ఇండియా నాడి ఒబామా తెలుసుకున్నాడని ఆయన ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఇండియాకు రాగానే పెద్ద మార్కెట్‌గా అభివర్ణించాడు. తరువాత ఇండియాలోని స్వాతంత్య్ర సమరయోధులు శాంతి కాముకుడు జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ పిత డాక్టర్ బిఆర్ ఆందేద్కర్ , సమాజ నీతిని బోధించిన వేమనల గొప్పతనాన్ని కొనియాడారు. అదేవిధంగా పంచతంత్ర కథల సారాంశాన్ని గుర్తు చేశారు. ఇండియన్స్ సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పకనే చెప్పారు. అదేవిధంగా ఆయన ప్రసంగాలతో ఎదుటి వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన నల్లజాతీయుడు కావడం వల్ల ఇండియాను బాగా అర్థంచేసుకున్నారు. దేశానికి కొంతయినా ప్రయోజనం ఉంటుందని కొందరు విశ్లేశిస్తున్నారు. మరో పక్క ఇదంతా కపట ప్రేమ, దేశాన్ని కొల్లగొట్టడానికి , మన సంపదను దోచుకోవడానికి ఎంతో తాపత్రయ పడుతున్నాడు ఒబామా అని అభ్యుదయ వాదులు, మేథావులు , వామపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ఒక దేశ అధ్యక్షుడు వచ్చాడు కాబట్టి గౌరవిద్దాం ఒకే కాని మనకు నష్టం కలిగిస్తే వ్యతిరేకించాలా లేదా? ఒబామా పర్యటనను ఎలా చూడాలి.?
2 కామెంట్‌లు:
చాలా బాగా చెప్పారు. ఇండియాను అతిపెద్ద మార్కెట్ గా భావించే ఆ సార్ ఇక్కడికి వేంచేశారు. అందుకు తగిన లాభాన్ని మూటగట్టుకునేపోయాడు. మన నాయకులు వాడికి ఒంగి ఒంగి నమస్కారాలు చేయడం, కరచాలనం కోసం అర్రులుచాచటం వెగటుపుట్టించేవిధంగా వుంది.
ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికాలో నిరుద్యోగ రేటు ఇప్పటికే రికార్డు స్థాయిలో 9.6 శాతానికి చేరుకోవడంతో ఒబామా నాయకత్వంపై అమెరికన్లలో అసంతృప్తి రగుల్కొంటోంది. ఒక వైపు భారత్ లాంటి దేశాలకు ప్రయోజనకరంగా వున్న అవుట్ సోర్సింగ్‌ను అడ్డుకుంటూ, మరోవైపు భారత్‌తో రక్షణ, లోకోమోటివ్స్ తరితర రంగాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా తన దేశంలో ఉద్యోగాలు పెంచుకుంటున్నాడు. దీంట్లో భాగంగానే ప్రపంచ దేశాలకు తన ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకుంటున్నాడు. భారత్- అమెరికా సంయుక్త ప్రకటనలో పేర్కొన్న ఆర్థిక సహకార ఫ్రేమ్‌వర్కు ఇందుకొక నిదర్శనం. అలాగే ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకతను పెంచే పేరుతో చిల్లర వర్తకం, వ్యవసాయ రంగాల్లో అమెరికన్ బహుళజాతి కంపెనీలైన వాల్ మార్టు, మోన్‌శాంటోలకు తలుపులు బార్లా తెరవాలని భారత్‌పై ఒత్తిడి తెస్తున్నాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి