2, జూన్ 2015, మంగళవారం

బిజెపి పాలన సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదం

                                                       
     - ప్రత్యేక హోదాపై ద్వంద్వ వైఖరి
     - మీట్‌ది ప్రెస్‌లో సీతారం ఏచూరి
      - భూసేకరణ ఆర్డినెన్స్‌ దారుణం
                      ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హాదాపై బిజెపి పెద్దాయన ద్వంద్వ వైఖరిని  అనుసరిస్తున్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి విమర్శించారు.2015 జూన్‌ 2న మంగళవారం ఉదయం మీట్‌ ది మీడియా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బిజెపి పాలన ఫెడరల్‌ స్ఫూర్తి కి, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు విఘాతంగా మారుతోందనీ, రాష్ట్రాలతో సంప్రదించకుండానే కీలక నిర్ణయాలను మోడీ సర్కారు  ఏకపక్షంగా తీసుకుంటోందనీ అన్నారు. రేవంత్‌ రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజకీయాల్లో విలువలు దిగజారుతుండటం పట్ల ఆయన విచారం  వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్‌ ఫండిరగ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మీట్‌ ది మీడియా కార్యకమ్రానికి తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ కార్యదర్శి సోమయ్య అధ్యక్షత వహించారు. హిందూ మాజీ రెసిడెంట్‌ ఎడిటర్‌ నగేష్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జి. ఆంజనేయులు, బసవపున్నయ్య, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై సీతారాం ఇచ్చిన జవాబులు క్లుప్తంగా..
                                                             భూ సేకరణ బిల్లుపై
                 ‘లోక్‌సభ ఆమోదించిన భూసేకరణ బిల్లు రాజ్యసభలో వీగిపోవడంతో సెలక్ట్‌ కమిటీకి పంపాల్సి వచ్చింది.  అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఆర్డినెన్స్‌  జారీ చేసింది. ఇక  జాయింటు కమిటీ బిల్లును పరిశీలించేది ఏముందని ఆయన ప్రశ్నించారు. ఈ కమిటీలో ఉండాలా లేదా అన్న నిర్ణయాన్ని మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మోడీ ఏడాది పాలనలో దేశం మూడు ప్రధాన రంగాలలో ప్రమాదంలో పడిరది. మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను మోడీ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు తీసుకుపోతోంది. అన్ని రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. 2013లో భూ సేకరణ బిల్లులో సవరణలను సమర్థించిన బిజెపి ఇప్పుడు వ్యతిరేకిస్తోంది.
                                                               బిజెపి పాలనపై
          కేంద్రం రాష్ట్రాల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోంది.   ఢల్లీి ప్రభుత్వానికి,  ఢల్లీి లెఫ్టెనెంట్‌ గవర్నరుకు మధ్య జరుగుతున్న ఘర్షణే దీనికి ఉదాహరణ. ప్లానింగ్‌ కమిషన్‌ ను రద్దుపరచడంల వల్ల అది  కేటాయించిన 10శాతం నిధులు  రాష్ట్రాలకు రాకుండా పోయాయి.  ఈ అంశంపై ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు రాసిన లేఖకు ప్రధానినుంచి జవాబు కూడా ఇవ్వలేదు.  బిజెపి పాలనలో ఫెడరలిజానికి , కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు ప్రమాదం ఏర్పడిరది. మోడీ ప్రభుత్వం ఏడాది కాలంలో 49 బిల్లులను పార్లమెంటు పరిశీలించకుండా  జారీ చేసింది. స్టాండిరగ్‌ కమిటీలనే రద్దు చేసింది. చట్ట తయారీ ప్రక్రియనే దెబ్బతీసింది. ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నప్పటికీ బ్రహ్మాండ మైన ప్రగతి సాధిస్తున్నట్లు ప్రచారంచేసుకుంటు న్నారు. ధరలు పెరుగుతున్నాయి. రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు’. 
                                                                    మతఘర్షణలు
              మోడీ పాలనలో దెబ్బతింటున్న మూడోరంగం మతసామరస్యం.  బీహార్‌,  ఉత్తరభారతంలో మత ఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయి.  చరిత్ర స్థానాన్ని పురాణాలు ఆక్రమిస్తున్నాయి. ద్వేషం ఆధారంగా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా సాగే ప్రజా ఉద్యమాలను బలపరచడం , ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే సిపిఎం కర్తవ్యంగా భావిస్తోంది. ఈ ప్రయత్నంలో కలసివచ్చే పార్టీలతో ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తాం.
                                                                     ప్రత్యేకహోదా
                ‘విభజనబిల్లుపై రాజ్యసభలో  గొంతు చించుకుని అరి చిన బిజెపి పెద్దాయన  తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు  ఇస్తామని చెప్పారు. ఇప్పు డేమో స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ అనేదే లేదని, జాతీయ విపత్తు అంటూ ఏమీ ఉండదని  అంటున్నారు. ఇది ద్వంద్వ వైఖరి’
                                                                    రేవంత్‌రెడ్డి వ్యవహారం
                       ‘రాజకీయాలలో నైతికత నానాటికీ దిగజారిపోతోంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎంఎల్‌ఎ ఎన్నికలలో 3నుంచి 5కోట్లవరకు ఖర్చుపెడుతున్నారు. ఇటువంటి వ్యవహారాలలో తప్పిదాలకు పాల్పడిన వారిని ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించాలి.  సిపిఎం ఎన్నికల సంస్కరణలను ఎంతో కాలంగా ప్రతిపాదిస్తోంది.  రాజకీయ పార్టీలకు కార్పొరెేట్‌ ఫండిరగ్‌ను నిషేధించాలి. జర్మనీ, స్కాండినేవియా దేశాలలో వలే కేంద్రం, ఎన్నికల సంఘంల ఖాతాలో నిధులు వుంచి ఎన్నికలకు ఫండిరగ్‌ ఇవ్వాలి. దీనిని మా  పార్టీ  ఎప్పుడో ప్రతిపాదించింది’.
                                                                        దళితుల సమస్యలపై
                   ‘దళితులకు పాలిట్‌ బ్యూరో లో స్థానం కల్పించక పోవడం పట్ల మేమూ  అసంతృప్తితో వున్నాం. సెంట్రల్‌ కమిటీలో దళితుల సంఖ్యపెరుగుతోంది. కేవలం పార్టీ కమిటీలలో దళితుల ప్రాతినిధ్యంతో సమస్యలు తొలగి పోవు. ఆర్థికసాధికారితతోనే వ్యవస్థలో మౌలికమార్పు వస్తోంది. వామపక్షాలకు సాధారణంగా దగ్గరగా వుండే మధ్యతరగతి మితవాద రాజకీయాలవైపు తాత్కాలికంగా  మొగ్గు చూపినా భ్రమలు తొలిగాక వాస్తవాలు తెలుసుకుంటారు.  లక్షలు అప్పు చేసి పైలట్‌ కోర్సు చదివించిన  పలువురు మధ్యతరగతి కుటుంబీకులు ఏవియేషన్‌ రంగంలో సంక్షోభం రావడంతో పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. మహిళా బిల్లు మొదట రాజ్యసభ ఆమోదం పొందేందుకు సిపి ఎం  ఎంతగానో కృషి చేసింది. ఆ  కృషి వల్లే అది ఇంకా బతికివుందన్నారు.
                                                                         తెలంగాణపై
                  తెలంగాణ అనేక ఆశలు , ఆకాంక్షలతో ఏర్పడిరది.  ఈ రాష్ట్రంలో ఎస్‌ సి, ఎస్‌ టి లు జాతీయ సగుటుకన్నా ఎక్కువన్నారు. ఒక ఏడాదిలో వాగ్దానాలు పూర్తికావు, కాని కెసిఆర్‌ ప్రభుత్వం ఆ దారిలోవుందా లేదా అన్నది ముఖ్యం.  ఏడాది కాలంలో తెలంగాణలో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు. 970 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్వీసు, ఇండస్ట్రీలలోఅవకాశాలు పెరగలేదు. సామాజిక న్యాయం జరగడం లేదు.

కామెంట్‌లు లేవు: