4,55,000 ఎకరాల్లో పంటనష్టం
26 మంది మృతి
హుదూద్ తుపాను వల్ల ఉత్తరాంధ్రకు దాదాపు లక్షకోట్ల రూపాయల మేర నష్టం జరిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశారు. 2014 సెప్టెంబర్ 12న తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రను కుదిపేసింది. 14న విశాఖలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్క నేవికీ 2 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగి నట్లు చెప్పారు. విరుచుకుపడ్డ హుదూద్ తుపాన్ రాష్ట్రానికి భారీ నష్టం మిగిల్చింది.గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నష్టం సంభవించినట్లు చెబుతున్నారు. హుదూద్ తుపాన్ నగర ప్రాంతంలో విలయం సృష్టించడమే దీనికి కారణం. గతంలో భారీ తుపా న్లు వచ్చినప్పటికీ వ్యవసాయరంగమే ప్రధానంగా నష్టపోయేది. ఈసారి పరిస్థితి దానికి భిన్నం. పరిశ్ర మలు, పోర్టు, విమానాశ్రయంతో రాష్ట్ర ఆర్థికరాజ ధానిగా నిలిచిన విశాఖ నగరం హుదూద్‌తో విలవిలలాడిరది. తుపాన్ తీరం దాటి రోజులు గడు స్తున్నా విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొన లేదంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. విశాఖ హార్బర్లోని మత్స్యకార్మికు లకు చెందిన బోట్లు పెద్ద సంఖ్యలో ధ్వంసం అయ్యా యి. 700 నుండి వెయ్యిబోట్లు దెబ్బతిన్నట్లు చెబు తున్నారు. కొన్ని బోట్లు కనపడకుండా పోయాయి. ఒక్కో బోటు విలువ లక్షల రూపాయల నుండి కోటి రూపాయల దాకా ఉంటుందని సమాచారం. వీటిలో బీమా సౌకర్యం లేనివే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు అంటున్నారు. విశాఖ విమా నాశ్రయానికి 500 కోట్ల రూపాయల నష్టం వాటి ల్లిందని, ఉక్కు కర్మాగారానికి 340 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు ప్రాధమికంగా తేల్చారు. ఈ వివరాలను ముఖ్యమంత్రే చెప్పారు. ఒక్క విశాఖ నగరంలోనే దాదాపుగా 40 వేల కోట్ల విద్యుత్ స్తంబాలు నేలకూలాయి, ఇవిగాక విశాఖలోని మిగిలిన ప్రాంతాలు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మరో 10 నుండి 15వేల విద్యు త్ స్తంబాలు నేల కూలి ఉంటాయని అంచనా! తుపాన్ తీవ్రతకు ఉప్పాడ నుండి కాకినాడ ప్రధాన హైవే పూర్తిగా దెబ్బతింది. రోడ్డును పూర్తిస్థాయిలో పునరుద్దరించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. కిలోమీటరకు దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేయాల్సిఉంటుందన్నది ప్రభుత్వ వర్గాల అంచనా!. విశాఖలోని కైలాసగిరి వంటి పర్యాటక ప్రాంతాలు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఎన్‌టిపిసిలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టాలపై ఇంకా ప్రాధమిక అంచనాలు సిద్దం కాలేదు. ఇవిగాక విశాఖపట్టణంలోని ప్రైవేటు ఆస్తులూ భారీగా దెబ్బతిన్నాయి. షాపింగ్‌మాల్స్, పెట్రోలు బంకులతో పాటు కొన్ని భారీ వ్యాపారసముదాయాలు తుపాన్ నష్టాల బారిన పడ్డాయి. పూరి గుడిసెలు, రేకుల ఇళ్లతో పాటు హుదూద్ తుపాన్ అపార్ట్‌మెంట్లపైనా ప్రభావం చూపింది. టెలికాం సర్వీసులతో పాటు, రైల్వేశాఖ కూడా భారీ నష్టాన్ని చవి చూసింది. నష్టం అంచనాల్లో వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సిఉంది. విశాఖ నగరంలోనే భారీ నష్టం ఉండటంతో ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలు నష్టం మదింపునకు సరిపోవన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. కంప్యూటర్ మాడల్స్‌తో ఉన్న కొత్త విధానాన్ని వీరు ప్రతిపాదిస్తున్నారు. పునరావాస, సహాయ చర్యలు కొలిక్కి వచ్చిన తరువాత దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.
26కు చేరిన మృతులు!
హుదూద్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 26కు చేరింది. 1,82,128 హెక్టార్లలో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇది ప్రాధమిక అంచనా మాత్రమేనని పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనాల ప్రకారం 1,44,175 హెక్టార్లలో వేసిన ఆహారపంటలు, 37,953 హెక్టార్లలో వేసిన వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి.
వెయ్యికోట్లు సాయం ప్రకటించినకేంద్రం
హుదూద్ తుపాన్ బారిన పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయంగా వెయ్యికోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రకటించారు. తుపాన్ ధాటికి విలవిలలాడు తున్న విశాఖ నగరంలో ఆయన సెప్టెంబర్ 14న పర్యటించారు. తొలుత ఏరియల్ సర్వేలో తుపాన్ పీడిత ప్రాంతాలను పరిశీలించారు. విధ్వంసమైన విశాఖ విమానాశ్రాయాన్ని, తుపాన్ నష్టాలపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూశారు. అధికారులతో సహాయచర్యలపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హుదూద్ తుపాన్ భారీ నష్టం కలిగిం చిందని చెప్పారు.
విరాళం ప్రకటించిన సినీ పరిశ్రమ
తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ విరాళాలు ప్రకటించింది. నటుడు పవన్‌కళ్యాణ్ రూ.50 లక్షలు, మహేష్‌బాబు 25లక్షలు, జూనియర్ ఎన్టిఆర్ 20 లక్షలు, రామ్‌చరణ్ తేజ 10లక్షలు, సినీనిర్మాతల మండలి 25లక్షలు ప్రకటించింది. ఈ విధంగా పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధులు విరాళాలు ఇస్తున్నారు. ఇంకా ఆదుకోవడానికి ముందు రావల్సిన అవసరం ఉంది.
2 కామెంట్లు:
తుఫాను భాధితులను ఆదుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి
విరాళాలు ఇవ్వండి. విరాళాలు ఈ విధంగా పంపండి:
Money transfer
SBI a/c: 33913634404. IFSC Code: SBIN0002724,
Branch: SBI Treasury Branch, Gowliguda, Hyderabad
Cheques:
Deputy Secretary, Revenue Department,
L-Block, AP Secretariat, Hyderabad - 500063
- తెలుగు గ్రీటింగ్స్
www.telugugreetings.net
ok i wellcome this type of heping nature.
కామెంట్‌ను పోస్ట్ చేయండి