటున్నాయి... కొన్ని ఈ-కామర్స్ సంస్థలు. ఆవు పేడ ముద్ద ఒక్కొక్కటీ రూ.60, 70కు విక్రయిస్తున్నాయి. ఎండిన ఆరు పిడకలు రూ.110-120, పెద్దసైజువి కావాలంటే రెండూ రూ.160 వరకూ వసూలు చేస్తున్నాయి. భోగిమంటలకు కావాల్సిన సామగ్రినీ ఆన్‌లైన్‌లో ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు.

నోరూరించే.. సంప్రదాయ రుచులు
రోజూ అదే
దోసె.. అదే బిర్యానీ.. పండుగరోజైనా సంప్రదాయ వంటలు రుచి
చూద్దామనుకుంటున్నారా... సొంతూరు వెళ్లలేక ఇక్కడే ఉన్నారా! అయినా ఏం
పర్లేదు.. అచ్చమైన తెలుగు రుచులు.. పల్లెల్లో అమ్మమ్మ/నానమ్మలను గుర్తు
చేసే చేతి వంటలను మీ చెంతకు చేరుస్తామంటున్నారు కొందరు. పండుగ సందర్భంగా
నగరంలోని కొన్ని హోటళ్ల నిర్వాహకులు సంక్రాంతి ప్రత్యేక ఆహారోత్సవాలు
నిర్వహిస్తున్నారు. పులిహోర, నాటుకోడికూర, పప్పుచారు, అరిసెలు, బందరు
లడ్డు, బూందీ లడ్డు, పెరుగు ఆవడలను అందిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో
కుటుంబ సభ్యులతో కలిసి విందు ఆరగించేందుకు రమ్మంటూ ఆహ్వానిస్తున్నారు.
రూ.600 నుంచి ప్రారంభ ధర నిర్ణయించారు. పండుగ రోజు బయటకు ఏం వెళ్దాములే...
అని అనుకునే వారికి.. కోరుకున్న పిండివంటలు, ఇష్టపడే ఆహార పదార్థాలను
ఇళ్లకే పంపుతామంటున్నారు కొందరు మిఠాయి దుకాణాల నిర్వాహకులు. అరిసెలు,
బొబ్బట్లు, కజ్జికాయలు, జంతికలు, గవ్వలు, చెక్కలు, సున్నుండలు, పూతరేకులను
ప్రత్యేక ఆఫర్లతో అందిస్తున్నారు. మరికొందరు పులిహోర, పాయసాలనూ రుచి
చూపుతున్నారు.
ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు
తెలుగు వారు ఎంతదూరం వెళ్లినా సంప్రదాయాలను వదలరు. పండుగలను అస్సలు విస్మరించరు. అయినవారి మధ్య జరుపుకోలేని సంబరాలను... చుట్టూ ఉన్నవారితో పంచుకోవటం ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు. ఎంతటి ఆధునికత పలుకరించినా.. సాంకేతిక పరిజ్ఞానం చేరువైనా.. తెలుగింట.. సంక్రాంతి తెచ్చే ఆనందమే వేరు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా నగరవ్యాప్తంగా స్థిరపడ్డారు. ఉద్యోగ.. వ్యాపార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. వివిధ కారణాల వల్ల సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడ ఉండిపోయారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వటంతో సమయం సద్వినియోగమయ్యేలా అమ్మాయిలకు ముగ్గులు వేయటం నేర్పిస్తున్నామంటున్నారు బంజారాహిల్స్ నివాసి రత్న.

సరదా... సంబరం
సంక్రాంతి
అంటే ఓ సరదా.. సంబరం.. ఆత్మీయుల మధ్య చేసుకునే అందమైన వేడుక. ఏడాదిలో వచ్చే
తొలిపండుగ. మూడురోజుల ముచ్చటైన సంతోషం. అరిసెలు. గారెలు.. చక్కిలాలు..
నోరూరించే పిండివంటలు. పిల్లలు.. పెద్దలు.. కుటుంబ సభ్యుల సంతోషతీరం.
చిన్నారులకు భోగిపళ్లు.. యువతకు సరదా పందేలు. ఇప్పటికే చాలామంది నగరవాసులు
సొంతూళ్లలో బంధువులతో కలిసి పండుగ చేసుకునేందుకు పల్లెబాట పట్టారు. ఇక్కడే
ఉన్నవారు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో
పాల్గొంటున్నారు. రెండు మూడు రోజులుగా ప్రతి ముంగిటా పండుగ వాతావరణం
కనిపిస్తోంది. ముంగిళ్లలో తీర్చిదిద్దిన రంగవల్లికలు.. ముచ్చటగా కనిపించే
గొబ్బెమ్మలతో చాలా ముందుగానే సంక్రాంతి వచ్చిందా అనిపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి