ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
14, జనవరి 2016, గురువారం
13, జనవరి 2016, బుధవారం
ఎమోషనల్ డ్రామా...
ఎమోషన్
లాజిక్‌కి అందనిది. అలాంటి ఎమోషన్‌ని కూడా లాజికల్ గా చెప్పాలనుకోడం
లెక్కల్లో త్రికోణమితి చాప్టర్ లాంటిది. ఇలాంటి లెక్కల్ని తెలుగు
ప్రేక్షకులకు పరిచయం చేసేది సుకుమార్ మాత్రమే. ఈరోజు వెండితెరపై ఆయన
తీసుకొచ్చిన చాప్టర్ పేరు 'నాన్నకు ప్రేమతో'. దాన్ని మన లెక్కల మాష్టారు
ఎలా డీల్ చేశారో చూద్దాం..
కథ:
సుబ్రహ్మణ్యం అలియాస్ రమేష్ చంద్ర ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) మరో నెల
రోజుల్లో చనిపోతాడనగా కోటీశ్వరుడైన తాను ఐడెంటిటీని మార్చి ఎందుకు
బతుకుతున్నాడో తన ముగ్గురు కొడుకులతో చెబుతాడు. 35 వేలకోట్ల అధిపతి అయిన కె
గ్రూప్ చైర్మన్ కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) తమ తండ్రి మోసం చేశాడని
తెలిసినా ఇద్దరు కొడుకులు (రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల) ఏం పట్టనట్టు
ఉంటారు. మూడో కొడుకు అభిరామ్ (ఎన్టీఆర్) మాత్రం తండ్రి చివరి కోరికను
తీర్చడానికి కృష్ణమూర్తితో గేమ్ మొదలెడతాడు. ఆ గేమ్ ఎలా సాగింది అందులో
ఎవరు గెలిచారు..? అన్నది తెరమీద చూడాల్సిందే.
నటీనటులు:
సినిమాలో ప్రత్యర్థులుగా పోటీ పడిన ఎన్టీఆర్, జగపతిబాబులిద్దరూ తమ నటనతో
ప్రేక్షకుల మదిని గెలుస్తారు. రకుల్ ప్రీత్ పాటలకు మాత్రమే పరిమితం కాని
పాత్రలో కనపడి పెర్ఫార్మన్స్ వైపు అడుగేసింది. సినిమాలో సొంత గొంతు
వినిపించడం కూడా రకుల్‌కి ఇదే తొలిసారి. రెండింటిలోనూ మార్కులే
కొట్టేసింది. రాజేంద్ర ప్రసాద్ ఉన్న కొద్ది సమయంలోనే సినిమాకి బలంగా
నిలిచారు. మధుబాల ప్రత్యేక పాత్రలో కనపడగా మిగతా తారాగణం కథానుసారం రక్తి
కట్టించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక విభాగం:
సుకుమార్ సినిమా అనగానే అక్కడ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్
ప్రత్యక్షమవుతాడు. ఈ సినిమాలోనూ దేవీ ఆకట్టుకునే బాణీలతోను, నేపథ్య
సంగీతంతోనూ మరోసారి సుక్కుతోపాటు ప్రేక్షకులను మెప్పించాడు. ఎండ్
టైటిల్స్‌లో దేవీ రాసిన బిట్ సాంగ్ చాలా బాగుంది. చంద్రబోస్ సాహిత్యం,
విజయ్ కె చక్రవర్తి కెమెరా కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి.
ఇక్కడ ప్రత్యేకించి మరో విషయం చెప్పాలి. ప్రతీ టెక్నీషియన్ సుకుమార్‌తో
కలిసి ఒక్కసారైనా పనిచేయాలనుకుంటారు. అందుకు ఆయన సినిమాలోని టైటిల్ కార్డ్
కూడా ఓ కారణం. తన ప్రతి సినిమాలోనూ చేసినట్టే ఈ సినిమాలోనూ ఓ గేమ్‌లా
డిజైన్ చేసి క్లాప్స్ కొట్టించాడు.
దర్శకత్వం - విశ్లేషణ:
సుకుమార్ ఈ సినిమాలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పాఠాలను కూడా ఈ
సినిమాలో చెప్పారు. హీరో పరిచయం తర్వాత ఇంటర్వెల్ ముందు వరకూ ఏ యాంగిల్‌లో ఏ
పని చేయాలి..?, దాని ఫలితం ఎలా ఉంటుంది..? చేసే విధానంలో తేడా వస్తే ఆ
ఫలితం ఎలా మారుతుంది..? లాంటి ఎన్నో విషయాలను బోదించారు. అక్కడివరకూ సాగిన
స్క్రీన్‌ప్లేని హీరోతో డైలాగుల్లో చెప్పించారు. ఇక్కడే వచ్చింది చిక్కంతా.
ఈస్ట్రోజన్‌ని 'డీఎన్ఏ'కి ముడివేసినా, హీరో పాత్రకి సంబంధించి వచ్చే
సన్నివేశాలు లెక్కలతో, అంకెలతో చూపించి కెమెరా షాట్లతో లాగిస్తున్నపుడు
లెక్కలంటే ఇష్టం లేని విద్యార్థి ఆ క్లాసు నుండి ఎప్పుడు పారిపోదామా అని
ఎదురుచూస్తున్నట్టు ఉంటాడు సీట్లోని ప్రేక్షకుడు. అది పాత్ర ఇంటలిజెన్స్
అనుకున్నా అదంతా చేతల కంటే మాటల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఇంటర్వెల్
కొద్దిసేపటి ముందు నుండి కథ ఆసక్తికరంగా నడిపించినా ఇంటర్వెల్ ట్విస్ట్
సమయంలో పందెం కాసిన హీరో బ్రేక్ తర్వాత తండ్రి దగ్గర కనపడటం, హీరోయిన్
తల్లి గురించి హీరో తెలుసుకోవడం, చివర్లో తండ్రికి ఓ క్షణం పాటు తన
విజయాన్ని చూపించడం లాజిక్‌కి అందని ఎమోషన్. చివరిగా... 'ఒక్కసారి పగిలితే
అతుక్కోదు' అనే మాట గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. అది
అతుక్కుంటే ఎంత బావుంటుందన్నది ఈ సినిమాలో సుకుమార్ చూపించాడు. దీనికిగాను
అతడ్ని అభినందించి తీరాల్సిందే.
రేటింగ్: 2.5
నాన్నకు ప్రేమతో: కొంత ఎమోషన్.. మరికొంత కన్ఫ్యూజన్
1, జనవరి 2016, శుక్రవారం
31, డిసెంబర్ 2015, గురువారం
10, డిసెంబర్ 2015, గురువారం
ఎన్నికవ్వాలంటే చదువు ఉండాల్సిందే
హర్యానా పంచాయితీ సవరణ చట్టానికి సుప్రీం కోర్టు ఆమోదం
న్యూఢిల్లీ : కనీస విద్యార్హత లేనివారు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని హర్యానా ప్రభుత్వం చేసిన చట్ట సవరణను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సవరణ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ జే చ లమేశ్వర్ నాయకత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. అయితే, మన దేశంలో పార్లమెంటు, శాసనసభ సభ్యుగా ఎన్నికవడానికి మాత్రం కనీస విద్యార్హత ఏదీ లేకపోవడం గమనార్హం. హర్యానా అసెంబ్లీ ఈ సంవత్సరం రూపొందించిన ఈ చట్టంలో కనీస విద్యార్హతతో పాటు, ఇంట్లో మరుగుదొడ్డి ఉండడం, కో`ఆపరేటివ్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణా బకాయిు లేకుండా ఉండడం వంటి ఇతర అర్హతు కూడా ఉన్నాయి. ఈ కొత్త చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని, మౌలిక హక్కును హరిస్తుందన్న కారణంతో దీనిని రద్దు చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది.
అంతకు ముందు, సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం హర్యానా పంచాయతీరాజ్ (సవరణ) చట్టం, 2015పై స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ చట్టంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ కేటగిరీ వారైతే కనీసం పదో తరగతి, మహి ళలు, దళిత అభ్యర్థులైతే కనీసం 8వ తరగతి, దళిత మహిళలైతే కనీసం 5వ తరగతి చదివి ఉండా లనే నిబంధన ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణ కున్న చట్టబద్ధతను పరీక్షించాలని, ఈ అంశాన్ని అధికారయుతంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయంలో సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత మరోసారి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నిక ల కమిషన్ ప్రకటించింది. నిజానికి అక్టోబర్‌లోనే పంచాయితీ, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉండిరది.‘నిజానికి అందరికీ విద్య అందించకపోవడం అనేది ప్రభుత్వ వైఫ్యమే. ఇందుకు ప్రజ హక్కును హరించడం సరికాదు. ప్రజలెవ్వరూ తాము నిరక్షరాస్యులుగా ఉండిపోవాలని కోరుకోరు’ అని పిటిషన్‌దారు తరఫు న్యాయవాది కీర్తి సింగ్ వాదించారు. 2010లో రూపొందిన విద్యా హక్కు చట్టంతో ఏ అభ్యర్థీ లబ్ది పొందలేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి రాష్ట్రంలో 83 శాతం దళిత మహిళలు, మొత్తంగా 71 శాతం మహిళలు, 56 శాతం పురుషులు నిరక్ష్యరాస్యులేనని సింగ్ వాదించారు. చదువుకునే స్తోమత లేని కారణంగా వారిప్పుడు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం కాకుండా పోతారని సింగ్ అన్నారు. సమానత్వమే చట్టానికి ప్రాతి పదికగా ఉండానీ, అది పేదకు అండగా ఉండాలని వాదించారు. ‘గ్రామీణ ప్రాంతంలో అత్యధికులను ఈ ప్రక్రియకు దూరం చేసే ఏ చట్టమైనా ఏకపక్షమైనదీ, నిర్హేతుకమైనదే అవుతుంది’ అని సింగ్ అన్నారు. అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది.
సుప్రీం తీర్పు ఆశ్చర్యకరం : సీపీఐ(ఎం)
హర్యానా రాష్ట్ర పంచాయతీ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం పట్ల సీపీఐ(ఎం) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాన్ని ఆమోదించడం కష్టమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఒక ప్రకటనలో అన్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ సవరణ చట్టం వ్ల గ్రామీణ ఓటర్లలో మూడిరట రెండొంతుల మంది అభ్యర్థుగా అనర్హులవుతారు. దీనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుతుందని ఆశించిన వారికి ఆశాభంగమే కలిగిందని పార్టీ అంది.ఈ షరతులు రాజ్యాంగంలో చెప్పిన ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి సురేందర్‌సింగ్ అన్నారు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రజ ప్రజాస్వామిక హక్కులను కాపాడడంలో విఫల మైందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికీ చట్టప రమైన అవకాశాలున్నాయని, దీనిపై రివిజన్ పిటిషన్ వేసేం దుకు మీందని పార్టీ అంది. సుప్రీంకోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తర్వాతి చట్టపరమైన చర్యను ఖరారు చేస్తామని సీపీఐ(ఎం) నేత అన్నారు. ప్రజాస్వామిక హక్కు పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ, ఈ విషయంలో ప్రజల మధ్యకు వెళ్తామని, దీనిని ఎన్నికల అంశంగా చేపడతామని కూడా సురేందర్ సింగ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలదేనని, ప్రజా ఉద్యమాలతో ఈ షరతులను మార్చవచ్చని ఆయన తన ప్రకటనలో అన్నారు. గతంలో హర్యానా అసెంబ్లీ స్థానిక సంస్థ ఎన్నికలో అభ్యర్థిత్వానికి ఇద్దరు పిల్లలే ఉండాలన్న షరతు విధించిందనీ, దానికి వ్యతిరేకంగా దాఖు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందనీ, అయితే ప్రజల నిరసనతో అసెంబ్లీ ఆ అప్రజాస్వామిక షరతును ఉపసంహరించుకుందని ఆయన గుర్తు చేశారు.
20, నవంబర్ 2015, శుక్రవారం
నితీష్‌కుమార్ ప్రమాణస్వీకారం

నితీష్ కేబినెట్‌లో మంత్రిలుగా ప్రమాణం చేసిన లాలు పెద్దకుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమాణస్వీకార సమయంలో కొన్ని పదాలు సరిగ్గాపలకలేక పోయారు. అపేక్షితను ఉపేక్షితగా పలికారు. దీంతో గవర్నర్ రామ్‌నాథ్ లాలు తనయుడితో రెండోసారి ప్రమాణం చేయించారు. రెండోసారికూడా తేజ్ ప్రతాప్ మళ్లీ తప్పుగా చదివారు. లాభం లేదనుకుని మూడోసారి మాత్రం చెప్పకుండా గవర్నర్ ప్రమాణస్వీకారం ముగించారు.
పార్టీ వారీగా మంత్రి పదవులు పొందినవారు
జెడియు: రాజీవ్ రంజన్‌సింగ్ లాలెన్, బిజెందర్‌ప్రసాద్ యాదవ్, శ్రవన్‌కుమార్, జయ్‌కుమార్ సింగ్, మహేశ్వర్‌హజారి, కృష్ణనందన్‌ప్రసాద్‌వర్మ, సంతోష్‌నిరా, ఖుర్షిద్‌నందన్ ఫిరోజ్ అహ్మద్, శైలేష్‌కుమార్, కుమారిమంజువర్మ, మదన్‌సాహ్ని, కపిల్దేవ్‌కామత్
ఆర్‌జెడి: తేజశ్వియాదవ్, తేజ్‌ప్రతాప్‌యాదవ్, అబ్దుల్‌బారి సిద్ధిఖ్, అబ్ధుల్‌గఫూర్, విజయ్‌ప్రకాశ్, చంద్రికారాజ్, అలోక్‌కుమార్‌మెహతా, రామ్‌విచార్‌రాయ్, శోచందర్‌రామ్, మునేశ్వర్‌చౌదరి, చంద్రశేఖర్, అనితాదేవి,
కాంగ్రెస్ : అశోక్‌చౌదరి, మదన్‌మోహన్‌జా, అబ్దుల్‌జలీల్ మస్తాన్, అవదేశ్‌కుమార్ సింగ్.
10, నవంబర్ 2015, మంగళవారం
అంబేద్కర్ దార్శనికత పై చర్చించాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢల్లీి : ఈ నె 26 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మొదటి రెండు రోజును అంటే 26, 27 తేదీలను డా॥బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతిని పాటించేందుకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మీడియా వార్తలు తెలుపుతున్నాయి. కానీ ఈ రెండు రోజును పూర్తి చేయని ఎజెండాలను పూర్తి చేయడానికి, సామాజిక న్యాయంపై అంబేద్కర్ దార్శనికతను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కోరింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన జారీ చేసింది. ప్రైవేటు రంగానికి రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతమున్న రాజ్యాంగ నిబంధనను విస్తరించేందుకు చట్టాన్ని చేయడం, అలాగే లోక్‌సభలో ఆమోదించినా రాజ్యసభలో పెండిరగ్‌లో వున్న ఎస్‌సి ఎస్‌టి అత్యాచారా నిరోధక బిల్లును పరిష్కరించడం వంటి చర్యను ఈ రెండు రోజుల్లో చేపట్టాలని పొలిట్‌బ్యూరో కోరింది. ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికకు చట్టబద్ధమైన ప్రతిపత్తి కల్పించే బిల్లును కూడా ఆమోదించాలని, ఎస్‌సి, ఎస్‌టి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు జరగాలని కోరింది. ఇదేమీ ప్రత్యేక సమావేశం కాకపోయినప్పటికీ, భారత సమాజంలో సిగ్గుచేటైన విధంగా పరిణమించిన ‘పుట్టుక, వారసత్వం ప్రాతిపదికన అసమానత’ను నిర్మూలించడానికి సమగ్రమైన, పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అత్యావశ్యకత వుందని దాని కోసం ఈ రెండు రోజులు కేటాయించాలని సిపిఎం డిమాండ్ చేసింది. అంబేద్కర్ దార్శనికతను ముందుకు తీసుకెళ్ళడానికి భారత పార్లమెంట్ చేయాల్సిన కనీసచర్య ఇదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అంబేద్కర్ జయంతిని జరుపుకు నేందుకు, ఆయన్ని స్మరించేందుకు ఇది చక్కటి మార్గమని తెలిపింది.
9, నవంబర్ 2015, సోమవారం
సూకి ఘన విజయం
ఓటమిని అంగీకరించిన పాలక పక్షం
యాంగాన్/హింతాడా(మయన్మార్): మయన్మార్‌లో ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నోబెల్ శాంతిబహుమతి గ్రహీత, ప్రతిపక్ష నేత ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డి) 95 శాతం స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో విజయపథంలో దూసుకు పోతోంది. కడపటి సమాచారం అందే సమయానికి ప్రకటించిన 45 స్థానాలో 43 స్థానాను ఎన్‌ఎల్‌డి కైవసం చేసుకుంది. యాంగాన్ ప్రాంతంలోని 12 స్థానాలకుగాను పన్నెండిరటినీ ఎన్‌ఎల్‌డి గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మూడిరట రెండొంతు లు మెజార్టీకన్నా మించి స్థానా లు సూకీ పార్టీకి లభించనున్నాయి. ఇంతవరకు ప్రకటించిన వాటిలో 70 శాతానికి పైగా స్థానాలు ఆ పార్టీ ఖాతాలో జమ అయ్యాయి. దేశాధ్యక్ష స్థానంపై ఆశలు పెట్టు కున్న ప్రస్తుత పార్లమెంట్ స్పీకర్ షా మాన్ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఫలితం వెల్లడి కాక ముందే ఆయన తన ఓటమిని ఫేస్‌బుక్ ద్వారా అంగీకరిం చటం విశేషం. పూర్తి ఫలితాలు (2015 nov-9)మంగళవారం ఉదయం 6-30 గంటలకు పూర్తి పలితాలు వెలువడుతాయని భావిస్తున్నట్లు షామాన్ కుమారుడు టోనైంగ్ మాన్ చెప్పారు. ఫలితాల ధోరణి ఇప్పటికే కన్పిస్తున్నందున తన తండ్రి ముందుగానే ఎన్‌ఎల్‌డికి అభినందను తెలియచేశారని ఆయన వివరించారు. ఇదిలా వుండగా పాలక పక్షం యూనియన్ సోలిడారిటీ అండ్ డెవలెప్‌మెంట్ పార్టీ (యుఎస్‌డిపి) నేత హ్తే తమ ఓటమిని అంగీకరించారు. హ్తే ఊ ఒక వార్తాసంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు సోమవారం ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది.
తొందరపడొద్దన్న సూకీ
పూర్తి ఫలితాలను అధికారికంగా ప్రకటించేంతవరకు 'సం యమనం పాటించాలని ఆంగ్‌సాన్ సూకీ తన పార్టీ సహచరులకు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ ఎటువంటి వివక్షకూ తావివ్వని రీతిలో దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపిస్తుందని ఆమె చెప్పారు. ఈ ఎన్నికల్లో యుఎస్‌డిపి తరపున 1,122 మంది, ఎన్‌ఎల్‌డిపి తరపున 1,123 మంది బరిలో నిలిచారు. మూడంచెల ఈ పార్లమెం టరీ ఎన్నికల్లో మొత్తం 90 రాజకీయ పార్టీలకు చెందిన 6,038 మంది అభ్యర్ధులు , 310 మంది స్వతంత్ర అభ్యర్ధులతో సహా దాదాపు వెయ్యిమందికి పైగా పోటీ పడ్డారు.
మయన్మార్ రాజకీయ ఘటన క్రమం
1988లో నాటి బర్మాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, రాజ కీయ అణచివేతపై నిరసనలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందిం చిన సైన్యం అణచివేతలో భాగంగా దాదాపు 3 వేల మందిని హతమార్చింది. సూకీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
1990: సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించినా సైన్యం దానిని అంగీకరించలేదు. అణచివేతను మరింత ఉధృతం చేసిన సైన్యం సూకీని గృహనిర్బంధంలో వుంచింది.
1991: గృహనిర్బంధంలోనే సూకీకి నోబుల్ శాంతి బహుమతి లభించింది.
2005: దేశ కొత్త రాజధానిగా మారుమూ ప్రాంతంలోని నేపిటా నగరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
2007: కాషాయ విప్లవం పేరుతో బౌద్ధ సన్యాసుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీటిని అణచివేసేందుకు సైనిక ప్రభుత్వం మరింత హింసాకాండకు ప్పాడిరది.
2010: పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో సైనిక మద్దతుతో తాము విజయం సాధించినట్లు యుఎస్‌డిపి ప్రకటించింది. ఎన్‌ఎల్‌డితో సహా అనేక ఇతర పార్టీ లు ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు నిరాకరించాయి. ఎన్నిక లు జరిగిన వారంలోపే సూకీని ప్రభుత్వం గృహనిర్బంధం నుండి విడుద చేసింది.
2011: అందరినీ ఆశ్చర్యపరుస్తూ సైనిక ప్రభుత్వం తన అధికారాను మాజీ సైనికాధికారి థీన్‌సీన్ నేతృత్వంలోని పాక్షిక పౌర ప్రభుత్వానికి అప్పగించింది. ఆయన చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ప్రాథమిక హక్కును పునరుద్ధరించటంతో పాటు ఆంక్షను కూడా ఎత్తివేశారు. అనేక మంది రాజకీయ ఖైదీలను విడుదల చేశారు.
2012: పార్లమెంట్ లోని 45 స్థానాకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి 43 స్థానాల్లో విజయం సాధించింది. సూకీ ఎంపిగా ఎన్నికయ్యారు. అమెరికా, ఐరోపా తదితర దేశాలు మయన్మార్‌పై ఆంక్ష తగింపు ప్రారంభించాయి. అయితే పశ్చిమ ప్రాంతంలోని రఖినే రాష్ట్రంలో ఎక్కువగా వున్న రోహింగ్యా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింసాకాండ చెలరేగింది.
8, నవంబర్ 2015, ఆదివారం
‘మహా’ ప్రభంజనం
బీహార్‌లో నితీష్‌కే పట్టం
చావుదెబ్బతిన్న కాషాయదళం
జెడియు కూటమి అఖండ విజయం
మూడుచోట్ల లెఫ్ట్ గెలుపు
బీహార్‌లో మొత్తం 243 స్థానాలకు గాను మహాకూటమికి 178, ఎన్‌డిఏ కూటమి 58, లెఫ్ట్‌ప్రంట్ 3, ఇతయి 4 స్థానాలు గెలుచుకున్నారు. ఆయా వార్తా సంస్థలు ఎగ్జిట్‌పోల్స్ మహాకూటమికి అనుకూలంగా వెల్లడించాయి. అయితే తక్కువ సీట్లతో గెలుస్తుందని ప్రకటించాయి. అంచనాకు మించి భారీ మెజార్టీతో విజయం సాధించింది. బిజెపికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొన్నఢిల్లీలో నేడు బీహార్‌లో అది ఘోర పరాజయాన్ని చవిచూసింది. మోడీ ప్రభుత్వ 18 మాసాల పాలనపై బీహార్ ప్రజులు తమ అసమ్మతిని స్పష్టంగా తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాను తలకిందు జేస్తూ జెడియు నేతృత్వంలోని మహా కూటమికి మూడిరట రెండొంతులు మెజార్టీతో తిరుగులేని విజయం చేకూర్చారు. ఈ హ్యాట్రిక్ విజయంతో నితీష్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. గోవధ, గొడ్డు మాంసం, రిజర్వేషన్లు వంటి వాటిని ముందుకు తీసుకొచ్చి దేశంలో అసహనాన్ని పెంచి, రాజకీయ లబ్ధి పొందాలని చూసిన బిజెపికి తగిన శాస్తి చేశారు. మతోన్మాద శక్తులపై లౌకిక కూటమి సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాల్లోనే గాక దేశ రాజకీయాల్లోనూ కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. జెడియు, ఆర్జెడి మద్దతుదారులు రాష్ట్ర వ్యాపితంగా బాణ సంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడంతో బీహార్‌కు మూడు రోజుల ముందే దీపావళి వచ్చినట్లుయింది. ఈ పరిణామంతో వచ్చే శీతాకాల సమావేశాల్లో కార్పొరేట్ అనుకూలబిల్లు, జిఎస్‌టి, కార్మిక చట్ట సవరణ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తున్న మోడీ సర్కార్‌కు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకానుంది.
5, నవంబర్ 2015, గురువారం
మహాకూటమికే మొగ్గు !
ఎగ్జిట్ పోల్స్‌వెల్లడి
ముగిసిన పోలింగ్ ఘట్టం
8న బీహార్ భవితవ్యం
పాట్నా : బీహార్ శాసభసభ ఎన్నికల్లో మహాకూటమికి గెలుపు అవకాశాున్నాయని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆయా వార్తా సంస్థలు ప్రకటించాయి. ఎన్నిక సమరంలో పోలింగ్ ఘట్టం ముగిసింది. 2015 నవంబర్ 5న జరిగిన చివరి ఐదో విడతలో 59.46 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా 56.8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. ఫలితాలు ఈ నెల ఎనిమిదో తేదీన రానున్నాయి. చివరి దశ పోలింగ్ ముగిసిన వెనువెంటనే వివిధ వార్తా సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌తో హోరెత్తించాయి. ఎన్డీయే, మహాకూటమి హోరాహోరీగా స్థానాలు కైవసం చేసుకోనున్నాయని తెలిపాయి. అయితే స్వల్పఆధిక్యతతో మహాకూటమే పైచేయి సాధించనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. టైమ్స్‌నౌ వార్తా సంస్థ ఎన్‌డియేకు 111, మహాకూటమికి 122, ఇతరులు 10 సీట్లు గొచుకునే అవకాశం ఉందని చెప్పింది. ఎన్‌డిటివి ఎన్డీయేకు 116, మహాకూటమికి 120, ఇతరుకు ఏడు వస్తాయని చెప్పింది. న్యూస్‌ఎక్స్ ఎన్‌డియేకు 90 నుంచి100, మహాకూటమికి 130 నుంచి140, ఇతరుకు 13 నుంచి 23 వస్తాయని ప్రకటించింది. ఇండియా టుడే ఎన్‌డియేకు 112 నుంచి113, మహాకూటమికి 113నుంచి127, ఇతరులకు ఆరు వస్తాయని తేల్చింది. టుడేస్ చాణిక్య మాత్రం ఎస్‌డియేకు 155, మహాకూటమికి 83 వస్తాయని ఎన్‌డియేకు అనుకూలంగా ఫలితాలుంటాయని తేల్చింది. అయితే నవంబర్ 8న ఎన్నిక లఫలితాలు వచ్చాక ఎవరి అంచనాలు ఏమిటనేది తేల నుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)