16, అక్టోబర్ 2025, గురువారం

భారత ఆర్థిక విప్లవానికి ఎపి కీలక ప్రాంతం

- ఎపి సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సూపర్‌ జిఎస్‌టి `సూపర్‌ సేవింగ్స్‌ సభలో భారత  ప్రధాని నరేంద్రమోడీ

` మోడీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌
                  భారత ఆర్థిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ కీలక ప్రాంతమని, ఢల్లీి, అమరావతి కలిసి అభివృద్ధివైపు నడుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. 2025 అక్టోబర్‌ 16న గురువారం ఆంధ్రప్రదేశ్‌  ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత ఢల్లీి నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. తరువాత సున్నిపెంట నుంచి హెలీకాప్టర్‌ ద్వారా కర్నూలు నగర శివార్లలోని నన్నూరు టోల్‌గేట్‌ వద్ద ఉన్న హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఓపెన్‌ టాప్‌ వాహనంలో సూపర్‌ జిఎస్‌టి సూపర్‌ సేవింగ్స్‌ బహిరంగ సభ వేదికకు చేరుకున్నారు. చంద్రబాబు, పవన్‌ మోడీకి శాలువా కప్పి సన్మానించారు. ఎపిలో రూ.13,400 కోట్లతో పలు ప్రాజెక్టులకు, ప్రారంభానికి మోడీ బటన్‌ నొక్కారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ వికసిత భారత్‌కు స్వర్ణాంధ్రప్రదేశ్‌ మరింత తోడ్పడనుందని, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో ఎపి సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నామని తెలిపారు.
శ్రీకాకుళం నుంచి ఆంగుల్‌ వరకూ గ్యాస్‌ పైప్‌ లైన్‌ ను జాతికి అంకితం చేశామని చెప్పారు. దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ ఓ కీలక ప్రాంతంగా ఉందని, సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్ర వేగంగా అభివృద్ధి దిశగా నడుస్తోందని అన్నారు. 20 వేల సిలిండర్ల సామర్ధ్యంతో ఇండేన్‌ బాటిలింగ్‌ ప్లాంట్‌ను చిత్తూరులో ప్రారంభించామన్నారు.  మల్టీమోడల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో కనెక్టివిటీ పెంచుతున్నామన్నారు.     సబ్బవరం నుంచి షీలానగర్‌ వరకూ కొత్త హైవేతో కనెక్టివిటీ పెరిగిందన్నారు.  రైల్వేరంగంలో కొత్తయుగం ప్రారంభ మైందని,  ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా ప్రాజెక్టులను ప్రారంభించుకున్నామని తెలిపారు.     వికసిత్‌భారత్‌ 2047 సాధన సంకల్పానికి స్వర్ణాంధ్ర లక్ష్యం మరింత బలం అందిస్తుందని చెప్పారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది వేగాన్ని మరింతగా పెంచు తుందన్నారు.  భారత్‌ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. గూగుల్‌ లాంటి ఐటీ దిగ్గజం ఎపిలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించిందని, దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌ పెడుతున్నట్టు గూగుల్‌ సిఇఒ చెప్పారని వివరించారు. డేటాసెంటర్‌,ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్వర్క్‌ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు.  ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్‌ సీ కేబుల్‌ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుందన్నారు.     విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్‌ భారత్‌ కే కాదు ప్రపంచానికి సేవలందింస్తుందని తెలిపారు.  సీఎం చంద్రబాబు విజన్‌ ను అభినందిస్తున్నానన్నారు.     దేశ ప్రగతికి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చాలా కీలకం ఎపి అభవద్ధి చెందాలంటే రాయలసీమ కూడా అభివృద్ధి అంతే అవసరమన్నారు.  కర్నూలులో ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయన్నారు.  పారిశ్రామిక అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు.  ఎపి  వేగవంతమైన అభివద్ధి కోసం కొప్పర్తి -ఒర్వకల్‌ పారిశ్రామిక నోడ్ల ద్వారా పచ్చే పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.     21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్‌ను చూస్తున్నాయన్నారు. భారత్‌ లో ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకుంటోందని, ఆత్మనిర్భర్‌ భారత్‌లో ఎపి కీలకంగా మారిందన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఎపి ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోందన్నారు. కష్ణా జిల్లా నిమ్మకూరులో రక్షణ రంగానికి చెందిన నైట్‌ విజన్‌ గాగుల్స్‌, క్షిపణుల సెన్సార్లు, డ్రోన్‌ గార్డులను తయారు చేయగలదన్నారు.     రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులను కూడా చేసేందుకు ఆస్కారం ఇస్తుందని తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌ లో దేశంలో తయారైన ఉత్పత్తుల బలం ఏమిటో చూశామని,     కర్నూలులో భారత్‌ డ్రోన్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని ఎపి నిర్ణయించటం సంతోషదాయకమన్నారు.     డ్రోన్ల తయారీ ద్వారా కర్నూలు భారత్‌ కు ఓ గర్వకారణంగా నిలుస్తుందన్నారు.     పౌరులను అందుకు  అనుగుణంగా అభివృద్ది చేయాలనేది ఎన్‌డిఎ ప్రభుత్వ నినాదమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ అనే అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు.     ప్రజల జీవితాలను సులభతరం చేయటమే సంకల్పమన్నారు.     రూ.12 లక్షల ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరికీ పన్ను లేకుండా చేశామని,  వృద్ధుల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సరిగ్గా నవరాత్రి ముందు జిఎస్‌టి సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చాం. ప్రజలపై పన్నుల భారం తొలగించాం.    మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జిఎస్‌టి పొదువు ఉత్సవాన్ని పండుగలా చేసుకున్నారు. సూపర్‌ జిఎస్‌టి సూపర్‌  సేవింగ్స్‌ పేరిట కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయం. జిఎస్‌టి సంస్కరణల వల్ల ఎపి ప్రజలు రూ.8 వేల కోట్ల మేర ప్రజలకు ఆదా అవటం సంతోషదాయకమన్నారు. కానీ ఆ ప్రయోజనాలు అందరికీ అందాల్సి ఉందని తెలిపారు.  అప్పుడే అది సఫలమైనట్టని చెప్పారు.     స్థానిక తయారీ రంగాన్ని కూడా ప్రోత్సహించేలా ఈ సంకల్పం తీసుకోవాలని,    వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ తోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.

బడుల్‌ ఇంజన్‌ సర్కారుతో రెట్టింపు ప్రయోజనం : ఎపి సిఎం చంద్రబాబు

                     కేంద్రంలో రాష్ట్రంలోని ఎన్‌డిఎ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ఆంధ్రప్రదేశ్‌ కు రెట్టింపు ప్రయోజనాలు దక్కుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్‌ జిఎస్‌టి - సూపర్‌ సేవింగ్స్‌, బచత్‌ ఉత్సవ్‌ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిఎస్‌టి 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఎం ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  అత్యంత అంకిత భావంతో దేశానికి సేవలు అందిస్తున్న మోదీ ఓ విశిష్టనేత అని కొనియాడారు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోదీ ఉన్నారన్నారు.  ఆయన 21 వ శతాబ్దపు నేత అని సీఎం వ్యాఖ్యానించారు. ఎలాంటి విరామం లేకుండా ప్రజల సేవలోనే ఆయన అంకితమై ఉన్నారన్నారు.  తాను చూసిన ప్రధానుల్లో మోదీ అత్యంత ప్రగతిశీల నేత అని అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన కీలకమైన సంస్కరణలు తీసుకువచ్చారని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటోందని అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోదీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందన్నారు.  వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్‌ పవర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ ద్వారా సైనిక పరంగా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటేలా చేశారని ముఖ్యమంత్రి  అన్నారు.
                                                    జిఎస్‌టి  సంస్కరణలతో ప్రజలందరికీ లాభమే
                  ఒకే దేశం ` ఒకే పన్ను ` ఒకే మార్కెట్‌ నినాదంతో వచ్చిన జిఎస్‌టి పన్ను విధానంలో ప్రస్తుత సంస్కరణల వల్ల 99 శాతం వస్తువులు సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయన్నారు. తద్వారా అన్ని వస్తువుల ధరలు తగ్గాయని సీఎం అన్నారు. జిఎస్‌టి 2.0తో పన్నులు తగ్గి పేదలు, మధ్యతరగతికి గణనీయంగా ఉపశమనం కలిగిందని అటు వ్యాపారులు, ఎంఎస్‌ఎంఇ వర్గాలకూ ప్రయోజనం చేకూరుతోందని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ది కలిగించేలా సంస్కరణలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జిఎస్‌టి తగ్గింపుతో ప్రతీ కుటుంబానికీ రూ.15 వేల వరకూ ఆదా అవుతుందని స్పష్టం చేశారు. దసరా నుంచి దీపావళి వరకూ జిఎస్‌టి సంస్కరణలను పండుగలా నిర్వహిస్తున్నామని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 98 వేల ఈవెంట్లు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. జిఎస్‌టి బచత్‌ ఉత్సవ్‌ కాస్తా ఇవాళ భరోసా ఉత్సవ్‌ గా మారిందని చంద్రబాబు అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తో రాష్ట్రానికి డబుల్‌ ప్రయోజనాలు కలుగుతున్నాయని సిఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు, సూపర్‌ జిఎస్‌టితో ప్రజలకు సూపర్‌ గా పొదుపు జరిగిందని సీఎం అన్నారు.
                                                                        స్వదేశీ మంత్రమే బ్రహ్మాస్త్రం
               ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న టారిఫ్‌ లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ పిలుపే తారకమంత్రం అవుతుందని అన్నారు. ఈ స్వదేశీ పిలుపును అందిపుచ్చుకుని సెమీ కండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకూ చిప్‌ల నుంచి షిప్పుల వరకూ ఎపిలోనే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా మెగా డిఎస్‌సి, పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం-2.0, పెన్షన్ల పంపిణీ, వంటి సంక్షేమ పథకాలను కేంద్ర సహకారంతోనే సూపర్‌ హిట్‌ చేశామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి 16 నెలలుగా ప్రధాని మోదీ అందిస్తున్న సాయాన్ని మరువలేం అన్నారు. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టామని, పోలవరాన్ని గాడిన పెట్టామని, విశాఖ ఉక్కును బలోపేతం చేశామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక పెట్టుబడులు సాధిస్తోందని విశాఖలో ఆర్సెల్లార్‌ మిట్టల్‌, 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో గూగుల్‌ ఎఐ డేటా హబ్‌ వస్తోందని, నెల్లూరులో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ రిఫైనరీ వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.  రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్‌ రాబోతోందని సిఎం చెప్పారు. రాయలసీమలో స్టీల్‌, స్పేస్‌, డిఫెన్స్‌, ఏరో స్పేస్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, డ్రోన్స్‌ తయారీ, గ్రీన్‌ ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, సిమెంట్‌ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వీటితో పాటు సెమీ కండక్టర్‌ యూనిట్‌, క్వాంటం వ్యాలీ రావడానికి కారణమైన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు సిఎం వ్యాఖ్యానించారు.
                                               మోడీ కర్మయోగి : ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌
                డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ నిజమైన కర్మయోగి అన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ 15 ఏళ్ల పాటు ఉంటుందని, ఆత్మ నిర్భర్‌ భారత్‌ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారన్నారు. జిఎస్‌టి సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందన్నారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ నడుస్తోందన్నారు. జిఎస్‌టి తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారన్నారు. భారత్‌ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోడీనే కారణమన్నారు.
                                        రాష్ట్రంలో డబల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌:మంత్రి నారా లోకేష్‌
              రాష్ట్రంలో డబల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌ నడుస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. జిఎస్‌టి తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా పేదలకు మంచి జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయన్నారు. భారత్‌ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే కారణమన్నారు.
                                 ఓటు వేసి కోట్లు రాబట్టాం : ఆర్థిక  మంత్రి పయ్యావుల కేశవ్‌
                       2024 మీరు వేసిన ఓటు వేల కోట్ల సంక్షేమ అభివృద్ధి పనులు అందించింది. తల్లికి వందనం,ఉచిత బస్సు, ఉచిత  గ్యాస్‌,వంటి ఎన్నో  పథకాలు అందించాం.ప్రధాని ఆశీస్సులతో మనరాష్ట్రంలో గూగుల్‌ సంస్థ పెట్టుబడులు పెట్టింది.ప్రధాని ఆపరేషన్‌ సిందూర్‌ తో మన దేశ  శక్తిని,గొప్పతనాన్ని చాటి చెప్పారు. భవిష్యత్‌ తరాల కోసం కూటమిగా ఏర్పడి  మన రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గాడిన పెట్టారు.
                                                 ఎపిలో  రూ.13,429 కోట్ల కేంద్ర ప్రాజెక్టులు
                రాష్ట్రంలో విద్యుత్‌, రైల్వే, జాతీయ రహదారులు, పారిశ్రామిక, రక్షణ రంగాలకు చెందిన రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్‌ విధానం ద్వారా వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఇంకొన్నింటిని శంకుస్థాపనలు చేశారు. మరో రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. రూ.9,449 కోట్ల విలువైన 5 అభివద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.1704 కోట్ల విలువైన 8 అభివృద్ధి పనులను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇక రూ.2276 కోట్ల విలువైన 2 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
           శంకుస్థాపనలు: విద్యుత్‌ ట్రాన్స్‌ మిషన్‌ వ్యవస్థ - రూ. 2886 కోట్లు, ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్‌ - రూ. 4922 కోట్లు, కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్‌  రూ. 493 కోట్లు, పెందుర్తి - సింహాచలం నార్త్‌ మధ్య రైల్‌ ఫ్లైఓవర్‌ లైన్‌ - రూ. 184 కోట్లు, సబ్బవరం-షీలానగర్‌ జాతీయ రహదారి - రూ. 964 కోట్లు.
              ప్రారంభోత్సవాలు: రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు - రూ. 82 కోట్లు, కడప - నెల్లూరు - చునియంపల్లి రోడ్లు - రూ. 286 కోట్లు, కనిగిరి బైపాస్‌ రోడ్‌ - రూ. 70 కోట్లు, గుడివాడ-నూజెండ్ల వద్ద 4లేన్ల రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి - రూ. 98 కోట్లు, కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు -రూ. 13 కోట్లు, పీలేరు - కలసూర్‌ నాలుగు లేన్ల రోడ్‌ - రూ. 593 కోట్లు, నిమ్మకూరులోని భెల్‌ఇ అడ్వాన్స్‌డ్‌ నైట్‌ విజన్‌ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం - రూ. 362 కోట్లు, చిత్తూరులోని ఇండేన్‌ బాట్లింగ్‌ ప్లాంట్‌` రూ. 200 కోట్లు.
               జాతికి అంకితం: కొత్తవలస `కొరాపుట్‌ రైల్వే డబ్లింగ్‌ పనులు` రూ. 546 కోట్లు, శ్రీకాకుళం- అంగుల్‌ నాచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ - రూ. 1730 కోట్లు.

                                                   శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించిన ప్రధాని సిఎం
                     కర్నూలు విమానాశ్రయం నుంచి శ్రీశైల క్షేత్రానికి హెలికాప్టర్‌లో వెళ్లిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శ్రీశైల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న శక్తిపీఠంలోని భ్రమరాంబ అమ్మవారిని దర్శించి.. వేదపండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు. శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రానికి వెళ్లిన ప్రధాని మోదీ సహా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వెళ్లారు. స్పూర్తి కేంద్రంలోని దర్బార్‌ హాల్‌, ధాన్య మందిరాన్ని ప్రధాని సందర్శించారు.
                కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు,  భూపతి రాజు శ్రీనివాస్‌ శర్మ, పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర ఐటీ , విద్యా శాఖ మంత్రి  నారా లోకేష్‌,  రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్‌ , రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి మరియు జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ప్రధానమంత్రి ప్రోగ్రామ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి వీరపాండియన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, ఐఎఎస్‌ అధికారి దినేష్‌ కుమార్‌, సమాచార శాఖ డైరెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, అభిషేక్‌, తదితరులు పాల్గొన్నారు.


                                                                        ప్రధాని పర్యటన సైడ్‌లైట్స్‌
                                                                                పరస్పరం పొగడ్తలతో సరి

` -ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రిలోకేష్‌, ఇతర మంత్రులు ప్రధాని మోడీ కర్మయోగి, ఇంతగొప్ప నాయకుడిని చూడలేదని, జిఎస్‌టి తగ్గించి మేలు చేశారని పొగడ్తలతో ముంచెత్తినా ప్రజల డిమాండుపై ప్రధాని ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఎపికి ప్రత్యేకహోదా, విశాఖస్టీల్‌ప్లాంటును బలోపేతం చేస్తామని చెప్పలేదు. గతంలో ప్రకటించిన వాటి గురించే మాట్లాడారు.
`-చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ప్రారంభంలో జిఎస్‌టి వల్ల లాభం చేకూరిందా లేదా తమ్ముళ్లూ లాభం చేకూరిన వారు చేతులెత్తాలంటే జనం నుంచి స్పందన కనబడలేదు. `భవిష్యత్తులో నైనా లాభం ఉంటుందని నమ్ముతున్నారా అంటే కూడా చేతులెత్తలేదు. మోడీ...మోడీ..అని గట్టిగా చెప్పండండే మిశ్రమ స్పందన వచ్చింది.
`-చివరగా ప్రధాని చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ సమర్థవంతమైనా నాయకులను పొగడ్తలతో ముంచెత్తారు.
`-సభావేదికపై మోడి అభివాదం చేస్తూ పోడియం వద్దకు వస్తున్నప్పుడు పెద్దఎత్తున అరుపులు కేకలు వినపించాయి.
`-ప్రసంగం పూర్తయ్యాక అందరి మొహాల్లో నిరాశ కనబడిరది.
`-చంద్రబాబు నాయుడు, లోకేష్‌ కంటే మోడి, పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగాలకు జనం నుంచి స్పందన కనిపించింది.
`-మోడీ ప్రసంగం ప్రారంభంలో కర్నూలు జిల్లాలోని దేవాలయాలు, దేవుళ్లు , జిల్లా పోరాట యోధుల గురించి ప్రస్తావించారు.
`- వేదికపై ప్రధాని మోదీని శాలువతో సత్కరించి, మహాశివుడు ప్రతిమను జ్ఞాపికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
`-ట్రాఫిక్‌ జామ్‌ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పార్కింగ్‌ చాలా దూరం ఉండటంతో మహిళలు, వృద్దులు వాహనాల వద్దనే ఆగిపోయారు.
`-టాయిలెట్ల దగ్గర నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు.
`-వేదికపై చంద్రబాబు నాయుడుకు దగ్గువచ్చి గొంతు బొంగురు పోవడంతో ఎంపి బైరెడ్డి శబరి పరుగుపెట్టి నీళ్లు తెచ్చారు.
`-బస్సులన్నీ మోడీ సభకు పోవడంతో బస్టాండులో కర్నూలు బస్సులు, జనం లేక బోసి పోయింది.
`-ప్రధాని రాష్ట్ర, జిల్లా ప్రధాన సమస్యలను పట్టించుకోవాలని నన్నూరు వద్ద యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 

-విద్యాద్ఘాతానికి ప్రధాని సభా ప్రాంగణం వద్ద కర్నూలు జిల్లాకు చెందిన అర్జున్‌ అ
ను యువకుడు మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు.






3, అక్టోబర్ 2025, శుక్రవారం

ఆటవిక క్రీడకు అడ్డుకట్ట పడదా

`బన్నీ ఉత్సవం పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన
 `భక్తి పేరుతో  పాతకక్షలు తీర్చుకుంటున్నారు
`ఎంతకాలం మూఢనమ్మకాలు  

             కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో దసరాకు
రంలో అడుగడుగునా మానవహక్కులను ఉల్లంఘిస్తున్నారు. దేవరగట్టు కర్రల సమరం చరిత్రను పరిశీలిస్తే కర్నూలు జిల్లా, హోళగుంద మండలం, దేవరగట్టులో కొండపై శ్రీ మాళ మల్లేశ్వర స్వామి (శివుడు), మాలమ్మ (పార్వతీ దేవి) గుడి ఉంది.  మాళ మల్లేశ్వర స్వామి మని, మల్లాసురులు అనే ఇద్దరు రాక్షసులు సాధువులకు ఆటంకం కలిగించే వారని, వారిని  సంహరించారని చెబుతారు.   చనిపోయే ముందు ఆ రాక్షసులు, తాము మరణించిన దసరా రోజున నరబలి కావాలని శివపార్వతులను కోరారని,  శివపార్వతులు ఆ కోరికను తిరస్కరించారని చెబుతారు. ఆ రాక్షసుల కోరిక మేరకు దసరా పండుగ రోజున దేవరగట్టు ప్రాంతంలో రక్తం చిందుతుందని భక్తులు నమ్ముతారు. దీనికి గుర్తుగా ఏటా రక్షపడి వద్దకు వచ్చి కొంత రక్తాన్ని సమర్పించడం ఆనవాయితీగా ఉండేది.  మరొక నమ్మకం ప్రకారం, పూర్వకాలంలో విష సర్పాలు, జంతువుల నుండి రక్షణ కోసం భక్తులు దివిటీలు, కర్రలతో కొండపైకి వెళ్లి దేవుడి విగ్రహాలను తాకడానికి పోటీ పడేవారు. ఈ క్రమంలోనే గాయాలయ్యేవని చెబుతారు. కాని గత 40 యేళ్ల నుంచి ఈతంతు గ్రామాల మధ్య పోటీగా మారింది. మాళ మళ్లేశ్వరుల విగ్రహాలను స్వాధీనం చేసుకునే క్రమంలో కర్రలతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది దసరా సందర్భంగా వందలాది మంది గాయపడటం ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు.  ఈఏడాది కూడా ఇద్దరు మతి చెందారు. 78మందికి పైగా గాయపడ్డారు. రక్తపాతం జరగకూడదని పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. గురువారం రాత్రి 8 గంటల నుంచి దేవర గట్టు జనం రావడం మొదలైంది... రాత్రి 12గంటల తరువాత రింగ్‌ కర్రలతో వేలాది మంది విడతల వారీగా దివిటీలు, డప్పు శబ్దం చేస్తూ వచ్చారు. 1-30 గంటలకు లక్షకు పైగా జనం చేరుకున్నారు.  స్త్రీలు, పురుషులు 50 వేలకు పైగా సందర్శకులు వచ్చారు. కిక్కిరిసిన జనంతో వాతావరణం గాంభీరంగా మారుతుంది. నిర్వాహకులు మూడు ఔట్స్‌ (భారీ శబ్దం తో టపాసులు) పేల్చుతారు. సమీపంలో  సందర్భకులు, విఐపిలకోసం నిర్మించిన భవనాలు ఆశబ్ధాలకు కదులుతాయి. ఒళ్లుగగుర్పాటు కలిగించే ఈ చర్యలు అనేక ఉంటున్నాయి. ప్రధానంగా కర్రలతో కొట్టుకుని చావడం  అనేది  మానవ హక్కుల ఉల్లంఘన.
ఫలించని అవగాహన కార్యక్రమాలు
                 దేవరగట్టు కర్రల సమరంలో హింసను అరికట్టేందుకు పలువురు, మేథాలువు, జెవివి శాస్త్రీయతను కోరుకునే వారు, రెవెన్యూ , పోలీసు అధికారులు దేవరగట్టు సమీప గ్రామాలకు వెళ్లి అవగాహన కల్ఫించినా ఫలితం లేదు. అవగాహన కల్పించిన సమయంలో గ్రామాల్లో వృద్ధులు, పిల్ల్లలు మాత్రమే ఉంటున్నారు. యువకులు ఇక్కడ ఉపాధి లేక కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస పోతారు. వారంతా దసరా పండుగలకు వస్తారు.  ఈసారి 20 యేళ్లనుంచి 30 యేళ్లలోపు వారే అధికం. ఎందుకు కర్రలతో వస్తారని  వారిని వివరణ కోరితే మా పూర్వికుల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అందుకే మేము వస్తున్నాం. దేవుని కోసం వస్తున్నామని చెబుతున్నారు.
                   మూఢనమ్మకాలు, అనాగరిక చర్యలు , సాంఘిక దురాచారాలను రూపు మాపేందుకు  గతంలో కొందరు మహానుభావులు చేసిన కృషి ఫలించింది. సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు వివాహాలు వంటికి పోయాయి. ఇది కూడా ఒక ఆటవిక చర్య. యథేచ్చగా మానవహక్కులు ఉల్లంఘిస్తుంటే పాలకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.
టిడిపి గ్రూపుల మధ్య వివాధంగా మారింది
                ఈసారి టిడిపి గ్రూపుల మధ్య వివాదంగా మారింది. వీరభద్రగౌడ్‌, వైకుంఠం సోదరుల మధ్య ఉన్న తగాదాలు బన్ని ఉత్సవంలో ప్రతిబింబించినట్లు కొందరు చెప్పారు. ఈఉత్సవానికి  రెండు రోజుల క్రితం కలెక్టర్‌ కర్నూలు ఎస్‌పి కూడా ప్రకటించింది అదే. కొందరి కక్షసాధింపు  కోసం ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. వారిని గుర్తించాం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలూరు నియోజకవర్గ  మాజీ టిడిపి ఇన్‌చార్జి అనుచరులను చంపేస్తామని ముందే హెచ్చరికలు చేసినట్లు చర్చ జరిగింది. ఈసారి ఆలూరు మండలం అరికెర గ్రమానికి చెందిన వారికి ఎక్కువ మందికి గాయాలయ్యాయి. ఒక టిడిపి కార్యకర్త కూడా మాట్లాడుతూ తగాదాలున్నాయని అందుకే ఘర్షణ జరిగిందని చెప్పాడు.
నెరణిక గ్రామానికి చెందిన మళ్లికార్జున గౌడ్‌ నిర్వహకులలో ఒకరు మాట్లాడుతూ ఇక్కడ కేవలం భక్తికోసమే వస్తున్నారు. కొట్టుకోవడానికి కాదు అన్నారు. మధ్యం తాగువచ్చిన వారికి దెబ్బలు తగులుతాయి. మిగతావారికి ఏమి కాదని చెబుతాడు. నేను 40 ఏళ్లనుంచి పాల్గొంటున్నా నాకు ఏమి కాలేదని చెప్పారు.




11, ఆగస్టు 2025, సోమవారం

గ్రామాల్లో బెల్ట్‌షాపులను నిషేధించాలి




బుద్దారం చరిత్ర `సంస్కృతి పుస్తకావిష్కరణ సభలో జి.చిన్నారెడ్డి
                గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెల్టుషాపులను పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. రచయిత  హెచ్‌.రమేష్‌బాబు రచించిన గోపాల్‌పేట మండలం  ‘బుద్దారం చరిత్ర`సంస్కృతి’ పుస్తకాన్ని చిన్నారెడ్డి ఆవిష్కరించారు. విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  పాలకులు ఆదాయంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గురించి కూడా ఆలోచించాలని అన్నారు. శతాబ్దాల బుద్దారం చరిత్ర గ్రంథస్తం కావడం రేపటి తరాలకు ఎంతో అవసరమని గ్రామాల చరిత్రనే దేశ చరిత్రలకు మూలంగా ఉన్నదని అన్నారు.   ఇలాంటి చరిత్రలను ప్రతి గ్రామంలోనూ రచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుద్దారం విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రచయిత  హెచ్‌. రమేష్‌ బాబును ప్రోత్సహించి గ్రామ చరిత్ర రాయడానికి చేసిన కృషిని అభినందించారు. బుద్దారం గోనబుద్దారెడ్డితో మొదలుకొని కాకతీయుల కాలం నుండి వర్ధమాన పురం మీదుగా గొప్ప చరిత్రను కలిగి ఉన్నదన్నారు. గ్రామంలో చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారని చెప్పారు.  పూర్వకాలం బుద్దారం ఒక గొప్ప నగరం అని పేర్కొన్నారు. రమేష్‌బాబు చాలా రచనలు చేశారని సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గురించిరాసిన పుస్తకం చదివానన్నారు.   వనపర్తి జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షులు లోకనాథ్‌ రెడ్డి ప్రసంగిస్తూ ఇలాంటి గ్రామ చరిత్రలతో కూడిన గ్రంథాలు అన్ని గ్రామాలలో రూపొందాలని పేర్కొన్నారు. పానుగల్‌ ఎంఇఒ శ్రీనివాసులు పుస్తకాన్ని సమీక్షించారు. చారిత్రక నేపథ్యంతో పాటు, గ్రామంలో విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం, అంబేద్కర్‌ విజ్ఞాన సేవాసంఘం చేసిన సేవలను రచయిత వివరించారని తెలిపారు.  గ్రామపంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి సర్పంచులు, గ్రామంలో నిశ్నాతులు, వివిధ వృత్తులలో స్థిరపడిన వారి వివరాలు బాగా సేకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.బలరాంరెడ్డి, డి.అచ్యుత రామారావు, డాక్టర్‌ ఎల్‌.శ్రీనివాసులు, ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య, మాజీ సర్పంచులు జాంప్లానాయక్‌, పానుగంటి శివకుమార్‌,  డాక్టర్‌  పలుస శేఖర్‌, అమర్‌నాత్‌, పి.రాములు, పసుపుల కృష్ణారావు, విశ్వవాణి గ్రామాభివృద్ధి సంఘం నాయకులు పూల్యానాయక్‌, ఉమామహేశ్వర్‌, ఓంకార్‌ మాట్లాడారు. రచయిత రమేష్‌బాబును సన్మానించారు.


15, జూన్ 2025, ఆదివారం

పెట్టుబడి గ్రంథాన్ని చదవటానికి ప్రేరణ ‘సిందూరం’

-సిందూరం కవితా సంపుటి పరిచయ సభలో ప్రసాదమూర్తి

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌
                     కారల్‌మార్క్సు పెట్టుబడి గ్రంథాన్ని మరో కోణంలో చదవడానికి ప్రేరణ ‘సిందూరం’ అని ప్రముఖ రచయిత, కవి, సీనియర్‌ జర్నలిస్టు డాక్టర్‌ ప్రసాదమూర్తి అన్నారు. ఆదివారం కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష రచించిన ‘ సిందూరం’ పెట్టుబడి కవితల కట్టుబడి అనే పుస్తక పరిచయ సభ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా నిర్వహించారు.  ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన సిందూరం కవితా సంపుటిని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి  ప్రసాదమూర్తి మాట్లాడుతూ రచయిత పున్నం వెంకటేశ్వర్లుతో ఉన్న పరిచయాన్ని ఆయన వివరిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా యూనివర్సిటీలో కమ్యూనిజం గురించి కవిత్వం రాయాలనేవారన్నారు.  ప్రజాశక్తిలో తాను సబ్‌ఎడిటర్‌గా పని చేస్తున్నప్పుడు, కలిసి పని చేశామన్నారు. ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులుగా, ప్రజాశక్తి జర్నలిజం స్కూలుకు ప్రిన్సిపల్‌గా వివి పని చేశారన్నారు. పట్టుదల గల వ్యక్తి మానసిక బలాఢ్యుడని కొనియాడారు. మనుషులు ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని చెప్పారు. మానవజాతి చరిత్ర అజెయమన్నారు. సింధూరంలో పెట్టుబడి కీలక అంశమన్నారు. కవి పెట్టుబడి అనే అంశాన్ని కవిత్వంలో అన్వయించడం  చాలా సాహసోపేతమైన పని అన్నారు. సిందూరమనే కవితా సంపుటిలో సరళంగా రాశారని, పెట్టుబడిని కవిత్వంలోకి తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారని పేర్కొన్నారు.
‘ఇది స్త్రీ నుదిటి సిందూరం కాదు/ శ్రమశక్త్తి వాటామార్పుకు/ తెగువచూపే కష్టజీవుల/ బలగాలు చేసే యుద్ధాల/ నుదిటిపై దిద్దిన పోరాటాల కొత్త సిందూరం’ అని ఉన్న వెంకటేశ్వర్లు కవితలో చెప్పారన్నారు.  ప్రస్తుత ప్రభుత్వాలు పెట్టుబడులు మతతత్వాలకు నిలయంగా మారాయని అన్నారు. ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వస్తువుగా ఉపయోగించా రన్నారు. పెట్టుబడి ఎలాంటి పరిస్థితులకు  దారితీస్తుందో వివరించారన్నారు.  మానవ సమాజానికి పెట్టుబడికి ఉన్న సంబంధం గురించి సిందూరం పేరుతో చక్కగా రాశారన్నారు. మార్క్స్‌ క్యాపిటలిజం గురించి చెప్పడంతోపాటు సమాజంలో జరుగుతున్న విషయాలను సిందూరంలో ఉద్వేగ భరతమై విషయం తీసుకున్నా రన్నారు. విధ్వంస చర్యలను గురించి వివరించారని చెప్పారు. సమసమాజ భావ జాలాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించా రని చెప్పారు. ప్రజాశక్తి కర్నూలు ఎడిషన్‌ ఇంచార్జి పానుగంటి చంద్రయ్య మాట్లాడుతూ ఉన్నం వెంకటేశ్వర్లు , ఉష ఎల్లప్పుడూ పత్రికల్లో కొత్తదనం ఉండాలని సూచించేవారని, పట్టుదల, క్రమశిక్షణ గలవ్యక్తులని అన్నారు. సిందూరం కవితా సంపుటిలో సరళమైన బాషలో, అర్థవంతమైన పదాల పొందికతో అందరినీ చదివించ దగినదిగా ఉందని చెప్పారు. మార్పు అనివార్యం అని కొత్తకోణంలో చెప్పిన ఈ పుస్తకాన్ని చదవాలన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ మానవ సమాజ మార్పును కోరుకునే మార్క్సు పెట్టుబడిని గ్రంథాన్ని  కవిత్వంలో రాయడం గొప్ప పని అన్నారు. మనిషికి మనిషిని దూరం చేసే సమాజంలో మనం ఉన్నామన్నారు. బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి ఆవుల చక్రపాణి ఉన్నం వెంకటేశ్వర్లు ఉషాలో పంపిన సందేశాలను చదివి వినిపించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీశ్రీ అభిమానులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

18, సెప్టెంబర్ 2024, బుధవారం

నేషనల్‌ బటర్‌స్కాచ్‌ డే

       

                     ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 19న జరుపుకునే నేషనల్‌ బటర్‌స్కాచ్‌ పుడ్డింగ్‌ డేని స్వీట్‌ టూత్‌ కలిగి ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఇష్టపడతారు. బ్రౌన్‌ షుగర్‌ , వెన్న యొక్క ప్రాథమిక పదార్ధాల నుండి తయారవుతుంది. బటర్‌స్కాచ్‌ వంటకాలలో కొన్నిసార్లు మొలాసిస్‌ (ట్రెకిల్‌ అని కూడా పిలుస్తారు) కూడా ఉంటుంది.ఈ ట్రీట్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచదార పాకంకు బంధువు అయినప్పటికీ, బటర్‌స్కాచ్‌కు కొన్ని ప్రత్యేకమైన రుచి తేడాలు ఉన్నాయి.

జాతీయ బటర్‌స్కోచ్‌ పుడ్డింగ్‌ డేని ఎలా జరుపుకోవాలి

           బటర్‌స్కాచ్‌ పుడ్డింగ్‌ తినడం ఆనందించండి. ఈ ప్రత్యేకమైన రోజు రుచికరమైన బటర్‌స్కాచ్‌ పుడ్డింగ్‌లో మునిగిపోవడానికి సరైన కారణం!. స్క్రాచ్‌ నుండి ఇంట్లో తయారు చేసినా, ఇన్‌స్టంట్‌ బాక్స్‌ నుండి మిక్స్‌ చేసినా, లేదా స్కూల్‌ లంచ్‌ కప్‌ల నుండి నేరుగా తిన్నా, బటర్‌స్కాచ్‌ పుడ్డింగ్‌ ఈ రోజున లేదా ఏ రోజునైనా ఆనందించడానికి ఒక ఆహ్లాదకరమైన ట్రీట్‌. బటర్‌స్కాచ్‌ పుడ్డింగ్‌ను పంచుకోవడానికి స్నేహితుడిని ఆహ్వానించండి. అయితే, బటర్‌స్కాచ్‌ పుడ్డింగ్‌ను ఒంటరిగా, లేదా స్నేహితులతో కలిసి ఆస్వాదించవచ్చు.

జాతీయ బటర్‌స్కోచ్‌ పుడ్డింగ్‌ డే చరిత్ర

             1817లో తిరిగి కనిపెట్టబడిన బటర్‌స్కాచ్‌ మిఠాయిని ఇంగ్లాండ్‌లోని రాజకుటుంబ సభ్యులకు క్షీణించిన డెజర్ట్‌గా అందించారు. డాన్‌కాస్టర్‌లోని యార్క్‌షైర్‌లో శామ్యూల్‌ పార్కిన్సన్‌ అనే వ్యక్తి దీనిని సృష్టించినట్లు భావిస్తున్నారు. ఖచ్చితమైన మూలాలు ఎవరికీ తెలియనప్పటికీ, ఈ డెజర్ట్‌ను ప్రేరేపించిన మిఠాయి కోసం ఒక రెసిపీ 1848లో ఒక వార్తాపత్రికలో ప్రచురించబడిరదని రికార్డులు చూపిస్తున్నాయి. వాస్తవానికి, ‘బటర్‌స్కాచ్‌’ అనే పేరు స్కాట్‌లాండ్‌లో ఉత్తరాన సృష్టించబడిన మిఠాయిని సూచిస్తుంది. ఇది ఈ రుచికరమైన మిఠాయి మూలాల గురించి కొన్ని వివాదాలకు కారణం. కానీ కొందరు వ్యక్తులు ఈ పదంలోని ‘స్కాచ్‌’ భాగం వాస్తవానికి ‘స్కార్చ్డ్‌’ అనే పదం నుండి ఉద్భవించిందని, చక్కెర అత్యంత అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయబడే విధానాన్ని సూచిస్తుంది.

                 ఈ ఇష్టమైన కస్టర్డీ డెజర్ట్‌, బటర్‌స్కోచ్‌ పుడ్డింగ్‌ విషయానికి వస్తే, మూలాలు కొంచెం అస్పష్టంగా ఉంటాయి. ఈ క్రీము, డైరీ ట్రీట్‌ను మొదట యునైటెడ్‌ స్టేట్స్‌లో తయారు చేసి అందించారని నమ్ముతారు, ఇది బ్రిటిష్‌ మిఠాయి రుచి నుండి ప్రేరణ పొందింది. రెసిపీలో నిజానికి వెన్న, పాలు , గుడ్లు, బ్రౌన్‌ షుగర్‌తో పాటు సూపర్‌ తీపి రుచిని కలిగి ఉండవచ్చు.  ప్రపంచంలోనే అతిపెద్ద బటర్‌స్కాచ్‌ మిఠాయి రికార్డు నార్వేలో జరిగింది. 3500 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న ఈ మిఠాయి దాదాపు 18 అంగుళాల పొడవుతో 5 అడుగుల వెడల్పుతో ఉంది.  బటర్‌స్కాచ్‌ క్యాండీలు 1951లో క్వీన్‌ విక్టోరియాకు యార్క్‌షైర్‌ సందర్శకురాలిగా ఉన్నప్పుడు, ఈ ట్రీట్‌ను కనిపెట్టిన ప్రాంతాన్ని ఆమెకు అందజేయడం వల్ల ఇంగ్లాండ్‌లో ఖ్యాతి పెరిగింది.  బటర్‌స్కాచ్‌ , కారామెల్‌ ఒకేలా ఉన్నప్పటికీ, ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, బటర్‌స్కాచ్‌ బ్రౌన్‌ షుగర్‌తో తయారు చేయబడుతుంది. అయితే పంచదార పాకం తెల్ల చక్కెరతో చేయబడుతుంది.


16, సెప్టెంబర్ 2024, సోమవారం

పచ్చబొట్టు చెదిరిపోదేలే...

        ‘‘పచ్చబొట్టు చెదిరిపోదులే నారాజా...పడుచు జంట చెదిరిపోదులే నారాజా ’  ‘పచ్చబొట్టు చెదిరిపోదులే నారాణి...పడుచు జంట చెదిరిపోదులే నారాణి ’ అంటూ పవిత్రబంధం సినిమాకు ఆరుద్ర రాశారు. మధురంగా రాసిన  ఆ యుగళ గీతాన్ని  అంతే మధురంగా  గంటసాల , సుశీల పాడారు.’’ అయితే పచ్చబొట్టుకు కూడా ఒక చరిత్ర ఉంది. అది సెప్టెంబర్‌ 16, 2015లో ఏర్పడిరది. దాని గురించి తెలుసుకుందాం. 

                    నేషనల్‌ టాటూ స్టోరీ డే (పచ్చబొట్టుచరిత్ర దినం) సెప్టెంబరు 16న ఉంది. మీ శరీరానికి సిరా వేయడానికి మిమ్మల్ని ప్రేరేపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.  పచ్చబట్లు అనేది శరీర కళ యొక్క పురాతన రూపం. ఇది మనకు ఆసక్తిని కలిగి ఉండటానికి , సాధన చేయడానికి చాలా కాలం పాటు కొనసాగింది. పచ్చబట్టు కళను జరుపుకునే జాతీయ దినోత్సవాన్ని పక్కన పెడితే, జూలై 17, జాతీయ టాటూ స్టోరీ డేని 2015 నుండి ఏటా మన పచ్చబొట్లు వెనుక ఉన్న కథలకు అంకితం చేసిన రోజుగా పాటిస్తున్నారని మీకు తెలుసా? ఇప్పుడు మీకు తెలుసా!..

జాతీయ టాటూ స్టోరీ డే చరిత్ర

          జాతీయ టాటూ స్టోరీ డేని ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 16న మన సిరాకు దారితీసిన కథనాలను గుర్తుచేసుకోవడానికి జరుపుకుంటారు. పచ్చబట్టు రైలు చాలా మంది ఇప్పటికీ ఎక్కడానికి భయపడతారు. ఆ మానసిక సంకెళ్ళ నుండి బయటపడిన కొద్దిమంది చివరకు వారి శరీరంపై కళను చెక్కడం కోసం వారి ధైర్యాన్ని జరుపుకోవడం చాలా ముఖ్యం.

             పచ్చబొట్లు కూడా సాధారణంగా ఒక వ్యక్తి కథ యొక్క వ్యక్తీకరణ. కొన్నిసార్లు వారు జీవితంలో ఎక్కడికి వెళుతున్నారో కూడా ఒక అంచనా. వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో ముఖ్యమైన భాగాన్ని అందిస్తారు. ఆధునిక వినియోగంతో అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఇతర కళారూపాల మాదిరిగా కాకుండా, వారి శాశ్వత స్వభావం మనకు ప్రియమైన , అనివార్యమైన జ్ఞాపకాలను చెక్కడానికి వాటిని పరిపూర్ణంగా చేస్తుంది!

           చారిత్రాత్మకంగా  పచ్చబొట్లు ఒక వ్యక్తి శరీరంపై ఒక వస్తువు లేదా భావోద్వేగాన్ని వర్ణించే పూర్తిగా అలంకారమైనవి. ప్రతీకాత్మకమైనవి లేదా చిత్రమైనవి. యునైటెడ్‌ స్టేట్స్‌లో టాటూ 1940లలో పేలింది.  నార్మన్‌ కీత్‌ కాలిన్స్‌, ఆకెసెయిలర్‌ జెర్రీ, ఇప్పుడు అమెరికన్‌ సాంప్రదాయ పచ్చబొట్టు అని పిలవబడే దానిని స్థాపించడంలో భారీ పాత్ర పోషించారు. హవాయి-ఆధారిత యుద్ధ అనుభవజ్ఞుడు అతను అమెరికన్‌, యూరోపియన్‌ , జపనీస్‌  పచ్చబొట్టు పద్ధతుల నుండి నేర్చుకున్న వాటిని కలిపి ఒక సరికొత్త శైలిని స్థాపించాడు. దానిని ఇప్పుడు అమెరికన్‌ సాంప్రదాయ పచ్చబట్టు అని పిలుస్తారు.

             గణాంకాల వారీగా స్టాటిస్టా నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం, 44శాతం మంది వ్యక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 140 మిలియన్ల మంది అమెరికన్లు తమ వద్ద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ టాటూలు ఉన్నారా అని అడిగినప్పుడు అవును అని సమాధానమిచ్చారు. పచ్చబట్టు! యునైటెడ్‌ స్టేట్స్‌లో చాలా మంది వ్యక్తులు పచ్చబట్లు వేసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, అదే సర్వే నివేదిక ప్రకారం.. దాదాపు మూడు నుండి 17 మిలియన్ల మంది ప్రజలు తమ ముఖం చుట్టూ కన్నీటితో పచ్చబొట్టు  వేయించుకున్నారని పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఇప్పటికీ తిరుగుబాటు చర్యగా పరిగణించబడుతుంది. - డ్రాప్‌ టాటూ అనేది ప్రజలు పొందే అత్యంత ప్రజాదరణ పొందిన టాటూలలో ఒకటి.


14, సెప్టెంబర్ 2024, శనివారం

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి వీడ్కోలు


పార్టీలకతీతంగా నివాళులర్పించిన నేతలు 
బారులు తీరిన ప్రజానీకం
ఉద్వేగ భరితంగా అంతిమయాత్ర
పలు దేశాల రాయబారులు హాజరు 
ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి భౌతిక కాయం అప్పగింత 

ప్రజాశక్తి-న్యూఢల్లీి బ్యూరో

                      అలుపెరగని పోరాట యోధుడు, మార్క్సిస్టు మేధావి 2024 సెప్టెంబర్‌ 12న గురువారం కన్నుమూసిన  సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72)కి  అశేష ప్రజానీకం 14న శనివారం  కన్నీటి వీడ్కోలు పలికింది.  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన వేలాదిమంది  సిపిఎం కార్యకర్తలు, వామపక్ష అభిమానులు, ప్రగతిశీల, లౌకిక వాదులు తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఉదయం నుండే  ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతికకాయం ఉంచిన న్యూఢల్లీి సిపిఎం కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌ వద్ద ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.  ఉదయం  పదిగంటలకు  ఏచూరి భౌతిక కాయాన్ని  ఆయన నివాసం నుండి  ఎకెజి భవన్‌కు తీసుకువచ్చారు. అప్పటికే ఆ ప్రాంతం అంతిమ నివాళులర్పించడానికి వచ్చిన వారితో  కిక్కిరిసిపోయింది.  ప్రియతమ నేతకు జోహార్లు చెబుతూ వారు చేసిన నినాదాలతో మారుమ్రోగింది.  వివిధ దేశాల రాయబారులతోపాటు,  పార్టీలు, భావజాలాలకు అతీతంగా పలువురు నేతలు, వివిధ  రంగాలకు చెందినవారు తరలివచ్చారు. నేపాల్‌ మాజీ ప్రధానమంత్రి మాధవ్‌కుమార్‌ నేపాల్‌తో పాటు,  చైనా, రష్యా, వియత్నాం, సిరియా, పాలస్తీనా, క్యూబా దేశాలకు చెందిన రాయబారులు ఏచూరి భౌతిక కాయాన్ని సందర్శించి  అంతిమ నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ పార్టీ  సీనియర్‌ నేత సోనియాగాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహాట్‌, మాణిక్‌ సర్కార్‌, అఖిలేష్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా,  సిపిఐ ఎంఎల్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య, ప్రముఖ చరిత్రకారిణీ రొమిల్లాథాపర్‌, ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా తదితరులు ఎకెజి భవన్‌ వద్ద ఏచూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు.  ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని, దేశ ప్రజలకోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ‘రెడ్‌సెల్యూట్‌ కామ్రేడ్‌, సీతారాం ఏచూరి అమర్‌రహే, లాల్‌సలామ్‌... లాల్‌సలామ్‌’ అన్న నినాదాలతో అంతిమయాత్ర ప్రారంభమైంది.  విద్యార్థులు, యువత, కళాకారులు వివిధ భాషలకు చెందిన విప్లవ గీతాలను పాడుతూ రెండు కిలోమీటర్ల మేర సాగిన అంతియమాత్రలో భాగస్వాములయ్యారు. ఏచూరి భౌతిక కాయాన్ని ఉంచిన అంబులెన్స్‌ ముందు కదలగా, దానిలోనే ఆయన కుటుంబసభ్యులు  కూడా  ఉన్నారు.   అంబులెన్స్‌ వెనుకే ముందువరసలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, ఆ తరువాత కేంద్ర కమిటీ సభ్యులు నడిచారు. ఆ తరువాత వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు అంతిమయాత్రలో భాగస్వాములయ్యారు. సాయంత్రం 4.40గంటలకు  ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి  కుటుంబ సభ్యులు,  పొలిట్‌బ్యూరో సభ్యులు  ఏచూరి భౌతిక కాయాన్ని అప్పగించారు.  అక్కడే  పది నిమిషాలపాటు చివరిసారి చూసి, కడసారి నివాళులర్పించి కన్నీళ్లతో బయటకు వచ్చేశారు. మార్క్సిస్టు యోధుని మహా ప్రస్థానం ముగిసింది.


11, సెప్టెంబర్ 2024, బుధవారం

ఆర్‌ యు ఓకే


   ఆర్‌ యు ఓకే డే (R U OK ) అనేది ఆస్ట్రేలియాలో వార్షిక పరిశీలన, ప్రతి సెప్టెంబర్‌ రెండవ గురువారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఇది సెప్టెంబర్‌ 12న వస్తుంది. ఈ రోజున, ఆస్ట్రేలియన్లు ఒకరినొకరు చూసుకుంటారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్నవారు. ఏడాది పొడవునా మనం చాలా బిజీగా ఉంటాము కాబట్టి, మనల్ని , మన చుట్టూ ఉన్నవారిని చూడడానికి, వినడానికి , అర్థం చేసుకోవడానికి ఆర్‌ యు ఓకే డే వంటి రోజులు పాటించడం చాలా బాగుంది. ఈ రోజు సామాజిక ఒంటరితనం , సమాజ ఐక్యత యొక్క సంక్షోభాన్ని కూడా పరిష్కరిస్తుంది. ఆత్మహత్యల నివారణ , కౌన్సెలింగ్‌పై దృష్టి సారించి, ఆర్‌ యు ఓకే డే జీవితాలను కాపాడుతుంది.

            చరిత్ర: 1995లో, బారీ లార్కిన్‌ ఆత్మహత్య అతని కుటుంబ సభ్యులను , స్నేహితులను తీవ్ర దుఃఖంలోకి నెట్టింది. సమాధానం లేని ప్రశ్నలతో. 2009లో, అతని కుమారుడు గావిన్‌ లార్కిన్‌ తన తండ్రి ఆత్మహత్య గురించి ఏదైనా చేయాలని ఎంచుకున్నాడు. అతను తన తండ్రిని గౌరవించడానికి , మరిన్ని ఆత్మహత్యలను నివారించడానికి ఒకే ఒక ప్రశ్నతో ముందుకు వచ్చాడు: ‘‘మీరు బాగున్నారా?’’ గావిన్‌ , అతని స్నేహితులు కొందరు దీనిని జాతీయ ప్రచారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ అవగాహన నుండి , వారి నైపుణ్యం , అభిరుచితో, ‘ఆర్‌యుఒకే’ సరేనా? పుట్టింది.

               గావిన్‌ 2011లో క్యాన్సర్‌తో మరణించాడు. అయితే ఒక సంభాషణ జీవితాన్ని మార్చగలదనే నమ్మకాన్ని నిజంగా కలిగి ఉన్నాడు. అతని వారసత్వం ఇప్పుడు జాతీయ సంభాషణ ఉద్యమం. ఆర్‌యు ఒకే సరేనా? హాని , ఆత్మహత్యల నిరోధక స్వచ్ఛంద సంస్థ, ఇది ఇతరులకు , వారి జీవితాల్లోని కష్ట సమయాలను నావిగేట్‌ చేయడానికి సహాయపడే సంభాషణలను కలిగి ఉండేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది. 2011లో, R U OK  వెనుక ఉన్న అసాధారణ కథపై ఒక డాక్యుమెంటరీ రూపొందించబడిరది.

            R U OK సరేనా? సహాయం అందించే వ్యక్తి యొక్క ప్రేరణ, విశ్వాసం , నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది, ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలను త్వరగా గుర్తించడంలో. వ్యక్తులు తమ సంబంధాలలో ఎక్కువ సమయం పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం ద్వారా ఆత్మహత్య నిరోధక ప్రయత్నాలకు సంస్థ సహకరిస్తుంది - స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు. ఇది మీకు అవసరమైనప్పుడు సహాయం కోసం అడగడం కంటే సహాయకుడిగా ఒకరి నైపుణ్యాలను అభివఅద్ధి చేయడం. ఆర్‌ యు ఓకే డే కూడా మానసిక వ్యాధుల కళంకాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది.



           సెప్టెంబర్‌ 12 జాతీయ మహిళా పోలీసు దినోత్సవం 

               జాతీయ పోలీసు మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 12న జరుపుకుంటారు. ఈ రోజు దేశవ్యాప్తంగా శాంతిభద్రతలను అమలు చేసే మహిళా పోలీసు అధికారుల సహకారాన్ని గుర్తించి జరుపుకుంటుంది. నేడు యునైటెడ్‌ స్టేట్స్‌లో దాదాపు 10శాతం పోలీసు బలగాలు మాత్రమే మహిళలతో రూపొందించబడ్డాయి. జాతీయ పోలీసు మహిళా దినోత్సవం మరింత మంది మహిళలను సేవలో చేరేలా ప్రోత్సహించడం ద్వారా దాన్ని సరిదిద్దాలని భావిస్తోంది. చట్టాన్ని అమలు చేసే పాత్రలను మరింత మంది మహిళలు చేపట్టేందుకు ప్రచారాలు , కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ అధికారులకు కఅతజ్ఞతలు తెలియజేయడంతో పాటు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు బలమైన మహిళా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండే భవిష్యత్తు కోసం కూడా ఈ రోజు ఆశిస్తోంది. మహిళా సాధికారత అనేది మహిళా విద్యకు సంబంధించినది, మహిళల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి, స్కాలరూలో యువతులు తమ కెరీర్‌ మార్గాన్ని ఎంచుకోవడంలో సహాయపడే అగ్రశ్రేణి మహిళా స్కాలర్‌షిప్‌ల జాబితా ఉంది.

                   చరిత్ర: యునైటెడ్‌ స్టేట్స్లో మొదటి పోలీసు మహిళ ఎక్కువగా మేరీ ఓవెన్స్‌. ఆమెను 1891లో చికాగో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నియమించింది. దీనికి ముందు న్యూయార్క్‌ నగరంలోని జైళ్లలో పోలీసు మాట్రన్‌లు అరుదైన దఅశ్యం కానప్పటికీ, ఓవెన్స్‌ చేసినట్లుగా అరెస్టు చేసే అధికారం వారికి లేదు. ఆలిస్‌ వెల్స్‌ను 1910లో లాస్‌ ఏంజిల్స్‌ పోలీసు విభాగం నియమించింది , యునైటెడ్‌ స్టేట్స్‌లో అమెరికాలో జన్మించిన మొదటి మహిళా పోలీసు అధికారి. వెల్స్‌ మాదిరిగా కాకుండా, ఓవెన్స్‌ కెనడాలో జన్మించాడు.

                1854లో, మహిళా ఖైదీలను శోధించడానికి , రక్షించడానికి న్యూయార్క్‌ నగరం మొదటి పోలీసు మాట్రాన్‌లను నియమించింది, అయితే వారు చట్ట అమలు అధికారం లేని పౌరులు. ఈ పాత్ర మహిళల్లో బాగా ప్రాచుర్యం పొందింది , చాలా మంది యునైటెడ్‌ స్టేట్స్‌లోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి స్థానాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించారు. 1910లో, లాస్‌ ఏంజిల్స్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆలిస్‌ వెల్స్‌ను మొదటి క్రమబద్ధంగా రేట్‌ చేయబడిన పోలీసులను నియమించింది. ఆమెకు ముందు, మాట్రాన్‌లు మగవారిగా , చాలా ప్రకాశవంతంగా కనిపించలేదు. వెల్స్‌ కళాశాల గ్రాడ్యుయేట్‌, ఒక సామాజిక కార్యకర్త , ఉద్దేశపూర్వకంగా పోలీసు అధికారి పదవిని కోరాడు. పోలీసు శాఖలు మహిళలను అధికారులుగా నియమించాలనే జాతీయ ఉద్యమంలో ఆమె త్వరలోనే మార్గదర్శకురాలైంది. అయితే, అది నిజంగా జరగలేదు , మహిళలను కోటాల ద్వారా నియమించుకున్నారు. దీనర్థం వారు క్రమం తప్పకుండా వివక్ష, నిశ్శబ్ద ధిక్కారం, కార్యాలయంలో సెక్సిజం , ఇతర ద్వంద్వ ప్రమాణాలను ఎదుర్కొంటారు. పోలీసు ఏజన్సీలలో ఉద్యోగ సమానత్వం కోసం అనేక కోర్టు కేసులు పోరాడారు. ష్ప్రిట్జర్‌ వర్సెస్‌ లాంగ్‌, వెల్స్‌ వర్సెస్‌ సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ , పెన్సిల్వేనియాలోని జోవాన్‌ రోస్సీ కేసు వంటి కేసులు మైలురాయిగా నిలిచాయి. ఓక్లాండ్‌ సివిల్‌ సర్వీస్‌ బోర్డ్‌ సిటీకి వ్యతిరేకంగా ఆగస్ట్‌ 1971 క్లాస్‌-యాక్షన్‌ దావాను వెరాగెన్‌ హార్డీ తీసుకువచ్చారు, ఇది ఓక్లాండ్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో ఉన్న పోలీసు అధికారులకు పౌర సేవా వర్గీకరణను కోరింది, ఇది పురుషులు , మహిళలు అనుమతించబడుతుంది. సమాన ప్రాతిపదిక. ఈరోజు పోలీసులు అన్ని అంశాల్లో పోలీసు విధుల్లో పాల్గంటున్నారు.