ఇది లాటిన్ అమెరికా ప్రజల విజయమని వ్యాఖ్యలు
బ్రెజిల్ అధ్యక్షురాలిగా రెండవసారి దిల్మా రౌసెఫ్ విజయం సాధించిన నేపథ్యంలో లాటిన్ అమెరికాకు చెందిన రాజకీయ నేతలు ఆమెను అభినందించారు. 2010 అక్టోబర్‌లో తొలిసారి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2014లో తిరిగి రెండోసారి విజయం సాధించారు. ఈ విజయంతో, లాటిన్ అమెరికా ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న విలీనం లేదా అనుసంథానం ధోరణి మరింత ధృఢపడుతుందని భావిస్తున్నారు. సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా సెంట్రల్, దక్షిణ అమెరికా దేశాల నేతలు బ్రెజిల్ వర్కర్స్ పార్టీ నేతను ప్రశంసల్లో ముంచెత్తారు. సోషల్ డెమోక్రాట్ నేత ఏషియోనెవెస్‌ను దాదాపు నాలుగు పాయింట్ల తేడాతో ఆమె ఓడిరచారు. సామాజిక కూర్పుకు, ప్రాంతీయ అనుసంథానానికి ఇది గొప్ప విజయమని అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. బ్రెజిల్‌లో దిల్మా అద్బుతమైన విజయం సాధించారు. వర్కర్స్ పార్టీతో మా అనుబంధం కొనసాగుతుందని అంటూ ‘అభినందనలు దిల్మా, లూలా, బ్రెజిల్’ అని ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కరియా వ్యాఖ్యానించారు. దిల్మా బ్రెజిల్‌లో సాధించిన విజయం ప్రజలు సాధించిన విజయం, లూలా, ఆయన వారసత్వం సాధించిన గెలుపు అని వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో వ్యాఖ్యానించారు. ఇది మొత్తంగా లాటిన్ అమెరికా, కరేబియా ప్రాంత ప్రజలు సాధించిన అద్భుత విజయమని అభినందించారు. బ్రెజిల్‌లో, లాటిన్ అమెరికాలో ఇది పండగ చేసుకునే సమయం. తమ సంతోషాన్ని, సంక్షేమాన్ని మరింత పటిష్టపరుచుకునే దిశగా మన ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటూ ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు సాల్వడార్ శాంచెజ్ పేర్కొన్నారు. ఉరుగ్వేలో ఫ్రెంటే యాంప్లియో తరపున అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తబరే వాక్వెజ్ ‘బ్రెజిల్‌కు ఇది శుభవార్త, కామ్రేడ్లూ దిల్మా విజయం సాధించారు.’ అని పేర్కొన్నారు. ఇంకా అర్జెంటీనా ఎన్నికల్లో పాలక పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి, గవర్నర్ సెర్గియో ఉరిబరి, ఒఎఎస్‌కు అర్జెంటీనా రాయబారి నిల్డా గారే, పార్లమెంటేరియన్ కార్లోస్ హెల్లర్ ప్రభృతులు దిల్మా విజయాన్ని అభినందించారు. వెల్లువెత్తుతున్న అభినందనలకు దిల్మా కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి