16, మే 2021, ఆదివారం

అభ్యుదయ కవి అదృష్టదీపక్‌ కన్నుమూత

కాకినాడ (తూర్పు గోదావరి) : అభ్యుదయ కవి, సినీ గీత రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ అదృష్టదీపక్‌ (71) కన్నుమూశారు. కరోనా సోకిన ఆయన కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిజాన్ని నిర్భయంగా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి ఆయన. సాహిత్యంలో ఇంచుమించు అన్ని ప్రక్రియల్లోనూ అదృష్టదీపక్‌ ప్రవేశించారు. కేవలం సాహిత్యంలో ప్రవేశించడమే కాదు-వచన కవిత రాసినా, ఉద్యమ గీతం రాసినా, సినిమా పాట రాసినా, విమర్శ రాసినా, వ్యాసం రాసినా తనదైన ముద్ర బలంగా కొట్టాడుకవిగా, కధకుడిగా, విమర్శకుడిగా, వక్తగా, అధ్యాపకుడిగా, నాటక న్యాయనిర్ణేతగా ఆయన పేరుగాంచారు. రాష్ట్ర ప్రభుత్వం అదృష్టదీపక్‌ కు ఉత్తమ అధ్యాపక అవార్డునిచ్చి సత్కరించింది. సినిమా రంగం 'కళాసాగర్‌' అవార్డు ఇచ్చి ప్రశంసలు కురిపించింది. సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటీ భారతం చిత్రంలో రచించిన గేయానికి ఆయన నంది అవార్డు పొందారు.

వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబంలోనుండి..
అదృష్టదీపక్‌ జనవరి 18 వ తేదీన 1950 లో తూర్పు గోదావరి రామచంద్రపురంలో జన్మించారు. వామపక్ష భావజాలంతో నిండిన కుటుంబం నుంచి వచ్చిన అదఅష్టదీపక్‌ విద్యార్థి దశనుంచీ చేసిన కఅషి ఫలితంగా వీరి కవితలు, పాటలు, కథలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు ఆంధ్రదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ ప్రచురించాయి. విశాలాంధ్ర, స్వాతి, వికాసం, మొదలగు పత్రికలూ, సంస్థలూ నిర్వహించిన పోటీలలో ఉత్తమ కవిగానూ, ఉత్తమ కథారచయితగానూ బహుమతులు పొందారు.

ప్రచురిత గ్రంథాలు :
1. కోకిలమ్మ పదాలు (1972) 2. అగ్ని (1974)
3. సమర శంఖం(1977) 4. ప్రాణం (1978)
5. అడవి (2008) 6. దీపకరాగం (2008)
7. ఆశయాల పందిరిలో (2010) 8. శ్రీశ్రీ ఒక తీరని దాహం (2010)

ఇవికాక అనేక ప్రసిద్ధ సంకలనాలలో వీరి రచనలు చోటుచేసుకున్నాయి. బెర్ట్రోల్డ్‌ బ్రెహ్ట్‌ పాబ్లో నెరూడాల కొన్ని కవితలను తెలుగులోకి అనువదించారు. 'ఉదయం' దినపత్రికలో ఒక సంవత్సరం ప్రతి ఆదివారం 'పదసంపద'శీర్షిక నిర్వహించారు. విజయవాడనుంచి వెలువడుతున్న 'చినుకు' మాసపత్రికలో మూడేళ్ళపాటు 'దీపకరాగం' శీర్షిక నిర్వహించారు. ప్రస్తుతం 'సాక్షి' దినపత్రిక ఆదివారం అనుబంధం 'ఫన్‌ డే'లో ప్రారంభ సంచికనుంచీ 'పదశోధన'శీర్షిక నిర్వహిస్తున్నారు. ఎన్నో నాటక కళాపరిషత్తులలో ఉత్తమ నటుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ కేరక్టర్‌ నటుడు వంటి అవార్డులు పొందారు. గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ లో అనేక ప్రముఖ నాటక కళాపరిషత్తులలో న్యాయనిర్ణేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ లు అదఅష్టదీపక్‌ కథలూ, కవితలూ, కార్యక్రమాలూ ఎన్నోసార్లు ప్రసారం చేశాయి. కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్‌ హిందీలోకి అనువదించారు. 1980లో మాదాల రంగారావుద్వారా 'యువతరం కదిలింది' చిత్రంలో 'ఆశయాల పందిరిలో'గీతరచనతో సినిమా రంగ ప్రవేశం చేశారు.
    ఇంకా విప్లవశంఖం, నవోదయం, నేటిభారతం, దేశంలో దొంగలుపడ్డారు, ప్రజాస్వామ్యం, నవభారతం, భారతనారి, ఎర్రమందారం, అన్న, మా ఆయన బంగారం, దేవాలయం, వందేమాతరం. అర్ధరాత్రి స్వతంత్రం, కంచుకాగడా, జైత్రయాత్ర, స్వరాజ్యం, బదిలీ, సగటుమనిషి, నవయుగం, వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో గీతరచన చేశారు.

అదృష్టదీపక్‌ కఅషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులూ, రివార్డులూ లభించాయి.

1. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ ద్వారా 'నేటిభారతం' చిత్రంలో 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో 'కళాసాగర్‌' అవార్డు (1984) పొందారు.

2. 2003 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డును అందుకున్నారు

3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003) పొందారు.

4. రామచంద్రపురం మోడరన్‌ ఫౌండేషన్‌ వారి 'కళానిధి' అవార్డు, సాహితీ పురస్కారం (2004) పొందారు.

5. రావులపాలెం సి.ఆర్‌.సి. నాటక పరిషత్‌ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం
ఉగాది పురస్కారం (2005) పొందారు.

6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌. సురేష్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్‌.బి.ఎస్‌.ఆర్‌.
కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004) అందుకున్నారు.

7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా 2006 లో నియామకమయ్యారు.

8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం (2008) పొందారు.

9. అభ్యుదయ రచయితల సంఘం, విశాఖ శాఖ అధ్వర్యంలో టర్నర్‌ చౌల్ట్రీలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో 'పురిపండా సాహితీ
పురస్కారం' (2009) అందుకున్నారు.

10. కాకినాడ, అల్లూరి సీతారామరాజు కళావేదిక రజతోత్సవాలలో 'అల్లూరి సీతారామరాజు స్మారక పురస్కారం' (2010) పొందారు.

11. విజయవాడ, ఎక్స్‌ - రే అధ్వర్యంలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలలో 'శ్రీశ్రీ సాహితీ పురస్కారం' (2010) అందుకున్నారు.

12. గుంటూరు జిల్లా, అరసం అధ్వర్యంలో 'కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం' (2010) పొందారు.

13. హైదరాబాదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే 'సఅజనాత్మక సాహిత్యం' లో 'కీర్తి పురస్కారం' (2010) అందుకున్నారు.

14. 'కవిరాజు త్రిపురనేని రామస్వామి - నార్ల వెంకటేశ్వర రావు' 'వారసత్వ సెక్యులర్‌ అవార్డు' (2011) పొందారు.

15. విశాఖపట్నం, కళాభారతి ఆడిటోరియంలో జాలాది కల్చరల్‌ ట్రస్ట్‌ వారిచే 'జాలాది సాహితీ పురస్కారం' (2012) అందుకున్నారు.

16. కొత్తపేటలో నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ - చాన్సలర్‌ శ్రీ జార్జి విక్టర్‌ ద్వారా 'శ్రీనాథ రత్నశిల్పి వుడయార్‌ కళాపురస్కారం'(2012) పొందారు.

17. కాకినాడ సూర్యకళామందిరంలో రాష్ట్ర మంత్రి శ్రీ తోట నరసింహం ద్వారా 'తెలుగు నాటకరంగ దినోత్సవ పురస్కారం' (2013) అందుకున్నారు.

అవార్డులూ రివార్డులూ :

1. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ ద్వారా 'నేటిభారతం' చిత్రంలో 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో 'కళాసాగర్‌' అవార్డు (1984)ను దీపక్‌ అందుకున్నారు.

2. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003) పొందారు.

3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003) పొందారు.

4. రామచంద్రపురం మోడరన్‌ ఫౌండేషన్‌ వారి 'కళానిధి' అవార్డు మరియు సాహితీ పురస్కారం (2004) అందుకున్నారు.

5. రావులపాలెం సి.ఆర్‌.సి. నాటక పరిషత్‌ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం, ఉగాది పురస్కారం (2004) అందుకున్నారు.

6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కె.ఆర్‌. సురేష్‌ రెడ్డి, రాష్ట్రమంత్రి జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్‌.బి.ఎస్‌.ఆర్‌ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004) ను అందుకున్నారు.

7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006) అయ్యారు.

8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008) పొందారు. కఅత్తివెంటిపేర్రాజు పంతులు జాతీయ పాఠశాల శతాబ్ది ఉత్సవాలలో దీపక్‌ సన్మానించబడ్డారు. కొత్తపేటలో శ్రీనాథరత్నశిల్పివుడయార్‌ కళాపురస్కారాన్ని అదృష్టదీపక్‌ అందుకున్నారు.

కామెంట్‌లు లేవు: