12, జనవరి 2020, ఆదివారం

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ


Mahesh Babus Sarileru Neekevvaru Telugu Movie Review And Rating - Sakshi
Rating: 
మూవీ: సరిలేరు నీకెవ్వరు
జానర్‌: కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటుల: మహేశ్‌బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సంగీత
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
దర్శక​త్వం: అనిల్‌ రావిపూడి
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు

సంక్రాంతి పండుగ సీజన్‌లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన మరో బిగ్‌ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టీజర్‌, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం.. సంక్రాంతి సీజన్‌లో వస్తుండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ అదిరిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేని జోరుతో ఈ బొమ్మ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకుందా..
 
కథ: కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసే భారతి (విజయశాంతి) చాలా నిక్కచ్చి, నిజాయితీగల వ్యక్తి. తప్పును ఎప్పుడూ రైట్‌ అని టిక్‌ చేయదు. ఆమె పెద్ద కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం​ అమరుడవుతాడు. రెండో తనయుడు కూడా ఆర్మీలోనే ఉంటూ ఓ ఆపరేషన్‌లో గాయపడి.. చావుబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురికి పెళ్లి నిశ్చయమై.. ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి విషాదవార్తను చేరవేయాల్సి రావడంతో.. నైతిక కట్టుబాటుగా మేజర్‌ అజయ్‌ (మహేశ్‌బాబు)ను దగ్గరుండి పెళ్లి చేయించి.. ఈ వార్త చేరవేయాల్సిందిగా ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయి కొడుకు రవి మర్డర్‌ నేపథ్యంలో కర్నూలులో స్థానిక మినిష్టర్‌ నాగేంద్ర (ప్రకాశ్‌రాజ్‌) వల్ల భారతి చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతోంది. ఈ క్రమంలో శక్తిమంతుడైన నాగేంద్ర నుంచి భారతిని  అజయ్‌ ఎలా కాపాడారు.  ఈ మర్డర్‌ మిస్టరీని ఛేదించి ఎలా మంత్రిని మార్చాడు అన్నది మిగతా కథ..

నటీనటులు: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మరోసారి తన మ్యాజిక్‌ను తెరపై చూపాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్‌సమ్‌ లుక్‌తో, సెటిల్డ్‌ యాక్టింగ్‌తో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. కామిక్‌ టైమింగ్‌తో అలరించడమే కాదు యాక్షన్‌ పార్టులోనూ మహేశ్‌ దుమ్మురేపాడు. మహేశ్‌ ఎంట్రీ సీన్‌, తమన్నాతో ‘డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌’లో ఎనర్జిటిక్‌ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్‌ సీన్‌.. ‘మైండ్‌ బ్లాంక్‌’ పాటలో మాస్‌ స్టెప్పులతో ఇలా తనదైన పర్ఫార్మెన్స్‌తో మహేశ్‌ అలరించాడు. ఫస్టాప్‌లో రైలు జర్నీ సీన్లలోనూ పంచ్‌ డైలాగులు, కామెడీ సీక్వెన్‌తో నవ్వించాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సీన్‌లో యాక్షన్‌ పార్టు, మహేశ్‌ హీరోయిజం ఎలివేషన్‌ షాట్లు ఫ్యాన్స్‌ ను అలరిస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ పవర్‌ఫుల్‌గా ఉండటం ఫ్యాన్స్‌కు కిక్కు ఇస్తుంది. అల్లురి సీతారామరాజు సినిమాలోని సీన్‌ను సందర్భానుసారం వాడుకోవడం, సూపర్‌స్టార్‌ కృష్ణను గుర్తుచేయడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, సెకండాఫ్‌ వచ్చేసరికి కథ పెద్దగా ఏమీ లేదని తేలిపోవడంతో మహేశ్‌ పాత్ర కొంచెం స్లో అయిపోతోంది. ఇక, చాలాకాలం తర్వాత తెరపై మీద కనిపించిన విజయశాంతి భారతిగా పవర్‌ఫుల్‌ పాత్రలో అలరించారు. ఆమె సహజమైన అభినయం, డైలాగ్‌ డెలివరీ సినిమాకు ఒకింత నిండుతనం తెచ్చాయి. నిజాయితీగా గల ప్రొఫెసర్‌గా, ఆర్మీలో కొడుకులను కోల్పోయిన తల్లిగా ఆమె అభినయం ప్రేక్షకుల్లో గౌరవభావాన్ని, కంటతడిని పెట్టిస్తాయి. ఇక, హీరోయిన్‌గా రష్మిక మందన్నా మహేశ్‌ సరసన తనదైన ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌తో అలరించింది. మీకు ఏమైనా అర్థమవుతుందా.. ఐ యామ్‌ ఇంప్రెస్డ్‌.. వంటి పంచ్‌ డైలాగులతో నవ్వించింది. ‘హి ఈజ్‌ సో’ క్యూట్‌ పాటలో అందంగా కనిపించిన రష్మిక.. ‘మైండ్‌ బ్లాక్‌’ పాటలో.. మాసీలుక్‌తో గ్లామరస్‌ డోస్‌ను పెంచిందని చెప్పాలి. ఇక, మినిస్టర్‌ నాగేంద్రగా విలన్‌ పాత్రలో కనిపించిన ప్రకాశ్‌ తన పాత్ర మేరకు అలరించారు. తనదైన యాక్టింగ్‌తో ప్రకాశ్‌ రాజ్‌ మెప్పించినప్పటికీ.. సినిమా క్లైమాక్స్‌ వెళ్లేసరికి నాగేంద్ర పాత్ర అనేక మలుపులు తిరుగుతుంది. ఇక, రాజేంద్రప్రసాద్‌, కౌముది, సంగీత, రావు రమేశ్‌, హరితేజ తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ: పక్కా కమర్షియల్‌ సినిమాలు తీస్తూ.. వరుస హిట్స్‌ అందుకుంటున్న అనిల్‌ రావిపూడి మరోసారి పూర్తిగా తన ఫార్మెట్‌లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ను తీశాడు. తన సినిమాల్లో ఉండే అన్ని దినుసులు ఈ సినిమాలోనూ జోడించాడు. హీరో-హీరోయిన్లతో కామెడీ చేయించడం,  క్యాచీ పదాలు, పంచ్‌ డైలాగులతో ఇలా తనకు తెలిసిన అన్ని మాస్‌-మసాలా అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఈ విషయంలో ఫస్టాప్‌ వరకు సక్సెస్‌ అయిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌ వచ్చేసరికి ఎప్పటిలాగే కథను లైట్‌గా తీసుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్‌లో భారతి ఎందుకు కష్టాల్లో పడిందనే అంశాన్ని అంత గ్రిప్పింగ్‌గా, స్ట్రాంగ్‌గా అనిల్‌ చెప్పలేకపోయాడు. ఈ సినిమాలో జోడించిన మర్డర్‌ మిస్టరీ ఇన్వేస్టిగేషన్‌, దాని వెనుక ఉన్న నాగేంద్ర కరప్షన్‌ ఇలాంటి అంశాలు కొత్తగా ఉండకపోగా.. రోటిన్‌ అనిపించి బోర్‌ కొడతాయి. సెకండాప్‌ మొదట్లోనే ప్రకాశ్‌ రాజ్‌ను మహేశ్‌ ఢీకొనడంతో.. విలన్‌ పాత్ర వీక్‌ అవుతోంది.
అయితే, కథపై అంతగా శ్రద్ధపెట్టకపోయినా.. ఎప్పటిలాగే కామెడీ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై అనిల్‌ ఫోకస్‌ చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌కు నివాళులర్పించే సీన్‌, తల్లి (విజయశాంతి) భావోద్వేగం కంటతడి పెట్టిస్తాయి. డైలాగులు అక్కడక్కడ పేలి.. ప్రేక్షకులతో ఈల వేయించినా.. కొన్ని డైలాగుల రిపిటేషన్‌ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు క్యాచీ వర్డ్స్‌ను ఫోర్స్‌డ్‌గా పెట్టినట్టు అనిపిస్తోంది. ఇక, సీఎం, మంత్రులను బంధించి.. హీరో లెంగ్తీ లెక్చర్‌ ఇవ్వడం బాగానే ఉన్నా.. మరీ అవుట్‌ ఆఫ్‌ లాజిక్‌ అనిపిస్తోంది. కథ పెద్దగా లేకపోయినా.. ఇలాంటి అంశాలు, భారీ భారీ డైలాగులతో సెంకడాఫ్‌ను మరీ లెంగ్తీగా చేసిన ఫీలింగ్‌ కలుగుతోంది. అయితే, మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు ఉండటం, యాక్షన్‌పార్ట్‌ నీట్‌గా బాగుండటం, దేవీశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌ కావడంతో ఈ సంక్రాంతి సీజన్‌లో ఇది సూపర్‌స్టార్‌ అభిమానులు అలరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశముంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉండటంతోపాటు సినిమా నిర్మాణ విలువలు రిచ్‌ ఉన్నాయి. అయితే, ఎడిటింగ్‌ విషయంలో మరింత కత్తెరవేసి.. క్రిస్ప్‌గా ప్రజెంట్‌ చేస్తే బాగుండేదన్న ఫీలింగ్‌ రాకపోదు.
ప్లస్‌ పాయింట్స్‌
మహేశ్‌బాబు యాక్టింగ్‌, కామెడీ
విజయశాంతి
పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌
ఫస్టాప్
మైనస్‌ పాయింట్స్‌
కథ పెద్దగా లేకపోవడం
సెంకడాఫ్‌ లెంగ్తీగా ఉండటం

28, డిసెంబర్ 2019, శనివారం

ఎన్‌ఆర్‌సి అందరి సమస్య

ఎన్‌ఆర్‌సి అందరి సమస్య

* ఐక్యంగా ప్రతిఘటించడమే మార్గం
* కర్నూలు రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభలో సీతారాం ఏచూరి
* భారీగా తరలివచ్చిన ప్రజానీకం
ప్రజాశక్తి -కర్నూలు ప్రతినిధి:
            నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఎన్‌ఆర్‌సి (జాతీయ పౌరపట్టిక) ముస్లింల సమస్య మాత్రమే కాదని, దేశ ప్రజలందరికి సమస్యే అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులోని ఉస్మానియా కళాశాల మైదానంలో శనివారం జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) జాతీయ జనాభ పట్టిక (ఎన్‌పిఆర్‌)లను మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్యాకేజిగా ఆయన అభివర్ణించారు. ఇవి ముస్లింలకు మాత్రమే సమస్యయైనట్టుగా చిత్రీకరించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాస్తవం దీనికి భిన్నమని చెప్పారు. దీనివల్ల ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కునేది నిజమేనని, వారితో పాటు కుల, మతాలకు అతీతంగా దేశంలో ఉన్న సామాన్యులందరు కష్టాలు పడాల్సివస్తుందని వివరించారు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా ప్రతిఘటించడం ద్వారా వీటిని తిప్పికొట్టగలమని చెప్పారు.
              సభకు ముందు కర్నూలు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. అంబేద్కర్‌ భవన్‌ నుంచి రాజ్‌విహార్‌, గాంధీనగర్‌, కిడ్స్‌ వరల్డ్‌, వడ్డెగేరి మీదుగా ఉస్మానియా కళాశాల మైదానం వరకు సాగిన ఈ ప్రదర్శనలో వేలాది మంది ప్రజానీకం పాల్గొన్నారు అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌ అధ్యక్షతన జరిగిన సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా మతం పేరుతో దేశ విచ్ఛినానికి పూనుకుంటున్నారని అన్నారు. దీనిని ప్రతిఘటించి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజానీకంపై ఉందన్నారు. మోడీకి, అమిత్‌షాకు వ్యతిరేకంగా సభకు హాజరైన వారితో నినాదాలు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపి దేశ ప్రజల ఐక్యతను విఛ్చినం చేస్తోందన్నారు. పేదలు, గిరిజనులు, ఆదివాసీ సంచార జాతులు సైతం నివాస ధ్రువీకరణ పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రాలు ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు. హాస్పిటల్‌లో లభ్యమయ్యే జనన ధ్రువీకరణ పత్రాల్లో పాప, బాబు అని ఉంటుంది తప్ప పేర్లు ఉండవని అన్నారు. అలాగే పేదలు నివసించే చిన్నపాటి ఇళ్లకు పట్టాలు కూడా ఉండవని, వారు ఏవిధమైన ధ్రువీకరణ పత్రాలు తీసుకు రాలేరని చెప్పారు. ఈ తరహా సమస్యలు మతాలకు అతీతంగా అందరికీ వస్తాయని, ప్రమాదకరమైన ఈ తరహా చట్టాలను రద్దు చేసే వరకూ మతాల కతీతంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు.ఈ సందర్భంగా అస్సాంలో రూపొందించిన పౌర పట్టిక వివరాలను ఆయన ప్రస్తావించారు. పౌర పట్టిక రూపకల్పనతో అస్సాంలో దాదాపుగా 20 లక్షల మంది పౌరసత్వం ప్రమాదంలో పడిందని, వీరిలో అత్యధికులు హిందువులేనని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడి పరమవీర చక్ర పొందిన అబ్దుల్‌ హమీద్‌ వారసులకు కూడా అస్సాంలో పౌరసత్వం లభించలేదని అన్నారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్ర ప్రభుత్వాలు తాము కేంద్రం తెచ్చిన సిఎఎను అమలు చేయబోమంటూ ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిని వదిలి విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా మోడీ పెట్టుకున్నారని విమర్శించారు. మాతృభూమికోసం పోరాడటం తప్ప మరో మార్గం లేదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక హిందూ-ముస్లింల మధ్య తగాదా పెట్టడమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు.. ఈ ఉద్యమం మోడీ గద్దె దిగేదాకా కొనసాగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 8న కార్మిక వర్గమంతా రోడ్డుపైకి వస్తోందని, మైనార్టీలంతా ఆ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పిసిపి ఉపాధ్యక్షులు ఎన్‌.తులసీరెడ్డి మాట్లాడుతూ లౌకికవాదం లేకపోతే మొత్తం రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విఘాతం ఏర్పడుతుందని తెలిపారు.
            లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌, ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఏళ్లుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్శీలు కలిసిమెలసి జీవిస్తున్నారని తెలిపారు. విభిన్న సంస్కృతులు కలిస్తేనే భారతదేశం అయిందని అన్నారు. ప్రతేడాది జాతీయ పండగల నాడు జాతీయజెండాను ఎగురవేసే ఎర్రకోట, ప్రపంచంలోని పర్యాటకులందరినీ విశేషంగా ఆకర్షించే తాజ్‌మహల్‌ను ఎవరు నిర్మించారని ప్రశ్నించారు.
                   మోడీ ప్రభుత్వం అయోధ్య, ట్రిపుల్‌ తలాక్‌, జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను ఎత్తివేయడం లాంటి పచ్చి మతోన్మాద చర్యలకు పూనుకుందని విమర్శించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకులు పి.నిర్మల, సిపిఐ రాష్ట్ర నాయకులు సత్యనారాయణమూర్తి, రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఆవాజ్‌ నాయకులు ఎస్‌ఎ.సుభాన్‌, డిసిసి అధ్యక్షులు అలీఖాన్‌, జనసేన నాయకులు హర్షద్‌, సీనియర్‌ దళిత సంఘం నాయకులు, న్యాయవాది వై.జయరాజ్‌, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఇవిఎం కుంభకోణంపై దేశవ్యాప్త ఉద్యమం

కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా లు ,

జనవరిలో నూతన కార్యవర్గం ఎన్నిక,

బామ్‌సెఫ్‌, బిఎంఎం  జాతీయ సమ్మేళనం నిర్ణయం 

ప్రజాశక్తి`ప్రత్యేక ప్రతినిధి కర్నూలు

                    ప్రజా తీర్పును తప్పుదోవ పట్టిస్తున్న ఇవిఎం కుంభకోణంపై జనవరి 16 నుంచి ఏప్రెల్‌ 26 వరకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు జాతా నిర్వహించనున్నట్లు బామ్‌సెఫ్‌, భారత్‌ ముక్తిమోర్చా జాతీయ సమ్మేళనం తీర్మానిచింది. బామ్‌సెఫ్‌, మూలవాసీ, భారత్‌ ముక్తిమోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూలులో నిర్వహిస్తున్న జాతీయ సమ్మేళనం శుక్రవారం ముగిసింది.  2019 డిసెంబర్‌  23 నుంచి 27 వరకు జరిగిన జాతీయ  సమ్మేళనానికి దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు, జాతీయ నాయకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక కార్యకర్తులు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో పాతకమిటీని రద్దు చేశారు. 2020 జనవరి 11,12 తేదీల్లో డిల్లి లోని కరోల్‌ బాగ్‌ లో నిర్వహించే ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో  జాతీయ కమిటీని ఎన్నుకోనున్నామని బామ్‌సెఫ్‌ జాతీయ అధ్యక్షులు వామన్‌ మేశ్రమ్‌ ప్రకటించారు.  చివరి రోజు రాఖీగఢ డిఎన్‌ఎ తవ్వకాలు, వైజ్ఞానిక అన్వేషణ, సంచార జాతుల, తెగల, పరిశీలన, 2020లో ఎస్‌సి, ఎస్‌టి రాజకీయ రిజర్వేషన్ల పొడగింపు ప్రపంచీకరణ , ప్రయివేటీకరణ నేపథ్యంలో రిజర్వేషన్లపై , బడుగు ప్లిలల ఆరోగ్య సమస్య తదితర అంశాలపై చర్చ జరిపారు. భారత్‌ ముక్తిమోర్చా జాయతీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ విలాస్‌ ఖరత్‌ మాట్లాడుతూ హర్యానాలోని రాఖిగఢ తవ్వకాల్లో బయటపడిన మృతదేహాల డిఎన్‌ఎ పరీక్ష  ఆధారంగా బ్రాహ్మణులు భాతర దేశానికి సంబంధించిన వారు కాదని తేలిందని తెలిపారు. డాక్టర్‌ వసంత్‌ సిండే, నీరబ్‌ రాయ్‌ మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకు 2011లో డాక్టర్‌ మైకెల్‌ బామ్‌సెఫ్‌ ఫిర్యాదు మేరకు వసంత్‌ సిండేకు లీగల్‌ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఈమెరకు లెప్ట్‌నెంట్‌ కల్నల్ పురోహిత్‌ ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య సమావేశంలో బ్రాహ్మణులు  భారతీయులు    కారన్న విషయాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఆతరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ 100 బాంఋలు  పేల్చి విధ్వంసం సృష్టించిందని తెలిపారు. భారత్‌ ముక్తిమోర్చాపార్టీ జాతీయ ఉపాధ్యక్షు దాస్‌రామ్‌నాయక్‌ మాట్లాడుతూ సంచార జాతులు ఈదేశంలో 11 కోట్ల   మంది ఉన్నారని తెలిపారు. బ్రాహ్మణులు  కేవం 3 కోట్లు ఉన్నారని తెలిపారు. సంచార జాతులకు సంఘనిర్మాణం , నాయకత్వం, భాష లేదన్నారు. అందుకే వారికి స్థిరనివాసం, రిజర్వేషన్లు, కావల్సిన సట్టిఫికెట్లు ఏమి లేవని అన్నారు. అదే 3 కోట్ల బ్రాహ్మణుకు అన్నీ ఉన్నాయని తెలిపారు. లoబాడ, బుడగజంగాలు, వడ్డెరులు, తదితర సంచార జాతుల కోసం ప్రత్యేక షెడ్యూులు తయారు చేసి రాజ్యాంగపరమైన ఫలితాలు వారికి దక్కేలా చూడాలన్నారు.

11, అక్టోబర్ 2019, శుక్రవారం

పల్లవుల నగరంలో మోడి జిన్ పింగ్



  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు మోదీ అపురూపమైన బహుమతులు ఇచ్చారు. అనధికారిక చర్చలు జరిపేందుకు మహాబలిపురం వచ్చిన ఇరువురు నేతలు ఆత్మీయ స్నేహితులుగా మెలిగారు. భరత నాట్యం, కథకళి నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఈ నృత్యాల వివరాలను జిన్‌పింగ్‌‌కు మోదీ తెలిపారు. ఇరువురు నేతలు కళాకారులతో ఫొటో దిగారు. అంతకుముందు ఉభయులు మహాబలిపురంలోని శిల్పాలను తిలకించారు. మోదీ ఈ శిల్పాల ప్రత్యేకతను జిన్‌‌పింగ్‌కు వివరించి చెప్పారు. ఇరువురు కొబ్బరి నీళ్ళు తాగారు. జిన్‌పింగ్‌కు మోదీ స్వయంగా కొబ్బరి బొండం ఇచ్చారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు మోదీ నృత్య సరస్వతి చిత్ర పటం, నచియార్‌కోయిల్ హంస దీపం బహుమతిగా ఇచ్చారు. తంజావూర్ పెయింటింగ్‌ ప్రముఖుడు బి లోగనాథన్ రూపొందించిన నృత్య సరస్వతిని జిన్‌పింగ్‌కు బహూకరించారు. ఇది 16వ శతాబ్దంనాటి చిత్ర కళా రూపమైన తంజావూర్ పెయింటింగ్. నాయక, మరాఠా రాజుల పరిపాలనా కాలంలో ఈ చిత్ర కళ వృద్ధి చెందింది.

30, ఆగస్టు 2019, శుక్రవారం

‘సాహో’ రివ్యూ

 
బ్యాన‌ర్‌: యు.వి.క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, నీల్ నితిన్ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ఎవ్‌లిన్ శ‌ర్మ‌, చుంకీపాండే, లాల్‌, మందిరాబేడి, మ‌హేశ్ మంజ్రేక‌ర్‌, టిన్ను ఆనంద్‌, షాసా చెట్రి త‌దిత‌రులు
మ్యూజిక్: త‌నిష్క్ బ‌గ్చి, గురురంద్వా, బాద్షా, శంక‌ర్ ఎహ్‌సాన్‌లాయ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.మ‌ది
ఎడిటింగ్‌: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: వంశీ, ప్ర‌మోద్‌
ద‌ర్శ‌క‌త్వం: సుజిత్‌
 
                  తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి `బాహుబ‌లి`తో తెలియ‌జేసిన హీరో ప్ర‌భాస్‌. ఈ హీరో త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. అలాంటి తరుణంలో.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఒకే ఒక్క సినిమా అనుభ‌వ‌మున్న సుజిత్ అనే యువ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నట్లు ప్ర‌క‌టించాడు ప్ర‌భాస్. బాహ‌ుబ‌లితో ప్ర‌భాస్ రేంజ్ అంత‌ర్జాతీయ స్థాయికి చేర‌డంతో నిర్మాత‌లు సాహోను ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించారు. బాలీవుడ్ తార‌లు, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ఈ సినిమాకు ప‌నిచేయ‌డం, బాహుబ‌లి ఇమేజ్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చాయి. మ‌రి సాహో ఈ అంచ‌నాల‌ను అందుకుందా? లేదా? ప‌్ర‌భాస్ ఇమేజ్ పెరిగిందా? లేదా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం...
 
క‌థ‌
           ముంబైలో అతి పెద్ద దొంగ‌త‌నం జ‌ర‌గుతుంది. రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఓ దొంగ చిన్న సాక్ష్యం కూడా దొరక్కుండా  కొట్టేస్తాడు. కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ డేవిడ్‌(ముర‌ళీశ‌ర్మ‌), కానిస్టేబుల్ గోస్వామి(వెన్నెల‌కిషోర్‌) దొంగెవ‌రో తెలుసుకునే ప్రయత్నంలో విఫలమవుతారు. దీంతో ప్ర‌భుత్వం ఓ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అశోక్ చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్‌)ను నియ‌మిస్తుంది. అశోక్ కేసుని ఛేదిస్తుండగా చివ‌ర‌కు జై(నీల్ నితిన్ ముఖేష్‌)నే ఆ దొంగ అని తెలుస్తుంది. అయితే జైకు పోలీసుల నుంచి సమాచారం వ‌స్తుండ‌టంతో త‌ప్పించుకుంటూ ఉంటాడు.
 
జైనే అస‌లు దొంగ అని సాక్ష్యాల‌తో ప‌ట్టుకోవాలంటే ఏదో ఒక‌టి చేయాల‌ని.. అత‌నితో స్నేహం చేయ‌డానికి హీరో అత‌నుండే ప‌బ్‌కి వెళ‌తాడు. అదే స‌మ‌యంలో అమృతానాయ‌ర్‌(శ్ర‌ద్ధాక‌పూర్‌)కి డ్యూటీ వేస్తాడు. క్ర‌మంగా అశోక్ ఆమెను ల‌వ్ చేస్తుంటాడు. ఓసారి తాగిన మైకంలో జై ఓ క్లూ అశోక్‌కు ఇస్తాడు. వాజీ న‌గ‌రంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో కోట్ల రూపాయ‌లున్నాయని అది ద‌క్కితే తానే అదృష్ట‌వంతుడిన‌ని, అందుకోసం తాను ప్ర‌యత్నిస్తున్న‌ట్లు చెబుతాడు. ఆ బ్లాక్ బాక్స్ దొంగ‌త‌నం చేసే క్ర‌మంలో అత‌న్ని రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకోవాల‌ని ప్ర‌భాస్ పోలీసుల‌తో క‌లిసి ప్లాన్ చేస్తాడు.
 
         ఈ క్ర‌మంలో సిటీలో పెద్ద డాన్ రాయ్‌(జాకీ ష్రాఫ్‌)ను కొంద‌రు చంపేస్తారు. ఆయ‌న స్థానంలో డాన్ అయిన ఆయ‌న త‌న‌యుడు విశ్వాంక్‌(అరుణ్ విజ‌య్‌) తండ్రిని చంపిన వారిని ప‌ట్టుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో అనుకోని షాకింగ్ విష‌యాలు రివీల్ అవుతూ వ‌స్తాయి. అస‌లు అశోక్ ఎవ‌రు? అత‌నికి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు బ్లాక్ బాక్స్ ర‌హ‌స్య‌మేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణ‌
             బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెర‌గ‌డంతో సాహోపై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. ఈ అంచనాల‌కు త‌గ్గ‌ట్లే నిర్మాతలు, హీరో, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భారీ బ‌డ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో సాహో సినిమాను రూపొందించారు. రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కుడి త‌ర్వాత సుజిత్ వంటి ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ సినిమా చేయ‌డ‌మంటే .. నిజంగా అత‌ని తెగువకు అభినందించాల్సిందే. అయితే ఈ అంచ‌నాల కార‌ణంగా సాహో ఇండియ‌న్ మూవీ అనే అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వ‌స్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమా ఉండాలి. దీని వ‌ల్ల సినిమాలో సాంకేతిక హంగులు పెరిగాయి. దీంతో సినిమా బాలీవుడ్ రంగు పులుముకున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తుంది. యాక్ష‌న్ డ్రామా.. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను చిత్రీక‌రించారు.
 
             ఎంత పెద్ద భారీ చిత్ర‌మైనా ఓ భావోద్వేగం కూడా చాలా ముఖ్యం. ఈ ఎమోష‌న్ పార్ట్ సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా, క‌నెక్టింగ్‌గా ఉండ‌దు. సినిమా ప్ర‌థ‌మార్థం అంతా నెమ్మదిగా సాగుతోంది. అయితే అదంతా క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నాల‌ని అర్థం చేసుకోవాలంటే, ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌తో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో వ‌రుస ట్విస్టులతో షాకులిచ్చే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. ఈ షాకుల వ‌ల్ల ప్రేక్ష‌కుడు గందరగోళానికి లోనవుతాడు. ప్లాష్ బ్యాక్ పార్ట్‌ను మిక్స్ చేసి చూసిన త‌ర్వాత ఇది రివేంజ్ డ్రామానా అనిపిస్తుంది. సినిమాలో యాక్ష‌న్ పార్ట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నా.. వాటిని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి త‌గ్గ‌ట్లు న‌చ్చేలా తెరకెక్కించడం క‌ష్ట‌మైంద‌నే చెప్పాలి.
 
           ప్ర‌భాస్ యాక్ష‌న్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసినా.. ఎవ‌రితో, ఎందుకు చేస్తున్నాడ‌నే క‌న్‌ఫ్యూజ‌న్ క‌న‌ప‌డుతుంది. ప్ర‌తి విష‌యంలో ట్విస్ట్‌, థ్రిల్లింగ్ ఇవ్వాల‌నే త‌లంపుతో ప్ర‌తి విష‌యాన్ని దాచి పెట్ట‌డం.. చివ‌ర‌కు రివీల్ చేయ‌డంతో కాస్త తిక‌మ‌క‌గా త‌యారైంది. సినిమాలో కామెడీ పార్ట్ ఉన్న‌దే అనుకుని సంతృప్తిపడాలి. ఇక నటీన‌టుల ప‌రంగా చూస్తే ప్ర‌భాస్ గురించి మ‌నం త‌క్కువ చేయ‌లేం. బాహుబ‌లితో అతనేంటో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాలో న‌టుడిగా చాలా రిస్కుల‌తో న‌టించాడు. అలాగే శ్ర‌ద్ధాక‌పూర్ గ్లామర్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ అద్భుతంగా ఉంది కానీ.. హిందీ పాట‌ల్లా అనిపిస్తాయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. మ‌ది కెమెరా వ‌ర్క్ ఎక్స్‌ట్రార్డిన‌రీ. యాక్ష‌న్ ఎలిమెంట్స్ సూప‌ర్బ్‌. ఇత‌ర న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

28, ఆగస్టు 2019, బుధవారం

రాజుకున్న రాజధాని

తారస్థాయిలో అమరావతి రాజకీయం
తెదేపా అపోహలు సృష్టించొద్దు.. స్పష్టమైన ప్రకటన చేయాలి

భాజపా మార్పు అసాధ్యం.. మారిస్తే ఊరుకునేది లేదు

కాంగ్రెస్‌ అమరావతిలోనే కొనసాగించాలి

సీపీఎం ప్రజలు ఊరుకోరు..  రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సిందే

రోడ్డెక్కిన రైతులు

ఆందోళన వద్దన్న ఉపరాష్ట్రపతి

సుజనా, తెదేపా నేతలు భూములు కొన్నారన్న బొత్స..

వారు మినహా మిగతా వారికి న్యాయం చేస్తామని హామీ

సెంటు భూమీ కొనలేదన్న సుజనా

ఆందోళన చేస్తున్న రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి రాజధాని తరలింపు ఆలోచనలను విరమించుకునేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ తెరపై రాజధాని కీలక చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల్లో ఆందోళనలకు, పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. రాజధాని అమరావతిలో కొనసాగడంపై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజుకున్న ఈ రాజకీయం మంగళవారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధానిని అక్కడే కొనసాగించాలని ఆందోళనకు దిగాయి. రాజధాని రైతులూ రోడ్డెక్కారు. మరోవైపు ప్రభుత్వం.. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని, రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములన్నాయని ఆరోపించింది. అలాంటి వారిని పక్కనబెట్టి మిగిలిన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేసింది.
రాజధానిని కదిలిస్తే ఊరుకోబోమని భాజపా హెచ్చరించింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి వైకాపా తీరుపై ధ్వజమెత్తారు. బాధ్యతారహిత ప్రకటనలపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండు చేశారు. రాజధానిపై స్పష్టత ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని సీపీఎం నేత మధు హెచ్చరించారు. రాజధాని గ్రామాల్లో సీపీఎం నేతలు పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. రాజధానిని ప్రస్తుతమున్న ప్రాంతంలోనే కొనసాగించాలని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. రాజధానిపై రాజకీయాలు చేయొద్దని కోరుతూ మంగళగిరి మండలం యర్రబాలెం రైతులు రహదారిపై ఆందోళనకు దిగారు.
ఊరట: ఈ రాజకీయ వివాదం మధ్య రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు సొమ్మును విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం వారికి ఊరటనిచ్చింది.
అన్నీ బయటపెడతాం

రాజధాని ప్రాంతంలో సుజనా, చంద్రబాబు బంధువులకు భూములు

ఏ ఒక్కరికో మేలు జరిగేలా వ్యవహరించం: మంత్రి బొత్స
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర రాజధాని అనేది ఒక ప్రాంతానిదో.. ఒక సామాజికవర్గానిదో.. నాయకుల సొంతానిదో కాదు.. 5 కోట్ల మంది ప్రజానీకానిది. 13 జిల్లాలకు సంబంధించినది’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతూ తలసరి ఆదాయం పెరగాలనేదే సీఎం జగన్‌ ఆలోచన. అంతేగానీ ఒకరికి మేలు చేసేలా మా ప్రభుత్వం వ్యవహరించదు’ అని వివరించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధానిలో కొందరు వ్యక్తుల పేర్లతో 25వేల చదరపు గజాల స్థలాలున్నాయి. త్వరలో పేర్లతో సహా వెల్లడిస్తాం. రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములున్నాయి. అక్రమాలను వరుసగా వెల్లడిస్తాం’ అని చెప్పారు. అరగంట ఆగితే చంద్రబాబు ఇల్లూ మునిగేది

‘వరదల్లో ఇల్లు మునిగిపోతుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ హైదరాబాద్‌ వెళ్లారు. వరదలు తగ్గాక వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు ఇంటిని ముంచాలనుకుంటే.. ఇంకో అరగంట ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవకపోతే సరిపోయేది కదా’ అని వ్యాఖ్యానించారు.
భాజపా నేతలు ఎందుకు మారారో?

‘రాజధాని ఒక కుంభకోణం.. అవినీతి జరుగుతోందని భాజపా గతంలో ఆరోపించింది. రూ.వేల కోట్ల టెండర్లు పిలిచారని, భూ సమీకరణలో అక్రమాలు జరిగాయని వైకాపాతోపాటు ఆ పార్టీ చెప్పింది. వాళ్లు ఇప్పుడెందుకు విధానాన్ని మార్చుకున్నారో అర్థం కావటం లేదు’ అని బొత్స పేర్కొన్నారు.
రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తాం

రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. పింఛన్లు ఇస్తున్నాం. కౌలు చెల్లిస్తున్నాం. భూములు అభివృద్ధి చేసి ఇస్తాం. రాజధానికి భూములిచ్చిన రైతులు నన్ను కలిసి ఈ ఏడాది కౌలు చెల్లించాలని కోరారు. వెంటనే రూ.187.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చాం.
బొత్స ప్రధాన ఆరోపణలు

* సుజనా చౌదరి బంధువు, గ్రీన్‌టెక్‌ కంపెనీలో డైరెక్టరు అయిన జితిన్‌ కుమార్‌ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాల భూములున్నాయి. ఈడీ ఇచ్చిన జాబితా ప్రకారం ఆయనకు ఉన్న 120 సంస్థల్లో ఇదీ ఒకటి. ఆయన సోదరుడి కుమార్తె అయిన యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలున్నాయి. ఆయన రాజధాని ప్రాంతంలో ఎకరా ఉంటే చూపించమన్నారు. 124 ఎకరాలు చెప్పా.

* చంద్రబాబు వియ్యంకుడికి వియ్యంకుడు అయిన ఎంఎస్‌బీ రామారావుకు చెందిన వీబీసీ సంస్థకు ఏపీఐఐసీ ద్వారా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఎకరా రూ.లక్ష చొప్పున 493 ఎకరాలిచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వారెవరైనా ఎకరా రూ.లక్ష చొప్పున ఇంట్లో వాళ్లకు ఇచ్చుకోవడం ఎక్కడైనా జరిగిందా? దీన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనాలా? క్విడ్‌ ప్రో కో అనాలా?

* చంద్రబాబు రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిందంటున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరంలలో పెరిగాయని నా స్నేహితులు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచనేంటి? అక్కడెక్కడా పెరగకుండా అమరావతిలోనే పెరగాలా? 
మెట్రోకు అంత అవసరమా?

‘మొత్తం 67 కిలోమీటర్ల దూరంతో అమరావతి మీదుగా వెళ్లేలా రూ.24,460 కోట్ల అంచనా వ్యయంతో విజయవాడ మెట్రోకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేశారు. ఇంత మొత్తంతో మెట్రో అవసరమా?
భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే...

ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే బయటకు వస్తుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘అమరావతిలో భూములు కొన్నవారంతా రాజధాని తరలిపోతే రూ.కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయోనని పీడకలలు కంటున్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆయనకు రియల్‌ ఎస్టేట్‌ తప్ప ఇంకెలాంటి సమస్యలు కనిపించడం లేదా?’’ అని మంగళవారం ట్విటర్‌లో విమర్శించారు. ఎంపీ సుజనాచౌదరి భాజపాలో చేరినా ఆయన మదిలో చంద్రబాబే ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు.
సెంటు భూమీ కొనలేదు: సుజనా
ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఒక్క సెంటు భూమీ కొనలేదని రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 నెలల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మంత్రి బొత్స సత్యనారాయణ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనే కొత్త పదాన్ని వారే కనిపెట్టారని, ఒకవేళ అదే జరిగి ఉంటే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది కాబట్టి విచారణ జరపొచ్చని సవాల్‌ చేశారు. మంగళవారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రి బొత్స కొండను తవ్వి ఎలుకను పట్టారు. రాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో మా పూర్వీకులకు, మా అన్న, వదినల పేరు మీద 120 ఎకరాల భూములున్నాయని చెబుతున్నారు. ఆ భూములు ఎప్పుడు ఎవరు అమ్మారో? కొన్నారో? ఆ వివరాలివ్వాలి. రాజధానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ... ఇంకా దూరంగా కోదాడలోనూ మాకు భూములుంటాయి. ఉన్నంత మాత్రాన ఇష్టారీతిన మాట్లాడతారా? బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న బొత్స తనకు తెలిసిన సమాచారాన్ని సరిచూసుకుని మాట్లాడాలి. ఊరికే మాట్లాడుతూ ప్రజల సమయాన్ని వృథా చేయకుండా పాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది’ అని సుజనా వ్యాఖ్యానించారు.
రాజధానిని కదిలిస్తే ఊరుకోం

భాజపా నేతలు లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి
ఈనాడు, గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతిలోనే నిర్మించాలని, దాన్ని అక్కడినుంచి కదిలించే ఆలోచన చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని భాజపా నేతలు హెచ్చరించారు. మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనాచౌదరి ధ్వజమెత్తారు. రైతుల మనోభావాలను తెలుసుకునేందుకు వీరిద్దరూ మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాయపూడి వద్దకు చేరుకున్న 29 గ్రామాల రైతులనుద్దేశించి మాట్లాడారు. ‘రాజధాని అంటే వేసుకుని వదిలేసే చొక్కాలాంటిది కాదు. అభివృద్ధిని నిర్ణయించేది. రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు. వారిని ఇరకాటంలో పడేసేలా మంత్రి బొత్స మాట్లాడుతున్నారు’ అంటూ సుజనాచౌదరి మండిపడ్డారు. రాజధానిలోని 29 గ్రామాల్లో ఎక్కడైనా తన పేరిట సెంటుభూమి ఉన్నా నిరూపించాలని సవాల్‌ విసిరారు.
పాదయాత్రలో జగన్‌ చెప్పింది గుర్తుంది: కన్నా

పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి రాజధానిని మార్చేది లేదని చెప్పినట్లు తనకు గుర్తుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధానిని మారుస్తామంటూ మంత్రులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అమరావతిని తరలిస్తామంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు. ‘ఇప్పటిదాకా ఈ ప్రాంతం మునిగిన దాఖలాలు లేవు. 7, 8 మీటర్లు తవ్వగానే నేలలో రాయి తగులుతుంది. మంచి రవాణావ్యవస్థ ఉంది. ఇన్ని ప్రయోజనాలుంటే అమరావతి రాజధానికి సరైనది కాదంటున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతం వరదల్లో మునుగుతుందని నిరూపిస్తే తన పుట్టింటోళ్లు ఇచ్చిన మూడెకరాలు మంత్రికి రాసిస్తానని మందడం గ్రామానికి చెందిన బత్తుల గంగాభవాని సవాలు విసిరారు. విజయవాడ నుంచి సుజనాచౌదరి తొలుత తాళ్లాయపాలెం వచ్చారు. అక్కడ రైతులతో మాట్లాడుతుండగా వారి పక్కనుంచే సీఎం కాన్వాయ్‌ వెళుతోంది. ఆ సమయంలో రైతులు అమరావతి జిందాబాద్‌, రాజధాని ఇక్కడే ఉండాలని నినాదాలు చేయగా.. సీఎం కారులో నుంచే రైతుల వైపు చూసి నమస్కరిస్తూ వెళ్లిపోయారు.
ఉప రాష్ట్రపతిని కలిసిన రైతులు
ఉంగుటూరు, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చామని..రాజధాని మార్పు అనే ప్రచారం సాగుతోందని, అక్కడ నిర్మాణాలు నిలిచిపోయినందున అందరిలో ఆందోళన నెలకొందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురు రైతులు వాపోయారు.

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ విజయవాడ చాప్టర్‌లో మంగళవారం ఆయనను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. రాజధాని విషయంలో ఎటువంటి అధికార ప్రకటన వెలువడనందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను రాజకీయాలు మాట్లాడకూడదని, అయినా రాజ్యాంగబద్ధంగానే తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనాలోచనతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని రైతులకు సూచించారు.

26, ఆగస్టు 2019, సోమవారం

‘మిస్‌ ఇండియా’ కీర్తి సురేశ్‌..


                    హైదరాబాద్‌: కథానాయిక కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’గా కనిపించనున్నారు. అదేంటి..? అనుకుంటున్నారు. ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకుడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేశ్‌ ఎస్‌ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. జగపతిబాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, సుమంత్‌, నదియా తదితరులు నటిస్తున్నారు.
                    ఈ సినిమా టైటిల్‌ రివీల్‌ టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌ నాజూకుగా, స్టైలిష్‌గా కనిపించారు. చిత్రం షూటింగ్‌ దాదాపు విదేశాల్లో జరిగినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం పేర్కొంది. ఇది ‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సినిమాగా కావడం విశేషం.

24, ఆగస్టు 2019, శనివారం

అరుణ్‌జైట్లీ కన్నుమూత




23, ఆగస్టు 2019, శుక్రవారం

ఫోటోగ్రాఫర్ సుధాకర్ కు సన్మానం


           
విజయవాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా   రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు రవాణా శాఖ మాత్యులు    పేర్ని వెంకట్రామయ్య (Nani), రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ ,  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్   ముఖ్య        అతిథులుగా పాల్గొన్నారు.  పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆధ్వర్యంలో పెన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపకులు బడే ప్రభాకర్ అధ్యక్షతన  సీనియర్ జర్నలిస్టులకు ఫోటో వీడియో జర్నలిస్టులకు అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభను ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్న పని అని, ఈ ఫోటోలు  నిరంతరం  చిరకాలం జ్ఞాపకాలతో పాటు ప్రతి ఒక్క ప్రతిమలకు కార్యక్రమాలకు గుర్తింపుగా ఉండిపోతుంది.  ఎటువంటి లాభాపేక్ష లేకుండా  జర్నలిజంలో వృత్తిలో పని చేస్తూ ఉన్న ఫోటోగ్రాఫర్లకు  సన్మానించారు.  కర్నూల్ సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధాకర్ గారికి సన్మానం చేశారు . ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా కర్నూలు జిల్లాలో  ఎంపికయిన సుధాక రు ను. సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మంచి ఫోటో గుర్తింపు గా సన్మానం అందుకోవడం అదృష్టమన్నారు. ఇందులో పలువురు సీనియర్ నాయకులు పాత్రికేయులు పాల్గొన్నారు.