28, ఆగస్టు 2010, శనివారం

నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే…



            1871 నవంబర్ 18 తేదీన చిలీలోని కాన్సెప్షన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన ప్రశ్నలు-జవాబులు నుంచి తయారుచేసిన వ్యాసమిది.
 నేనొక భూస్వామి కొడుకునిఅదే నేనో విప్లవకారునిగా తయారవ్వడానికి కారణం. ధనికుల పిల్లలు చదివే మతపరమైన పాఠశాలలో నేను చదువుకుననానువిప్లవకారున్ని కావడానికి మరో కారణమిది. అన్ని సినిమాలు, ప్రచురణలు, టీవీ పేపర్లు లాంటి మాస్ మీడియా అంతామేడిన్ అమెరికాఅని చెప్పుకోదగిన క్యూబాలో నేను నివశించేవాడినిఇది మూడో కారణం. పదిహేను వేలమంది చదువుకునే యూనివర్శిటీలో కేవలం ముప్పై మంది మాత్రమే సామ్రాజ్య వాద వ్యతిరేకులుంటే చివరి ముప్పైవ వాడిని నేను. నేను యూనివర్శిటీలో అడుగుపెట్టడం ఒక భూస్వామి కొడుకుగాఇంకా చెప్పాలంటే దరిద్రంగా ఒక రాజకీయ నిరక్షరాస్యునిగా!
ఒక్కటి గుర్తుంచుకోండి. పార్టీ సభ్యుడు గాని, కమ్యూనిస్ట్ గాని, సామ్యవాది గాని, లేదా మరే ఇతర అతివాది గాని నన్ను పట్టుకోలేదు, నాకే సిద్ధాంతమూ బోధించలేదు. లేదంటే నమ్మండి. నాకో పెద్ద, బరువైన, చదవశక్యంకాని, అర్థంకాని, భరింపశక్యంకాని పాఠ్య పుస్తకమొకటి ఇచ్చారు. పుస్తకం బూర్జువా దృష్టికోణంలో రాజకీయ ఆర్థిక విషయాలను వివరించే ప్రయత్నం చేసేదిదాన్నే వాళ్లు రాజకీయ ఆర్థిక శాస్త్రమని పిలిచేవాళ్లు!
అధికోత్పత్తి వల్ల వచ్చే సంక్షోభాలు, తదితర సమస్యలు ప్రపంచంలో సర్వసామాన్యం అన్నట్టు భరింపశక్యంకాని పుస్తకం బోధించేది. ఒకసారి బ్రిటన్ లో ఇబ్బడిముబ్బడిగా బొగ్గు లభించినపుడు ఏం జరిగిందో వివరించేది. కార్మికుల వద్ద బొగ్గు ముక్క ఉండేది కాదు. అయితే మార్చలేని, మార్చశక్యంకాని చారిత్రక, సాంఘిక, ప్రకృతి నియమాలవల్ల అధికోత్పత్తి తప్పదని, పరిస్థితుల్లో నిరుద్యోగం, ఆకలిచావులు తప్పవని పుస్తక వివరణ. బొగ్గు ఎక్కువైతేనట కార్మికులకు పని దొరకదట, ఆకలితో చచ్చిపోతారట. హతవిధీ!
అలా భూస్వామి కొడుకు, బూర్జువా స్కూల్లో చదువుకుని అమెరికా ప్రచారంలో పెరిగిన వాడు, వ్యవస్థలోనే ఏదో లోపముందని ఆలోచించడం ప్రారంభించాడు. అది అర్థం లేనిదని అనుకోసాగాడు
ధనికుడిగా మారిన ఒక పేదవాని కడుపున పుట్టిన నాకు కనీసం పల్లెటూరిలో పెరగగలిగిన అవకాశం, బీదలతోను, రైతులతోను స్నేహంగా మెలగ గలిగిన వీలు దొరికాయి. అదే మా తాత ధనిక భూస్వామి అయ్యుంటే మా నాన్న పట్నానికి పట్టుకుపోయి, ధనికులతోనే సహవాసం చేసుండేవాడిని. అప్పుడు సానుకూల అలోచనలు వచ్చే అవకాశం ఉండేదికాదేమో. అహంకారంలాంటి మానవ సహజ వ్యతిరేక భావాలు అబ్బేవేమో.
అదృష్టవశాత్తు నేను చదువుకున్న పాఠశాలలు కొన్ని సానుకూల భావాలు నేర్పాయి. కొంత ఆదర్శాత్మక హేతుబద్దత, మంచి చెడులనే భావన కొంత, న్యాయాన్యాయాల విచక్షణ, నిర్బంధం పీడనల పట్ల ఎదురు నిలిచే తిరుగుబాటు ధోరణి మొదలైనవన్ని మానవ సమాజం పట్ల విస్లేషణ కావించుకోవడానికి తోడ్పడ్డాయి. అవే తర్వాత నా అవగాహన మేరకు ఆదర్శ కమ్యూనిస్టుగా మార్చాయి. సమయానికి నాకింకా కమ్యూనిస్టును కలిసే, పార్టీ డాక్యుమెంట్ చదివే అదృష్టం కలగలేదు.
అనుకోకుండా ఒకరోజు కమ్యునిస్ట్ మేనిఫెస్టోప్రసిద్ధమైన కమ్యునిస్ట్ ప్రణాళికనా చేతుల్లోకి వచ్చింది. నేనెప్పటికీ మర్చిపోలేని కొన్ని సంగతులు చదివానుఏం మాటలు, ఏం నిజాలు? అందులోని నిజాల్ని ప్రతిరోజు కళ్లెదురుగా చూసేవాళ్లం.
అదంతా నాకెలా అనిపించిందంటే దుర్గమారణ్యంలో జన్మించి అయోమయంగా ఉన్న చిన్న జంతువులాగ అయ్యాను. అలాంటి స్థితిలో ఉన్న అతడికి అడవిలో దారులన్నీ వివరంగా విప్పిచెప్పే చిత్రపటం దొరికిందనుకోండి. ఒక పెద్ద పెన్నిధి దొరికిననట్లే భావించాను. మళ్లీ పరికించి చూడండిమార్క్స్ భావాలు, సరియైనవి కావా, న్యాయమైనవి కావా, ప్రేరణందించేవి కావా సరిచూసుకోండి. మన పోరాటానికి ఆలోచనలను ఆధారం చేసుకోకపోతే ఇప్పుడు మనమిక్కడ ఉండేవాళ్లం కాదు. ఇక్కడ ఉండేవాళ్లం కాదు.
సరే, నేనప్పుడు కమ్యూనిస్టునా? కానే కాదు. నేనప్పుడు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని కనుగొన్న అదృష్టవంతుడ్ని మాత్రమే. ఒక పూర్తి స్థాయి కమ్యూనిస్టును కావడానికి చాలాముందు క్యూబా రాజకీయ సంక్షోభపు సుడిగుండంలో చిక్కుకుపోయిన వాణ్ణి మాత్రమే
దాన్నంతా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. తర్వాత తర్వాత లెనిన్ పుస్తకంలో చెప్పినదానికన్నా సామ్రాజ్యవాద స్వభావం గురించి మరింత స్పష్టంగా తెలుసుకోగలిగాను. సామ్రాజ్యవాదం అన్నింటికంటే హేయమైంది, కౄరమైందివాస్తవాన్ని విపులంగా అర్థం చేసుకునే అవకాశం జీవితమిచ్చిందని భావిస్తున్నా. అదే నన్ను మరింత విప్లవకారునిగా, మరింత సామ్యవాదిగా, మరింత కమ్యూనిస్టుగా తీర్చిదిద్దింది

ఆకలితో అలమటిస్తున్న వందకోట్లమంది

ప్రపంచంలో వందకోట్లమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వందకోట్లమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇది గతంలో ఇంతపెద్ద సంఖ్యలో లేదని అమెరికాకు చెందిన ఆహార, ధాన్యాల విభాగం డైరెక్టర్ జైకేస్ డౌఫ్ తెలిపారు.

నిరుడు ఆకలితో అలమటించిన వారి సంఖ్యకన్నాకూడా ఇప్పుడున్న వారి సంఖ్య దాదాపు నాలుగు కోట్లు పెరిగి వంద కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు. ఇది 2007లో ఏడు కోట్ల 50లక్షలకు చేరుకుందని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా ఐక్యరాజ్య సమితి వీలైనంతమేర సహాయక చర్యలు చేపట్టి వారికి ఆకలి కొరత తీర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

22, ఆగస్టు 2010, ఆదివారం

ఈ బిడ్డకు ప్రాణం పోయండి

ఈ  బిడ్డకు ప్రాణం పోయండి
పేదింటి అబ్బాయికి హిమోఫిలియా వ్యాధి
ఇంజక్షన్‌ ఖరీదు రూ. 4 వేలు
ఆపరేషన్‌ ఖర్చు రూ. 10 లక్షలు
దాతల కోసం తల్లిదండ్రుల ఆరాటం 
         మాయదారి రోగం మాబిడ్డకొచ్చింది. మందుల ఖర్చు భరించలేకున్నాం.. ఎవరైనా ఆదుకోకపోతే బతకడం కష్టం... నాబిడ్డకు ప్రాణం పోయండి... అంటూ తల్లిదండ్రులు వేడుకోవడం చూస్తే తప్పక ఆదుకోవాలనిపిస్తోంది. హిమోఫిలియా ఇది ఏ వెయ్యి మందిలోను ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుడికి ఏ చిన్న గాయమైనా రక్తం ఆగకుండా శరీరం నుంచి పోతూనే ఉంటుంది. అతి ఖరీదైన ఇంజక్షన్‌ వాడినప్పుడే ఈ రక్త ప్రసరణ ఆగుతుంది. ఇలాంటి రోగం ఓ పేదింటి అబ్బాయిని పట్టిపీడిస్తుంది. ఆ అబ్బాయి పరిస్థితిని చూడలేక తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన పలువురిని కంటతడి పెట్టించే పూర్తి వివరాలిలా ఉన్నాయి.
                ఆళ్లగడ్డ తాలూకాలోని చిన్నవంగళి గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, లకీëనరసమ్మల కుమారుడు రాఘవేంద్రకు పుట్టుకతోనే హిమోఫిలియా వ్యాధి వచ్చింది. తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఈ వ్యాధి తాలూకు బాధలు, మందుల గురించి వివరించారు. ముఖ్యంగా ఏ చిన్న గాయం తగిలినా రక్తం వస్తూనే ఉంటుంది. దీనివల్ల బాలుడు నీరసించి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉందని చెప్పారు. రక్తం కారకుండా ఆగాలంటే రూ. 4 వేల విలువైన ఇంజక్షన్‌ ఇప్పించాలని సూచించారు. అలాగే సుమారు రూ. 10 లక్షల ఖర్చుతో వైద్యం చేయిస్తే ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుండి ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు కరువైంది. ఇప్పటికే కుమారిని ఆరోగ్యం కోసం ఉన్న పొలం, ఇల్లు, బంగారం తెగనమ్మి వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయంకాకపోవడంతో తమ కుమారుడు ఏమైపోతాడోననే దిగులుతో తల్లి లకీëనరసమ్మ మంచం పట్టింది. గోరుచుట్టుపై రోకటి పోటు అన్నచందంగా కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండగా మరోవైపు భార్య మంచం పట్టడంతో భర్త వెంకటసుబ్బయ్య అన్నీ తానై కుమారునికి, భార్యకు సేవలు చేస్తున్నాడు. రాఘవేంద్ర పాఠశాలకు వెళ్లే మార్గంలో కాళ్లకు ఏం గుచ్చుకుంటాయనే భయంతో తానే కుమారున్ని భుజానికి ఎత్తుకొని రోజు పాఠశాలలో దించడం, తీసుకురావడం దినచర్యలో భాగమైంది. తమ కుమాడిని కాపాడాలంటూ కన్పించని దేవుడితోపాటు తమ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తికి చేతులు జోడించి దండం పెడుతున్నారు. దాతలు స్పందించి తమ అబ్బాయికి ఆర్థిక సహాయం అందించి ప్రాణాలు కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. మానవత్వం ఉన్న హృదయాలు స్పందించి రాఘవేంద్రుడు ఆరోగ్యవంతుడై నిండునూరేళ్లు జీవించాలని ప్రజాశక్తి కోరుకుంటుంది.