నిషేధం విధించిన చైనా యాప్స్‌కు భారత్ 79 ప్రశ్నలు
జూలై 22లోగా స్పందించకపోతే...
న్యూఢిల్లీ: నిషేధం విధించిన 59 చైనా యాప్స్ యాజమాన్యాలకు 79 ప్రశ్నలతో కూడిన నోటీసులను భారత్ పంపింది. ఈ నోటీసులో పంపిన ప్రశ్నలకు మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని సదరు యాప్స్‌కు స్పష్టం చేసింది. జూలై 22 లోపు స్పందించకపోతే 59 యాప్స్‌ను శాశ్వతంగా నిషేధిస్తామని భారత్ హెచ్చరించింది. ఈ యాప్స్ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి, గ్లోబల్ సైబర్ వాచ్‌డాగ్స్ నుంచి భారత్ ఇప్పటికే డేటా తెప్పించుకున్నట్లు సమాచారం.
సదరు యాప్స్ స్పందనకు, తెప్పించుకున్న డేటాకు పొంతన సరిపోయిందో లేదో భారత్ పోల్చి చూడనుంది. ఏమాత్రం వ్యత్యాసం కనిపించినా ఈ యాప్స్ భారత్‌లో మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. యాప్స్ కార్పొరేట్ మూలాలు, మాతృ సంస్థల నిర్మాణం, నిధులు, డేటా మేనేజ్‌మెంట్, కంపెనీ సర్వర్లకు సంబంధించి చైనీస్ యాప్స్‌కు పంపిన ఆ 79 ప్రశ్నల్లో భారత్ ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి