-పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకై డిమాండ్
- ఆగస్టులో ఎంపీిలకు వినతిపత్రాలు...
- సెప్టెంబర్‌లో ఢల్లీిలో వర్క్‌షాప్.
- సెప్టెంబర్‌లో ఢల్లీిలో వర్క్‌షాప్.
-పూలే, అంబేద్కర్ వర్థంతుల సందర్భంగా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు
-డిఎంఎంఎస్ జాతీయ కన్వీనర్ వి శ్రీనివాసరావు వెల్లడి
దళితుల సమస్యలపై దేశ వ్యాప్త ఉద్యమాన్ని చేపడుతున్నట్లు దళిత శోషన్ ముక్తి మంచ్(డిఎంఎంఎస్) జాతీయ కన్వీనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. 2015 జూన్ 9న సోమవారం జాతీయ కన్వీనింగ్ కమిటీ సమావేశం న్యూడిల్లీ ఎకెజి భవన్‌లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో దళితులకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాల నుంచి క్రమంగా వెనుకకు మళ్లుతోందని ఎద్దేవా చేశారు. దళిత మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అత్యచార చట్టం అసమగ్రంగా ఉందని...దాన్ని సవరిస్తూ గత ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే, ఈ ప్రభుత్వం దానిని మూలన పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ కమిటీకి సరిగా నిధులు కేటాయించలేదని, కేటాయించిన అరకొర నిధులు కూడా ఖర్చు పెట్టలేదని, ఈ కమిటీకి చట్ట బద్ధత కూడా లేదని గుర్తుచేశారు. దళితుల్లో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు పెరిగారని అన్నారు.ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌లు లేకపోవడంతో దళిత యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. ఈ సమస్యలను చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. ఆగస్టు చివరల్లో అన్ని నియోజక వర్గాల్లో ప్రజల సంతకాలతో కూడి వినతి పత్రాలను ఎంపీలకు సమర్పించాలని, సెప్టెంబర్ రెండో వారంలో డిల్లీలో దళిత మేధావులతో వర్కుషాపు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించిందన్నారు. అలాగే నవంబర్ 27న జ్వోతిరావ్ పూలే, డిసెంబర్6న అంబేద్కర్ వర్థంతి సందర్భంగా దేశవాప్తంగా జిల్లా కలక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించమన్నారు. ఈ సమావేశంలో నాయకులు వరదరాజన్, రాధాకృష్ట, అసీంబాల, మమత, ఆంధ్రప్రదేశ్ నాయకులు మాల్యాద్రి, సుబ్రమణ్యం, తెలంగాణ నాయకులు జాన్‌వెస్లీ, నర్శింహా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి