3, నవంబర్ 2013, ఆదివారం

గట్టును వెంటాడుతున్న వివక్ష

                                                  అక్షారాస్యత, అభివృద్ధిలో వెనుకబాటు

                                                 కొనసాగుతున్న రెండుగ్లాసుల పద్దతి

                                                  దళితులకు దేవాలయ ప్రవేశంలేదు

                                                      శ్మశాన వాటకలు లేనేవేవు

           మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలో వివిధ రూపాలో వివక్ష వెంటాడుతుంది. అత్యధిక గ్రామాల్లో  శ్మశాన వాటికలు లేవు. దేవాలయ ప్రవేశం లేదు. రెండుగ్లాసుల పద్దతి కొనసాగుతోంది.  దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.  ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా దళితుల దరి చేరడం లేదు. ఇప్పటికీ మండలంలో 768 కుటుంబాలకు ఇళ్లు లేవు. ఇందిరమ్మ పథకం కింద మంజూరయిన ఇండ్లకు బిల్లులు రాక,  నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక పెండిరగుల్లో ూన్నాయి.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇంత ప్రచారం చేస్తున్నా 90 శాతం దళితులకు మరుగుదొడ్లు లేవు. అన్నింటికీ మించి మండలంలో పెత్తందాల ఆగడాలను ప్రశ్నించిన వారిపై  పెత్తందారులు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హత్యలు చేసిన సంఘటనలు కూడా ూన్నాయి.
        కెవిపిఎస్‌  ఆధ్వర్యంలో గట్టు మండలంలో ఇటీవల సర్వే నిర్వహించారు. జిల్లాలో అక్షరాస్యతలోనూ, అభివృద్ధిలోనూ  వెనుకబడిన గట్టు మండలంలోని  24 పంచాయతీల పరిధిలోని 32 గ్రామాల్లో కెవిపిఎస్‌ నాయకత్వంలో దళితుల సమస్యలపై సర్వే చేశారు. ఐదు బృందాలుగా ఏర్పడి వారంరోజుల పాటు  గ్రామాల్లో తిరిగి దళితుల సమస్యలను అధ్యయనం చేశారు. మండలంలోని  ఏడు  గ్రామల్లో దేవాలయ ప్రవేశం లేదు. రాయవరం, సుల్తానపురం, సోంపురం, చింతలకుంట, ఎస్సందొడ్డి, పెంచికల పాడు, నందిన్నే గ్రామాల్లో దళితులు దేవాలయాల్లోకి వెళ్తే దాడులు చేస్తారు. పండుగలు ూత్సవాల సందర్భంగా దళితులు ఆయా గ్రామాల్లో దూరంగా ూండే వారి మొక్కులు చెల్లించుకుంటారు.  బతికున్నంత కాలం తీవ్రమైన  ఆర్థిక, సామాజిక వివక్షను  ఎదుర్కొనే  దళితులకు సచ్చాక ఆరడుగుల జాగాకూడా లేక పోవడం దురదృష్టకం. శ్మశాన వాటికలు లేనివి  తొమ్మిది గ్రామాలున్నాయి.  మిట్టదొడ్డి, శాగదోని, నారాపురం, మల్కాపురం, కెజి దొడ్డి, సుల్తానపురం,  పుట్టందొడ్డి, నందిన్నే సోంపురం గ్రామాల్లో దళితులు చనిపోతు వ్యవసాయ భూముల్లోనే మృతదేహాలను ఖననం చేస్తారు. వ్యవసాయ భూమి లేని దళితులు శవాలను ఖననం చేయడానికి నానా తంటాలు పడాల్సి ూంటుంది. హోటళ్లలో దళితులు టీ తాగితే పెత్తందారులు ఓర్వలేరు. నేటికీ రాయవరం , సుల్తాన్‌పురం, సోంపూర్‌ గ్రామాల్లో  హోటళ్లలో రెండుగ్లాసుల పద్దతి అమలవుతుంది. అది విధంగా దళితులను గ్రామాల్లో దళితులను రచ్చబండల మీద కూర్చోనీయరు. చింతలకుంట, సోంపురం, సుల్తాన్‌పూర్‌ గ్రామాల్లో దళితులను రచ్చబండమీద కూర్చోనీయరు.  రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించింది. ఇప్పటికే అత్యధిగ గ్రామాల్లో కమ్యూటీ హాళ్లు నిర్మించారు. గట్టు మండలంలో నేటికీ కమ్యూనిటీ హాళ్లు లేని గ్రామాలు 16 ూన్నాయి.  పెద్దమల్కాపురం, గందమాన్‌దొడ్డి, తుమ్మల చెరువు, ఆరెగిద్ద, రాయవరం. చింతలకుంట, కుచ్చినెర్ల, సోంపురం, ఎస్సందొడ్డి, నందిన్నె, సుల్తాన్‌పూర్‌, కెసిదొడ్డి, సారాపురం, మల్గెర, చింతపురం, సల్కెరపురంలో  గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు లేవు. దీంతో పెండ్లిళ్లు ూత్సవాత సందర్భంగా దళితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సల్కెర పురంలో ఎస్‌సి కమ్యూనిటీ హాలును  బోయలు ఆక్రమించారు. కొన్ని గ్రామాల్లో కయ్యూనిటీ హాళ్లకు రిపేర్లు చేయాల్సి ూంది.
                         గట్టు మండల కేంద్రంలో దళితులకు సర్వేనెంబర్‌ 311, 304లో నాలుగు ఎకరాల ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది.  పెత్తందారులు దానిని ఆక్రమించారు.  పెత్తదారులకు భయపడిన దళితులు ప్రశ్నించడం లేదు.  చింతలకుంట గ్రామంలో ఎస్సీలకు సర్వే నెంబర్‌ 211/వి ఆరున్నర ఎకరాల వ్యవసాయ సాగు భూమి ప్రభుత్వం పంపిణీ చేసింది. దళితులు పొట్టకూటి కోసం వలస వెళ్లారు. కురువ వెంకటేష్‌, గోకారప్ప, ఈరప్ప 15 కుటుంబాల వాళ్లు దళితుల భూమిని కబ్జా చేశారు. అట్టిభూమిని అక్రమంగా  సాగు చేసుకుని రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకుంటున్నారు. దీనిపై దళితులు కోర్టును ఆశ్రయించారు. ఈభూమి దళితులదేనని  కోర్టు తీర్పు ఇచ్చినా బాధితులకు భూమి ఇవ్వడం లేదు. ఇలా మండలంలో లనేక గ్రామాల్లో దళితుల భూమిని ఆక్రమించుకుంటున్నారు.  ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు కూడా దళితులకు సక్రమంగా అందడం లేదు. నేటికి 12 గ్రామాల్లో 768 కుటుంబాలలకు ఇళ్లు లేవు.   ఇందిరమ్మ పథకం కింద అందరికీ ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని అందరికి  ఇళ్లు నిర్మించుకునే అవ కాశం మండలంలో లేదు. ఇందిమ్మ బిల్లులు రాక అనేక గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకోవడంలో వెనుకబడి ూన్నారు. బిల్లు మంజూరయినా ఆర్థక పరిస్థితి సక్రమంగా లేక నిర్మించుకోలేని వారు పలువురున్నారు.  వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ఎంతో ప్రచారం చేస్తుంది. గట్టు మండలంలో నేటికీ 90 శా త ం మందికి మరుగుదొడ్లు లేవు. గట్టు మండలం అన్ని రంగాల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అక్షరాస్యత. అక్షరాస్యతలో మహబూబ్‌నగర్‌ జిల్లా 56 ూండటా అందులో గట్టు మండలం 34.45 శాతం మాత్రమే. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా అక్షరరాస్యత పెరగడం లేదు. తగిన చర్యలు తీసుకోవాలి. అక్షరాస్యతలోనూ అభివృద్ది లోనూ దళితులు వెనుకబడి ూన్నారు. దాడులు జరిగినా హత్యలు జరిగినా రాజీ కుది రిస్తున్నారు. కేసులు అయినా ఆధారాలు లేవని కొట్టిపారేస్తున్నారు. రోడ్లు, వీధిదీపాలు, శ్మశాన వాటికలు, కమిటీహాళ్లు, మరుగుదొడ్లు తాగునీటి సమస్యలున్నాయి.  మండలంలో అనేక తీవ్రమైన సమస్యలను  అధికారుల దృష్టికి తెచ్చారు. అధ్యయనం చేసిన అన్ని అంశాలను పరిశీలించి న్యాయం చేయాల్సిన అవసరం ూంది. దళితవాడలు, ఇళ్లస్థలాలు, విద్యుత్‌ స్తంభాలు, వాటర్‌ట్యాంక్‌, కొళాయిలకు అంచనాలు వేసి గతంలో ఆర్డీఓకు అందజేశారు.  మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్ల కోసం వృద్ధుల, వికలాంగుల పేర్ల జాబితాను 2011లో అధికారులకు ఇచ్చినా నేటికీ పట్టించుకోలదు.  సర్వే అనంతరం గట్టు మండల కేంద్రంలో సదస్సు నిర్వహించి సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. దళితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని గద్వాల ఆర్డీఓ నారా యణ రెడ్డి హామీ ఇచ్చారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాలు లేకపోతే ప్రభుత్వ పరంగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి కేటాయిస్తారన్నారు. గట్టు, చింతలకుంట గ్రామాల్లో శ్మశాన వాటిక విషయంలో  ప్రత్యేకంగా తహశీల్దార్‌తో మాట్లాడుతానన్నారు. అదే విధంగా ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు లేని గ్రామాలను పరిశీలించి నిర్మిస్తామని చెప్పారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వ ూన్నతాధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

కామెంట్‌లు లేవు: