24, డిసెంబర్ 2013, మంగళవారం

26న కేజ్రివాల్‌ ప్రమాణం


                 2013 డిసెంబర్‌ 26న అరవింద్‌కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేజ్రివాల్‌ మంత్రివర్గం కూడా ఖరారైనట్లు సమాచారం.  గిరీష్‌ సోని, సతేందర్‌జైన్‌, సురభ్‌ భరద్వాజ్‌, సోమనాథ్‌ భారతి, మనీష్‌ సిసోడియా, రాఖీ బిర్లా తదితర ఆరుగురు సభ్యులకు  తొలివిడతగా స్థానం లభించినట్లు ఆ పార్టీ వర్గాల కథనం. ఈ నెల 26న రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణస్వీకారోత్సవంలో కేజ్రీవాల్‌తో పాటు మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు మంగళవారం ఉదయం ఢిల్లీ ప్రధాన కార్యదర్శి డి.ఎం.సపోలియా కేజ్రీవాల్‌ను కలిసి అధికార నివాసం, భద్రతకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అయితే వ్యక్తిగత సెక్యూరిటీకి, అధికార నివాసానికి ఆయన తిరస్కరించినట్లు పార్టీ నేత శిశోడియా విలేకరులకు తెలిపారు. కాగా పోలీసులు మాత్రం ప్రోటోకాల్‌ ప్రకారం కేజ్రీవాల్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తామని చెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం.
ప్రిన్సిపల్‌ సెక్రటరీగా రాజేందర్‌ కుమార్‌?
      ఢిల్లీ పగ్గాలు చేపట్టనున్న అరవింద్‌ కేజ్రీ వాల్‌కు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి రాజేందర్‌ కుమార్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వ్యవహరించ ను న్నారు.  47 ఏళ్ల కుమార్‌ ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
బిజెపి ఆగ్రహం
           కేజ్రివాల్‌ కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపట్ల బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన సీట్లు రాలేదు. మొత్తం 70 అసెంబ్లీస్థానాలకు ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు రావాలి. అధికారం కోసం  పోటీపడిన బిజెపి 32, కాంగ్రెస్‌ 8, ఆమ్‌ఆద్మీ 28 , ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు.  అవీవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆమ్‌ఆద్మీపార్టీ పదిరోజుల సమయం తీసుకుని  రెండుపార్టీల్లో ఏది ఎంత ప్రమాదకరమో అంచనా వేసింది. బిజెపి, కాంగ్రెస్‌ రెండూ ప్రమాదకరమైనవే కాని బిజెపితో పోల్చినప్పుడు కొంత తక్కువ అవినీతి, అదేవిధంగా తక్కువ ప్రమాదకరమైనది కాంగ్రెస్‌ అని నిర్ధారణకు వచ్చింది. అదే విధంగా ఎక్కువ సీట్లున్న బిజెపి మద్దతు తీసుకుంటే ఎప్పుడైనా కొందరు ఎమ్మెల్యేలను కొనేసి  ఆమ్‌ఆద్మీపార్టీని దెబ్బతీయవచ్చని ఆలోచించినట్లు కనబడుతుంది. అయితే కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బిజెపి జీర్ణించుకోలేక పోతుంది.2014లో  దేశంలో జరిగే జనరల్‌ ఎన్నికల్లో కూడా బిజెపి, కాంగ్రేసేతర పార్టీలు గెలుస్తాయని గతంలో బిజెపి నేత ఎల్‌కె అద్వాని తన ట్విట్టర్‌లో పేర్కొట్లుగా జరగవచ్చనిపిస్తోంది. దేశంలో మొత్త 28 రాష్ట్రాలుంటే 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోఉంది. 10 రాష్ట్రాల్లో బిజెపి కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ూన్నాయి. ఐదు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి  ఉంది. బిజెపి అధికారంలోఉన్న చత్తీస్‌ఘడ్‌, గోవా రాష్ట్రాల్లో ఒకటి, రెండేసి ఎంపీలున్నాయి. ఎక్కువ ఎంపీసీట్లున్న,ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బిజెపికి గడ్డు పరిస్థితులేఉన్నాయి. కాబట్టి అద్వాని చెప్పినట్లే 2014 జనరల్‌ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిల ప్రమేయం లేని ప్రభుత్వం ఏర్పడవచ్చు. 

17, డిసెంబర్ 2013, మంగళవారం

65 పేజీలు 13 షెడ్యూళ్లు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం 
                 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 2013 డిసెంబర్‌ 16న ప్రవేశపెట్టిన  పునర్వ్యవస్థీకరణ బిల్లులో 65 పేజీలు, 12 భాగాలు 13 షెడ్యూల్స్‌ ఉన్నాయి. మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు, రెండో షెడ్యూల్‌లో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వివరాలు, మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు,  నాలుగో షెడ్యూల్‌లో శాసనమండలి సభ్యుల విభజన, ఐదో షెడ్యూల్‌లో తెలంగాణా రాష్ట్రంలోని దళిత వర్గాల వివరాలు, ఆరో షెడ్యూల్‌లో తెలంగాణా రాష్ట్రంలోని గిరిజన వర్గాల వివరాలు, ఏడో షెడ్యూల్‌లో నిధులు, ఎనిమిదో షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు, తొమ్మిదో షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు, 10 షెడ్యూల్‌లో రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు, 11 షెడ్యూల్‌లో నదీజలాల నిర్వహణ బోర్డుల విధివిధినాలు, 12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు, 13వ షెడ్యూల్‌లో విద్య మౌలిక సదుపాయాల అంశాలు ఉన్నాయి. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. బిల్లు ప్రతులు ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు అందాయి. 17న జరిగిన బిఎసిలో 18, 19 తేదీల్లో  బిల్లుపై చర్చ జరగాలని నిర్ణయించారు. 
అందులోని ముఖ్యాంశాలు: 
»10 జిల్లాలతో కూడిని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, 
»13 జిల్లాల సీమాంధ్రతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 
» పదేళ్లు మించకుండా ూమ్మడి రాజధానిగా హైదరాబాద్‌, పదేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తరాజధాని ఏర్పాటు. 
»కొత్తరాజధానిపై నిఫుణుల కమిటీ ఏర్పాటు. 
»నిఫుణుల కమిటీ బిల్లు పాసైన 45 రోజుల్లో రాజధాని ఏర్పాటుకు సంబంధిత నివేదిక అందించనుంది.
» పదేళ్ల తరువాత తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌.
» ప్రస్తుత గవర్నరే రెండు రాష్ట్రాలకు ూమ్మడి గవర్నర్‌గా కొనసాగింపు.
» గవర్నర్‌ పరిధిలోనే శాంతిభద్రతలు, రెవెన్యూ ప్రభుత్వ భవనాలు ూంటాయి. 
»ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 175 అసెంబ్లీస్థానాలు, 25 పార్లమెంటుసీట్లు, 50 మంది ఎమ్మెల్సీలు.
» తెలంగాణకు 119 అసెంబ్లీస్థానాలు, 17 ఎంపీసీట్లు, 40 మంది ఎమ్మెల్సీలు.
»ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు ఏర్పాటు. 
»అప్పటి వరకు ూమ్మడిగానే ప్రస్తుత హైకోర్టు.
» అనంతరం ఇది తెలంగాణకు చెందుతుంది. 
»మూడేళ్లపాటు పోలీస్‌ట్రైనింగుసెంటర్‌ కేంద్రం పరిధిలో ూంటుంది. 
»మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రైనింగు సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. 
»నదీజలాల నిర్వహణకు కేంద్ర ూన్నతస్థాయి మండలి ఏర్పాటు. 
»ఈ మండలంలో సభ్యులుగా కేంద్ర మంత్రి, ఇరు ప్రాంత సిఎంలు ూంటారు. 
»జాతీయ ప్రాజెక్టుగా పోలీవరం.
» ఇరు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర సహాయం. 
»సింగరేణి గనులు తెలంగాణకే. 
»జెన్‌కో పవర్‌ ప్లాంట్లు ఎక్కడుంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి.
»ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఎం, ఐఐఎన్‌ఇఆర్‌, ట్రిపుల్‌ ఐటి, ఎయిమ్స్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ, వ్యవసాయ యూనివర్సిటీ. 
»రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు.
» కేంద్రసహకారంతో తెలంగాణాలో ఒక ూద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు. 
»ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా దుగ్గిరాజుపట్నం వద్ద కొత్త మేజర్‌పోర్టు నిర్మాణం చేపడుతారు. ఇది 2013 లోపు పూర్తి అవుతుంది. 
»ఖమ్మంలో స్టీల్‌ప్లాంటు  ఏర్పాటు అంశాన్ని సెయిల్‌ పరిశీలిస్తోంది. 
»ఆర్టికల్‌ 371 `డి రెండు రాష్ట్రాలకు కొనసాగింపు.
» ప్రస్తుత ఆంధ్రసర్వీస్‌కమిషన్‌  ఆంధ్రప్రదేశ్‌కే చెందుతుంది. 
»తెలంగాణాలో కొత్త సర్వీస్‌కమిషన్‌ ఏర్పాటు చేస్తారు. 
»ఆంధ్రప్రదేశ్‌  కొత్తరాజధానిలో ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. 
»విద్యాసంస్థలో  అడ్మిషన్‌ కోటాలు పదేళ్లపాటు యధాతథంగా ూంటాయి. 
»తెలంగాణాలోని అన్ని వెనుకబడిన ప్రాంతాలకు జాతీయ హైవే అథారిటీ ద్వారా రహదారుల నిర్మాణం కేంద్ర పరిశీలనలో పలు అంశాలు. 
» విశాఖపట్నం`చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు. 
» విశాఖ పట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ అంశం.  
»తెలంగాణాలో 4 వేల  మెగావాట్ల విద్యుత్‌ ూత్పత్తి ప్లాంటు నిర్మాణం. 
» ఆంధ్రప్రదేశ్‌లో కొత్తరైల్వేజోన్‌ ఏర్పాటు.
» హైదరాబాద్‌ నుంచి విడిపోయే ఆంధ్రప్రదేశ్‌  కొత్తరాజధానికి రాపిడ్‌ రెయిల్‌, రోడ్‌ కనెక్టివిటీ అంశాన్ని కేంద్రం పరిశీలన. 

16, డిసెంబర్ 2013, సోమవారం

రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి లేఖ సారాంశమిది


                      రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు`2013ను శాసనసభకు పంపుతూ భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన లేఖ   సారాంశం క్లుప్తంగా :
‘భారత ప్రభుత్వం భాగస్వాములతో విస్తృత చర్చలు, సంప్రదింపుల తరువాత , అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత మున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా రాష్ట్రాన్ని కొత్తగా  ఏర్పాటు చేయడానికి ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు `2013ను ప్రతిపాదించింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో రూపొందించిన బిల్లును ఆచరణలో సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిఉంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని భౌగోళిక సరిహద్దులను విస్తీర్ణాన్ని ఈ బిల్లు ప్రభావితం చేస్తుంది. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో కూడి ఉంటుంది. అందువల్ల, భారత రాజ్యాంగంలోని 3వ అధికరణంను అనుసరించి, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు `2013ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ 2014 జనవరి 23వ తేది నాటికి తన అభిప్రాయాలను తెలపడానికి పంపుతున్నాను.’
                                  బిల్లు ప్రతులను చింపేసిన టిడిపి, వైఎస్‌సిపి సభ్యులు 
                   . తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు డిసెంబర్‌ 16న స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు  టిడిపి అధ్యక్షడు నారాచంద్రబాబు నాయుడు కూడా లేరు. సీమాంధ్ర శాసనసభ్యులు టిడిపి, వైఎస్‌ఆర్‌సి శాసనసభ, శాసనమండలిలో గందరగోళం శృష్టించారు. బిల్లు ప్రతులను చింపేశారు.  అయితే బిఎసిలో చర్చించలేదని, ముందుగా చెప్పకుండా బిల్లు పెట్టడం సరైంది కాదని వాదించారు. సీమాంధ్ర, తెలంగాణా సభ్యుల మధ్య తోపులాట జరిగింది. బిల్లు అధ్యయనానికి సమయం కావాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు కోరారు. రాత్రి పొద్దు పోయేదాకా నిరసన తెలిపారు. అసెంబ్లీలో నిరసన తెలిపిన వారిని అరెస్టు చేసి పార్టీ కార్యాలయాలకు తరలించారు.