తెలంగాణ ఆందోళనకు తెరపడే దెన్నడు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పాలన స్తంభించి పోయింది. పాలకుల ఆగడాలను ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా తెలంగాణ ఆందోళనలోనే తలమునకలయ్యింది. ప్రశ్నించే వామపక్షాల్లో కూడా సిపిఎం తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నాయి. విపరీతంగా ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్న పాలకులు ప్రజల మధ్య తగువు పెట్టి చూస్తున్నారు. ఐక్యంగా ఉంటే ఆటలు సాగవని భావించిన పాలకుల కుట్రలను ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొనే పరస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టండని గట్టిగా చెబితే సీమాంధ్రలో వ్యతిరేకత వస్తుందని .... ఐక్యంగా ఉంచండని చెబితే తెలంగాణలో రాజకీయం చేయలేమని ప్రజల పక్షాల నిలబడాల్సిన ప్రజాప్రతినిధులే దోబూచులాడుతున్నారు. దోబూచులాడుతున్న రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన ప్రజలు మధ్య కూడా ఐక్యతను దెబ్బతీయడానికి సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు. సిద్ధాంతం... చిత్తశుద్ధి లేని స్వార్థ రాజకీయ నాయకుల ఆటలు తెలుసుకోనంత కాలం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇలాంటి సమస్యలను ఎదురవుతూనే ఉంటాయి. ప్రాంతాలకతీతంగా ప్రజలు తిరగబడితే తప్ప ద్వందవైఖరితో వ్యవహరించే రాజకీయ నాయకులకు తిక్కకుదరదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి