దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదో రోజు విజయదశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి తరువాతి మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభాస్యంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితి. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదోరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు. జమ్మిచెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకుంటారు. తెలుగువారు దసరాని పదిరోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల్లో దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమవాస్యకి స్త్రీలు పట్టు వస్త్రాలు ధరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టు పై తమ ఆయుధాలను తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది. దసరా ఉత్సవాలను దేశమంతటా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూరు, కోల్‌కతా, ఒరిస్సా, తెలంగాణా, విజయవాడలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒంగోలులో కళాకారుల రూపంలో అమ్మవారిని ఆదాదిస్తారు. విజయవాడలో బేతాళ నృత్యం, విజయనగరం సిరిమాను. వీపనగండ్లలో రాళ్ల యుద్ధం, బందర్‌లో శక్తి పటాలు, వీరవాసనంలో ఏనుగు సమరంభం తదితర రూపాల్లో ఈ పండుగను జరుపుకుంటారు.
కోల్‌కతాలో దసరాను దుర్గా పూజ పర్వంగా బెంగాళీలు జరుపుకుంటారు. సప్తమి, అస్టమి, నవమి తిథులలో దుర్గా మాతకు పూజ చేసి తొమ్మిదో రోజున పూజిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలాది మంది దర్శించడం విశేషం. తొమ్మిది రోజులు రాష్ట్ర మంతా హరి కథలు, పూరాన స్రవనం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు దుర్గా మాతను హుగ్లీ నదిలో నిమజ్ఞనం చేస్తారు. నదీ తీరంలో కూమారీ పూజలు చేయడం బెంగాళీల ప్రత్యేకత. ఒరిస్సాలో కటక్ కళాకారులు రూపొందిచిన దుర్గా మాత రూపాలను వీధి వీధిల్లో ప్రతిష్టిస్తారు. మహిళలు మాణికలో వడ్లు నింపి లకిëదేవిగా భావించి పూజలు చేస్తారు. దీనిని వారు మాన బాన అంటారు. ఒరిస్సా ప్రజలు విజయ దశమినాడు విజయ దుర్గాను ఆరాదిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని అక్కడి ప్రజలు విశ్వాసం. చివరి రోజున పదిహేను అడుగుల రావణ విగ్రహాన్ని బాణ సంచాతో తచారు చేసి మైదానంలో కాల్చుతారు. ఈ రావణ కాష్టం చూడటాడనికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. మైసూరు మహారాజు పాలన కాలం నుంచి వైభవంగా దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి