న్యూఢిల్లీ: 14
ఏళ్ల క్రితం 2004 డిసెంబరు 26న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి విపత్తు
సంభవించి 14 దేశాలకు చెందిన 2, 27,898 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరోజు
ఇండోనేషియా, భారత్‌తో పాటు పలు దేశాల్లో సంభవించిన సునామీ తాకిడికి కొన్ని
లక్షల మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇండోనేషియాలోని ఉత్తర ప్రాంతంలో
రిక్టార్ స్కేల్‌పై 8.9 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం
సముద్రంలో ఉద్భవించిన సునామీ భారత్‌తో పాటు పలు దేశాలను అతలాకుతలం చేసింది.
హిందూ మహా సముద్రంలో హఠాత్తుగా ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు అక్కడికి సమీపంలో
ఉన్న ప్రాంతాలను నామరూపాలు లేకుండా మార్చివేశాయి. థాయ్‌ల్యాండ్‌తో పాటు
పలు దేశాల్లో సముద్ర తీరంలో నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లలో బసచేసిన
విదేశీ పర్యాటకులు సముద్రపు అలలకు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ
ప్రకృతి విపత్తులో భారత్‌కు చెందిన 10 వేల మంది బలయ్యారు. ఈ సునామీ
ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా 18 లక్షల మంది నిరాశ్రయులవగా, 50 వేల మంది
గల్లంతయ్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి