హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. పోలింగ్ జరిగి 24 గంటలు దాటిన తర్వాత ఆయన ఈ శాతాన్ని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 73.2శాతం పోలింగ్ శాతం నమోదైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా.. 69.1శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్ తొలుత ప్రకటించారు. అయితే, రాత్రి 10.30గంటల తర్వాతా కొన్ని కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ఈసీ కార్యాలయానికి నివేదికలు చేరలేదు. దీంతో పోలింగ్ శాతం మదింపుపై శనివారం రాత్రి వరకు కసరత్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా యాదాద్రి-90.95
పోలింగ్ శాతం నమోదవ్వగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.89 శాతం ఓటింగ్
నమోదు కావడం గమనార్హం. భాగ్యనగరంలో పలు సంస్థలు ఓటు అవగాహన కార్యక్రమాలు
నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది.
జిల్లాల వారిగా చూస్తే..
ఆదిలాబాద్- 83.37 %
నిర్మల్- 81.22 %
నిజామాబాద్-76.22 %
కామారెడ్డి-83-05 %
జగిత్యాల-77.89 %
పెద్దపల్లి-80.58 %
కరీంనగర్-78.30 %
సిరిసిల్ల-80.49 %
సంగారెడ్డి-81.94 %
మెదక్-88.24 %
సిద్దిపేట-84.26 %
రంగారెడ్డి-61.29 %
వికారాబాద్-76.87 %
మేడ్చల్-58-85 %
హైదరాబాద్-48.89 %
మహబూబ్‌నగర్-78.42 %
నాగర్‌కర్నూల్-82.40 %
వనపర్తి-86.15 %
నల్గొండ-86 %
యాదాద్రి-90.95 %
జనగాం-87.39 %
వరంగల్-89.68 %
భూపాలపల్లి-83.21 %
ఖమ్మం-85.99 శాతం పోలింగ్ నమోదైనట్లు రజత్‌కుమార్ స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి