మీడియాద్వారా సులువుగా సామాజిక చైతన్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 2014 అక్టోబర్ 25న ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోడీ సంపాదకులు, విలేకరులతో సమావేశమయ్యారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మీడియాప్రతినిధులతో మోడీ తొలిసమావేశం ఇది. ఈసందర్భంగా మోడీ మాట్లాడుతూ స్వశ్చభారత్ మహోన్నత కార్యక్రమని అన్నారు. స్వశ్చభారత్‌పై మీడియాలో చాలామంచి కథనాలు వచ్చాయని చెప్పారు. సామాన్యుడికి స్వశ్చభారత్ అర్థమయ్యేలా ప్రసారం చేశారని అభినందించారు. మీడియాద్వారా సులువుగా సామాజిక చైతన్యం వస్తుందన్నారు. అందరూ కలిసిపని పని చేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని అన్నారు. మీడియా ప్రతినిధులతో పాటు సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్,సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి