భోపాల్:
ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ మధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్
పార్టీ ప్రకటించింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న
కమల్‌నాథ్‌కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం వెల్లడించింది. మధ్యప్రదేశ్
ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే
అవకాశముంది. సీఎం అభ్యర్థి ఎంపికపై ఆశావహులు జ్యోతిరాదిత్య సింథియా,
కమల్‌నాథ్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ
విస్తృతంగా చర్చలు జరిపారు. చివరికి సీనియర్ నాయకుడివైపే అధినాయకత్వం మొగ్గు
చూపడంతో ఉత్కంఠకు తెరపడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి