నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రంపంచీకరణ , సరళీకరణ, ప్రయివేటీకరణ వల్ల జరిగిన దుష్పరిణామాలపై అన్నా హజారే ఎందుకు స్పందించలేదు? ఆయనకు అవి అర్థం కాలేదా? అర్థం అయినా ఎందుకులే అనుకున్నారా?. విద్యా, వైద్యం, ఉపాధి సామాన్యులకు అందనంత దూరం అవుతున్నాయి. ఆయనొక సామాజిక కార్యకర్త సమాజంలోని సామాజిక అసమానతలు కనబడలేదా? ప్రయివేటీకరణ పుణ్యమాని ఎస్సీఎస్టీబీసీల కోసం రాజ్యాంగంలోని నిర్థేశించుకున్నవి అమలు ఎందుకు కావడంలేదో తెలియదా? సరళీ కరణతో పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తూ సహజసిద్దమైన వనరులన్నీ నాశనమై గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటోంది. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంకా దెబ్బతింటూనే ఉన్నాయి. వాటిపై అన్నా హజారే ఎందుకు స్పందించ లేదు. అన్నా హజారే భారత సైన్యంలో పని చేశారు. దేశరక్షణ గురించి బాగా తెలుసు దేశ రక్షణకు భంగం వాటిల్లే ఒప్పందాలను అమెరికాతో చేసుకుంటుంటే ఎందుకు స్పందించలేదు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాలేగావ్‌సిద్ధి గ్రామ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన సౌరశక్తి, జీవ ఇంధనం, పవన విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నడుంబిగించారు. అంటే ప్రకృతిని కాపాడాలనే ఆలోచన ఆయనకుందనే కదా? మరి ప్రమాదకరమైన అణుఒప్పందం భారత ప్రభుత్వం చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదు. ఆయన చేసిన పనిమీదే ఆయనకు నమ్మకం లేదా? దేశంలో స్వయం ప్రతిపత్తి గల రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని మొదటిస్థానంలో నిలిపినందుకు ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నత పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇదంతా చేయగలిగిన ఆయన ప్రమాదకరధోరణుల సమయంలో ఎందుకు నోరు మెదపలేదు.
అన్నా హజారే ఒక్క అవినీతిమీదే ఎందుకు దీక్ష చేశారు. అన్నింటికీ మూలం అవినీతే అనుకుంటున్నారా? ఏటేటా పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు, ఉత్తర్వుల వల్ల జరుతున్న పరిణామాలపై స్పందించాల్సిన అవసరం లేదా?. మాజీ ఐపీఎస్ కిరణ్‌బేడీ, సామాజిక వేత్త అగ్నివేష్, ఆర్‌టిఐ విప్లవవేత్త అరవింద్ కెజ్రావాల్ హజారేకు తోడుగా నిలిచారు. వీరికయినా ఎందుకు ఈ పరిస్థితులన్నీ అర్థం కాలేదు. రాజకీయాలకు అతీతులనీ, స్వచ్చందంగా ముందుకొచ్చి జనలోక్‌పాల్ బిల్లుకోసమని పోరాడారని ఎక్కువమంది నమ్ముతున్నారు. అందులోని తోతుపాతులను అధ్యయనం చేసేంత తీరిక లేదేమో అనిపించింది. సరే ముందుముందు అన్నీ బయటపడుతాయిగా అప్పటికైనా ఎవరి పోరాటం వెనుక ఏముందో అర్థమవుతుంది. ఒకప్పుడు నూతన ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన వారిని వితండవాదులు అన్నారు. కొన్నాళ్ల తరువాత అందరూ వ్యతిరేకించక పోయినా ఒక్కో సందర్భంలో గొంతుకలిపారు.
సరే అదంతా అటుంచితే జనలోక్‌పాల్ బిల్లు అంటే ఏమిటీ? : ఈ బిల్లును 1972లో అప్పటి న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ పార్లమెంటులో ప్రతిపాదించారు. మారుతున్న పాలకులు దీనిని పక్కన పెడుతూ వచ్చారు. కొందరు అవినీతి పరులు ఆబిల్లును మార్చాలని కూడా ప్రయత్నించారు. ఈబిల్లు అమలయితే కేంద్రం ఒక లోక్‌పాల్‌ను ఎన్నుకోవాలి. లోక్‌పాల్ బిల్లును డ్రాప్టు చేయడానికి 50 శాతం ప్రభుత్వం నుంచి , 50 శాతం ప్రజల తరుపున కూడిన సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలి. అవినీతిని అంతమొందించడంలో ప్రభుత్వాన్ని ఊర్తిగా నమ్మడం సాధ్యం కాదని ఈ విధంగా కమిటీని వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో ఉండే కొందరు అవినీతి పరులు చట్టం కళ్లుగప్పి తప్పించుకునే ప్రమాదం ఉంది. భారత ఎన్నికల కమిషన్‌కు ఉన్నంత స్వయంప్రతిపత్తి లోక్‌పాల్‌బిల్లుకు కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఏడాదిలోపు అందరి అవినీతి పరులను గుర్తించే అవకాశం ఉంది. రెండేళ్లలో అందరికీ శిక్షపడేలా చేయడం సాధ్యమవుతుంది. బిల్లుపాస్‌అయితేనే అవినీతిని అంతమొందించే అవకాశం ఉంది. ఇదంతా పార్లమెంటు మీద ఆధారపడి ఉంది. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని అంతమొందించడానికి సాధ్యమవుతుంది. సరే ఏంచేస్తారో వేచి చూద్దాం. అన్నా హజారే ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. పోరాటం ఏదయినా మద్దతు ఇవ్వాల్సిందే. ప్రమాదకరమైన అన్నింటిమీద ఆయనెందుకు స్పందించలేదనేదే నాప్రశ్న.