18, అక్టోబర్ 2010, సోమవారం

తొండ ముదిరి ఊసరవెళ్లి అయినట్లు

ఆర్డ్‌ నెన్స్‌పై కోర్టుకు
మైక్రో సంస్థల స్టే పిటిషన్‌కు సిద్ధం
మైక్రో రుణసంస్థలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ మైక్రో సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి. దీని ప్రమాదాన్ని గుర్తించక పోవడం ప్రభుత్వం పొరపాటు చేసింది. దీంతో తొండముదిరి ఊసరవెళ్లి అయిన చందంగా మైక్రో సంస్థల నిర్వాహకులు బాగా సంపాదనకు అలవాటు పడ్డారు. ఆ దోపిడినీటి అరికట్టాలనుకున్న వారిపై ఎలాంటి చర్యలకైనా ముందుకు వెళ్తుంది. లాభాలొస్తాయనుకుంటే పెట్టుబడి దారుడు దేనికీ వెనుకాడడని కారల్‌ మార్క్స్‌ చెప్పాడు. అధికంగా లాభాలొస్తాయంటే ప్రాణాలనైనా ఫణంగా పెడుతారు. కాబట్టి పెట్టుబడి దారుడు దేనికైనా సిద్ధమే. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేకుంటే ఏదయినా సాధ్యపడవచ్చు. ఎస్‌కెఎస్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలియచేసింది. ఆర్డినెన్స్‌ అమలు కాకుండా నిరోధించేందుకు కోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేయాలని మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ (ఎంఎఫ్‌ఐఎన్‌) యోచిస్తున్నట్లు ఎస్‌కెఎస్‌ మైక్రో ఫైనాన్స్‌ తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ తమ సంస్థకు వర్తిస్తుందా లేదా అనే విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామని ఎస్‌కెఎస్‌ చెప్పింది. తమది నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కాదని ఆ ప్రకటనలో పేర్కొంది.

కామెంట్‌లు లేవు: