మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవము ఊపిరితిత్తులు. ఇది శరీరం
పనితీరును సరిగ్గా నిర్వహించడంలో సహాయపడేందుకు ముఖ్యమైన పాత్రను
పోషిస్తాయి. కాబట్టి, ఈ వ్యాసంలో, ఇప్పుడు మనము ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ
ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్ధాల గూర్చి చర్చించుకోబోతున్నాము.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అందించిన నివేదిక ప్రకారం, 235 మిలియన్ల ప్రజలు
ఆస్త్మాతో బాధపడుతున్నారు. భారతదేశంలో, వాయు కాలుష్యం & ధూమపానం చేసే
వారు ఎక్కువగా ఉండటంవల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలమవుతున్నాయి.
Healthy Diet For Lungs: 12 Best Foods For Lungs
అయితే, మన ఊపిరితిత్తుల నిరంతరంగా కలుషితమైన గాలికి గురవటం వల్ల, ఈ కాలుష్య
కారకాలు బ్రోన్కైటిస్ (శ్వాసనాళముల వాపు), ఆస్తమా, న్యుమోనియా &
సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలను మనలో పెంచుతున్నాయి.
కాబట్టి, మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, దోహదపడే ఆహార
పదార్ధాలను తినడం చాలా మంచిది.
ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తీసుకోవలసిన ఆహారాల గూర్చి చదివి మీరే
తెలుసుకోండి. అవి,
1. యాపిల్స్ :
ఎవరైతే ప్రతిరోజూ ఒక గ్లాసు మోతాదులో ఆపిల్ రసాన్ని తీసుకుంటారో వారిలో
గురక తక్కువగా ఉంటుందని కనుగొనబడింది. మరొక అధ్యయనం ప్రకారం, గర్భవతులుగా
ఉన్న మహిళలు ప్రతిరోజూ ఆపిల్ను తినడం వల్ల పుట్టే పిల్లలలో ఆస్తమా లక్షణాలు
చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఆపిల్స్లో ఫాలోలిక్ సమ్మేళనాలు &
ఫ్లేవానాయిడ్లను కలిగివుంటాయి ఇవి శ్వాసనాళముల వాపును తగ్గిస్తాయి.
2. సాల్మన్ :
సాల్మన్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఊపిరితిత్తులలో ఏర్పడిన వాపును
తగ్గిస్తుంది & ఊపిరితిత్తులలో తిష్టవేసుకొని జీవిస్తున్న
బ్యాక్టీరియాతో కూడా పోరాడుతుంది. సాల్మొన్తో పాటు మాకేరెల్, ట్రౌట్,
సార్డినెస్ & హెర్రింగ్ వంటి ఈ చేపలు ఊపిరితిత్తులకు చాలా మంచివి.
3. ఆలివ్ ఆయిల్ : ఆయిల్, ఆలివ్ ఆయిల్, & కనోల ఆయిల్స్ వంటివి కలిగి ఉంటే అవి
మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచివి. పెరుగుతున్న రక్తపోటుకు & బలహీనమైన
రక్తనాళాల వంటి వాయు కాలుష్యంతో ముడిపడివున్న ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి
ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులకు & గుండెకు ఆక్సిజన్
సరఫరాను తగ్గిస్తాయి.
4. గ్రీన్-టీ :
గ్రీన్-టీ, మీ శరీరాన్ని శాంతపరచి, వాపులను / మంటలను తగ్గించి, మీకు
స్వస్థతను చేకూర్చడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటటిన్ అనేది ఒక సహజమైన యాంటిహిస్టామైన్గా
పనిచేస్తుంది, ఇది అలెర్జీ లక్షణాలను కలిగించే హిస్టామైన్ను విడుదలను
తగ్గిస్తుంది.
5. కాఫీ :
ఒక కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో మీకు సహాయపడుతుందని తెలుసా ?
కెఫిన్ ఒక బ్రోన్చోడైలేటర్గా పనిచేస్తుంది, ఇది ఆస్తమాటిక్స్లో గట్టి
వాయుమార్గాలను తెరచి & శ్వాసకోశ కండరాల అలసటను తగ్గిస్తుంది. కొన్ని
అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీను తాగటం వల్ల మీరు
తీసుకునే శ్వాసను మెరుగుపరచి & మీ ఊపిరితిత్తుల పనితీరును
మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
6. గింజలు
గింజలు కూడా మీ ఊపిరితిత్తులకు మరొక సూపర్ ఫుడ్స్. గుమ్మడికాయ గింజలు,
అవిసె గింజలు & పొద్దుతిరుగుడు గింజలు వంటివి మీ శరీరానికి
మెగ్నీషియమును పుష్కలంగా అందిస్తాయి,అలాగే ఆస్తమాతో బాధపడేవారికి అవసరమైన
మినరల్స్ను కూడా అందిస్తాయి. మెగ్నీషియం మీ శ్వాసకోశ కండరాలకు ఉపశమనాన్ని
చేకూర్చడంలో సహాయపడి, మీ శ్వాసను మెరుగుపరుస్తుంది. మీ చేతి నిండుగా ఈ
గింజలను పట్టుకొని వాటిని ప్రతిరోజు వినియోగించండి (లేదా) స్మూతీలో కలిపి
వాడండి.
7. ఆరెంజ్-రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు :
బొప్పాయి, గుమ్మడికాయ & నారింజ పండ్లు అనేవి ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు
& కూరగాయలు. ఈ రకమైన ఆహారాలు మీ ఊపిరితిత్తులకు స్నేహపూర్వకంగా ఉండే
యాంటీ-ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి అంటువ్యాధులను, ఇతర వాపు
తగ్గించడంలో బాగా ఉపకరిస్తాయి.
8. తృణధాన్యాలు :
బ్రౌన్ రైస్, క్వినొయా & గోధుమల వంటి ధాన్యపు ఆహారాలను మీ రోజువారి
డైట్లో ఉండేలా చూసుకోవాలి. మఫిన్లు, పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ వంటి
మరిన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్లను కలిగి ఉండే ఆహారాలుగా ఉంటూ, కార్బన్
డయాక్సైడ్ ఉత్పత్తిని పెంచి, మీ ఊపిరితిత్తులపై మరింత ఒత్తిడిని
పెంచుతుంది.
9. వెల్లుల్లి :
వెల్లుల్లిలో, గ్లూటాతియోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఫ్లేవానాయిడ్స్
కలిగివుంది, ఇది విషాన్ని & క్యాన్సింజెన్లను తొలగించడంలో సహాయపడటమే
కాకుండా ఇది మీ ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా ఉండటంలో సహాయపడుతుంది.
వారానికి రెండుసార్లు మూడు రెబ్బల పచ్చి వెల్లుల్లిని తీసుకున్నవారిలో
ఊపిరితిత్తుల క్యాన్సర్ను 44 శాతానికి వరకూ తగ్గించగలదని ఒక అధ్యయనంలో
కనుగొనబడింది.
11. కైయేన్ పెప్పర్ : (కారపు పొడి) క్యాప్సైసిన్ అనే సమ్మేళనమును కలిగి ఉంటుంది,
ఇది స్రావాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంధి, అలాగే శ్వాసకోశంలో ఎగువున,
దిగువున ఉన్న శ్లేష్మ పొరలను కాపాడుతుంది. అందువల్ల, ఆస్తమా లక్షణాలను
కలిగి ఉన్నవారు తీసుకునే భోజనంలో కారపుపొడిని కలిపి తీసుకోవాలి (లేదా) మీరు
కైయేన్ మిరియాలతో చేసిన టీని కూడా త్రాగవచ్చు.
12. బ్రోకలీ :
బ్రోకలీలో విటమిన్-సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్ & ఫైటోకెమికల్స్
ఉన్నాయి. ఈ ఆకుపచ్చ కూరగాయలో L- సల్ఫోరాఫాన్ అనే చురుకైన సమ్మేళనం ఉంది,
ఇది శ్వాస సంబంధిత కణాల అనారోగ్యాలను నివారించే యాంటీ ఇన్ఫ్లమేటరీ
జన్యువులుగా రూపాంతరం చెందుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి