13, నవంబర్ 2013, బుధవారం

మోడి విజయం ఇదే....

 
స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో గుజరాత్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని భారీ స్థాయిలో నెలకొల్పుతున్నారు. దీనిఎత్తు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెట్టింపు వుంటుంది. దీనికయ్యే ఖర్చు అక్షరాలా 2074 కోట్లు. అంటే చంద్రమండల యాత్రకు లేదా ఈ వారం జరగనున్న అంగారక గ్రహయాత్రకు అయ్యే ఖర్చుకన్నా ఐదురెట్లు ఎక్కువ. పోనీయండి ఇదొక పర్యాటక ఆకర్షణగా వుంటుందని సరిపుచ్చుకుందాం. కానీ సర్ధార్ పటేల్ మ్యూజియం మౌళిక వసతులు లేక మూతపడింది. కేవలం కొన్ని లక్షల రూపాయిలు మాత్రం ఖర్చుపెడితే దీన్ని తెరిపించవచ్చు అదే విధంగా సర్ధార్ పటేల్ చదివిన పాఠశాలకు కేవలం పదిహేను లక్షల రూపాయిల నిధులివ్వమని పటేల్ ట్రస్ట్ యాజమాన్యం అడిగితే గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించింది. నిధుల్లేవని సమాధానం చెప్పింది. గాంధీ మహాత్మునికి వున్న అది పెద్ద విగ్రహం ఇటీవల పాట్నాలో నెలకొల్పిన 70 అడుగుల విగ్రహమే కానీ మోడీ సర్కార్ ఏర్పాటు చేస్తున్న పటేల్ విగ్రహం ఎత్తు 392 అడుగులు పటేల్ పై నిజంగానే అభిమానం వుంటే ఆయన మ్యూజియం కో పాఠశాలకూ నిధులు లేవంటారా? ఈ విగ్రహం నెలకొల్పుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం జాతీయ వార్తా పత్రికలలో, టెలివిజన్ ఛానల్స్ లో భారీ వ్యాపార ప్రకటనలను ఇచ్చింది. ఇదంతా చూస్తే పటేల్ పై ప్రేమకన్నా ఆయన విగ్రహం ఎంత ఎత్తుగా వుంటే అంత ఎత్తుగా తన పలుకుబడి పెంచుకోవచ్చన్న నరేద్ర మోడీ లక్షమే కనిపిస్తోంది.

దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని అనవసరంగా పోల్చారు ఇటావల నరేంద్ర మోడీ. మరి మరుగుదొడ్లు లేని దేశంలో విగ్రహాలు కావాలా? దేవాలయాల కన్నా విగ్రహాలే పవిత్రమా? విగ్రహాల కన్నా మీడియాలో అడ్వర్టైజ్ మెంట్లు ముఖ్యమా?

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

అన్నిటికంటే రాజకీయనాయకులకు రాజకీయప్రయోజనాలు ముఖ్యం!