కరోనా కష్టంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరీన్ విషవాయువు లీకైన ఘటన మరో అశనిపాతం. 2020 మే 7న జరిగిన విశాఖ విశాదంలో విషవాయువును పీల్చి 12 మంది మృతిచెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. విషవాయువులో స్టైరీన్ ఒక్కటేనా ఇంకేమైనా విషవాయువు కలిశాయ విచారణలో తేలాలి. స్టైరీన్ అనేది ప్రాథమికంగా ద్రవరూపంలో ఉండే వాయువు. వాతావరణంలో ఇది చాలా తక్కువగా లభిస్తుంది. మిగతా వాటితో పోలిస్టే భారమైన వాయువు. కొన్ని రకాల చెట్ల బెరడు నుంచి చాలా తక్కువగా లభిస్తుంది. అందువ్లలన పెట్రో కెమికల్ రీఫైనరీస్‌లో దీనిని తయారు చేసి పాలిమర్స్, ప్లాస్టిక్, రెగ్జిన్ తయారిలో వినియోగిస్తున్నారు. ఇది గాలిలో కలిసినప్పుడు ప్రాణాంతకమైన స్టైరీన్ డయాక్సైడ్‌గా మారుతుందని నిపుణులు అంచనాకు వచ్చారు.
ఘటనపూర్వపరాలు : ఘటన త్లెలవారుజామున జరగడంతో సమీప గ్రామాల్లో గాఢనిద్రలో ఉన్నవారికి ముప్పు తీవ్రత తెలియలేదు. విషవాయువు ప్రభావంతో ఉక్కిరిబిక్కిరవుతూ రోడ్లమీదకు పరుగెత్తుకొచ్చిన వారంతా కుప్పకూలిన ద్రుశ్యాలు హ్రుదయవిదారకంగా ఉన్నాయి. పిల్లలను, ముసలి వాళ్ళను మోసుకుపోతున్న వాళ్ళు, ఆ వేదన రోదన మధ్యనే తమకుటుంబీకులను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నవారితో ఈ విషాద ద్రుశ్యాలు పువురిని కంటతడిపెట్టించాయి. ఐదుకిలోమీటర్ల మేరకు విస్తరించిన ఆ విష వాయువు మనుషులనే కాదు, అమాయక పశుపక్ష్యాదులనూ కబలించింది. పచ్చనిచెట్లు సైతం మాడిమసై పోయాయి. విశాఖను కుదిపేసిన ఈ మహా విషాదంలో నిజాన్ని నిగ్గుత్చేడం ముఖ్యం. ఒక భయానకమైన విషవాయువును పొట్టనిండా దాచుకున్న కంపెనీ ఇంతటి బాధ్యతారాహిత్యంతో ఎలా ఉండగలిగిందో, అందుకు కారకులెవరో తేల్చాలి. కొందరిని చంపి, వందమందిని ఆస్పత్రుల పాల్జేసిన ఈ విషవాయువు తక్షణ ప్రభావం మాత్రమే మనం ఇప్పుడు చూశాం. కళ్ళమంటలు, చర్మంపై దురదలు, శ్వాస సమస్య వంటి తాత్కాలిక లక్షణాను అటుంచితే, ఈ వాయువు మనిషిపై చూపే దీర్ఘకాలిక ప్రభావం తీవ్రమైనది. ప్రాణవాయువుతో కలిసినందున స్టైరీన్ మరింత ప్రమాదకర రూపాన్ని సంతరించుకొని, వారంపాటు గాలిలోనే ఉండిపోతుందన్న విశ్లేషణలు భయపెడుతున్నాయి. స్టైరీన్‌ను నిల్వ ఉంచిన కంటైనర్లు పాతవికావడం, వాటినీ సరిగా నిర్వహించకపోవడం, ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ‘అతి హానికర విషవాయువు’తో నిత్యమూ వ్యవహరించే కంపెనీలో కీకమైన వీవోసీ వ్యవస్థ పనిచేయని స్థితిలో ఉండటం ఆశ్చర్యం. స్టైరీన్ స్థితిని ఎప్పటికప్పుడు తెలియచెప్పే ప్రత్యేక వ్యవస్థ లేనందునే, లీకేజీని తక్షణమే గుర్తించక వాయువు ఇలా వేగంగా విస్తరించగలిగింది.
ఈ ప్రమాదంలో కంపెనీ నిర్లక్ష్యం అణువణువునా కనిపిస్తున్నది. సడలింపును అందిపుచ్చుకొని తిరిగి తెరిచేందుకు ఉత్సాహపడుతున్నవారు, లాక్‌డౌన్ కాలం లో తాము నిర్వహణలో చూపిన నిర్లక్ష్యాన్ని ముందుగా సవరించుకోలేదు. వాయువు లీకైన గంటకు కానీ లీకేజీని గుర్తించలేదు. అక్కడున్న కొద్దిమందికీ ఏం చేయాలో తోచక చేతులెత్తేశారు. నివారణ చెప్పగ నిపుణులెవ్వరూ లేకపోవడం వలన గంటల తరబడి ఆ విష వాయువు సమీప ప్రాంతాను చుట్టుముట్టింది. వరుస తప్పిదాలకు నిదర్శనం. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన కంపెనీలన్నీ రక్షణచర్యుల కొనసాగిస్తున్నదీ లేనిదీ కనిపెట్టాల్సిన వివిధ శాఖ అధికారులు ఇది బడా కంపెనీ కావడంతో దీని జోలికి వచ్చివుండరు. ఈ కాలు ష్య కారక కంపెనీని మూసివేయాలని ఎంతోకాలగా ప్రజులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాకులుకు పట్టలేదు. విస్తరణకు సైతం అనుమతులు ఇస్తున్నారు. కరోనా కారణంగా చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలుకు ఘనస్వాగతం పలుకండి అంటూ రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఉద్బోధించిన నేపథ్యంలో, మరిన్ని మినహాయింపుతో ఈ దేశంలోకి అడుగుపెట్టే కంపెనీతో రాబోయే కాలం లో ఎన్ని విషాదాలు చవిచూడాల్సి వస్తుందో ..........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి