12, జులై 2017, బుధవారం


  ధీరత్వానికి ప్రతీక.. అందానికి ప్రతిబింబం


ప్రతి దేశాధినేత విధులు నిర్వర్తించడానికి ప్రత్యేక భవనాలుంటాయి. మన ప్రథమపౌరుడు, దేశాధిపతి అయిన రాష్ట్రపతి మన రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నివసిస్తూ అక్కడి నుంచే అధికారిక విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదొక్కటే కాదు, రాష్ట్రపతి కోసం హైదరాబాద్, సిమ్లాలో పెద్ద పెద్ద నివాసాలే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పర్యాటనకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొఘల్ ఉద్యానవనం అందాలు, భవనంలోని శిల్పకళా చాతుర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఆ విశేషాలు మీ కోసం...



వైస్రాయ్ హౌస్:
రాష్ట్రపతి భవన్‌ని స్వాతంత్ర్యానికి ముందు వైస్రాయ్ హౌస్ అని పిలిచేవారు. ఢిల్లీలోని రాజ్ పథ్‌లో ఉందీ ప్యాలెస్. ప్రపంచంలోని అత్యద్భుత కట్టడాల్లో ఇదొకటి. మొత్తం 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి మొఘల్ గార్డెన్ అదనపు అలంకారం. విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యక్ష నివాసం ఇదే. ప్రధాన భవనమే ఐదెకరాల్లో విస్తరించి
ఉంది మరి. మొత్తం భవనం విస్తీర్ణం 15 ఎకరాలు.
1911లో దేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మారినప్పుడు. అప్పటి వైస్రాయ్ కోసం ఈ భవనాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 4 వేల ఎకరాలను సేకరించారు. అక్కడ ఉండే రైజినా, మాల్చా అనే గ్రామాలను ఖాళీ చేయించారు. బ్రిటిష్ శిల్పి ఎడ్విన్ లచన్స్ రాష్ట్రపతి భవన్‌కు ఆకృతినిచ్చారు. ఆయనకు బేకర్ అనే మరో శిల్పి సాయం అందించారు. 1912లో నిర్మాణం ప్రారంభించగా 1929 నాటికి పూర్తయ్యింది. మొత్తం 29 వేల మంది 17 ఏళ్లపాటు పనిచేశారు. మొఘలాయిల అట్టహాసం. యూరప్ శిల్ప శైలి రాష్ట్రపతి భవన్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
పేరు మార్పు:
1950 జనవరి 26న బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి అయ్యాక వైస్రాయ్ హౌస్ పేరు మార్చి రాష్ట్రపతి భవన్‌గా నామకరణం చేశారు. అంతకుముందు ఈ భవంతిని ప్రెసిడెంట్స్ హౌస్ అని కూడా పిలిచేవారు. రాష్ట్రపతి భవన్ నాలుగు అంతస్తులుంటుంది. మొత్తం 340 గదులున్నాయి. ఇవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ ఇంటికి బ్రిటన్ నుంచి అతిథులు పెద్ద సంఖ్యలో వస్తుండేవారు. వారి నివాసానికి అనుకూలంగా వీటిని తీర్చిదిద్దారు. విస్తీర్ణం రెండులక్షల చదరపు అడుగులు. దీని నిర్మాణానికి స్టీల్ ఉపయోగించలేదు.
దర్బార్ హాల్ - అశోకా హాల్:
రాష్ట్రపతి భవన్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. దర్బార్ హాల్, అశోకా హాల్. దర్బార్ హాల్‌ను రంగు రంగుల పాలరాతితో ఎంతో విలాసవంతంగా నిర్మించారు. అశోక హాల్ పర్షియా శైలిలో రంగురంగుల పైకప్పు, చెక్క ఫ్లోరింగ్‌తో నిర్మించారు. ఈ రెండు హాల్స్‌ను పార్టీలు, ఫంక్షన్లకు ఉపయోగిస్తుంటారు. దర్బార్ హాల్ ఫ్లోరింగ్ కోసం చాక్లెట్ కలర్‌లో ఉండే ఇటాలియన్ పాలరాయిని ఉపయోగించారు. కాలమ్స్ నిర్మాణానికి జైసల్మేర్ పాలరాతిని ఉపయోగించారు. దర్బార్ హాలులో ఐదు వందల మంది కూర్చునే వీలుంది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దర్బార్ హాలులోనే ప్రమాణస్వీకారం చేశారు.
ఇక్కడే రాష్ట్రపతి కోసం ప్రత్యేక గ్రంథాలయం ఉంది. ఇందులో రెండువేలకుపైగా అరుదైన పుస్తకాలున్నాయి. వీటన్నింటినీ డిజిటలైజ్ చేశారు. ఇందులో 31 లక్షలకుపైగా ఫొటోలున్నాయి. 
రాష్ట్రపతి భవన్‌లో అత్యంత అందమైనది అశోకా హాలు. హాలుమొత్తం బంగారం పూత పూసినట్లుంటుంది. అణువణువునా రాజసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అశోకాహాల్‌లోనే రాష్ట్రపతికి చెందిన ఫంక్షన్లు జరుగుతుంటాయి. ప్రమాణస్వీకారాలు, పద్మ అవార్డుల ప్రదానం, సాహస బాలలకు సత్కారం ఇలాంటి ఎన్నో విశిష్ట కార్యక్రమాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన వేదికగా అశోకా హాల్ అలరారుతోంది.
రాష్ట్రపతి డైనింగ్ హాలులో ఒకేసారి 104 మంది కూర్చొని భోజనం చేసేందుకు వీలుగా పొడవైన టేబుల్ ఉంది. బ్రిటిష్ రాజరికానికి ఇదో ప్రతీక. 
రాష్ట్రపతి భవన్ డోమ్... అంటే గోపురం కరెక్టుగా మధ్యలో ఉంది. భారతీయ, బ్రిటిష్ శైలులలో నిర్మించారు. భవనానికి దాదాపు రెట్టింపు ఎత్తులో ఉంటుందీ డోమ్. 1929లో డోమ్ నిర్మాణం పూర్తయ్యింది. ఐదు కిలోమీటర్ల దూరం నుంచి చూసినా ఈ డోమ్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఫౌంటైన్లు - మ్యూజియం:
రాష్ట్రపతి భవన్‌లో వాటర్ ఫౌంటైన్లు ప్రత్యేక ఆకర్షణ. మెట్ల దగ్గర ఉండే ఎనిమిది పాలరాతి సింహపు విగ్రహాల నోటి నుంచి నీరు వస్తుంటుంది. బ్రిటిష్ రాజదర్పానికిది నిదర్శనం.
2014లో రాష్ట్రపతి భవన్‌లో మ్యూజియాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్, మాజీ రాష్ట్రపతులకు సంబంధించిన అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. రాష్ట్రపతి భవనంలోని స్తంభాలకు అచ్చం దేవాలయాల్లో ఉన్నట్లే గంటలు పెట్టారు. ఇవి హిందూ, బౌద్ధ, జైన సంస్కృతులకు ప్రతీకగా నిలుస్తాయి. రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతిలోకి ప్రవేశించే ముందు ప్రతి ద్వారం దగ్గరా ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది.
పచ్చదనం- మొఘల్ ఉద్యానవనం:
రాష్ట్రపతికి అందుబాటులో టెన్నిస్, పోలో, క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ కార్డిడార్ల పొడవే రెండున్నర కిలోమీటర్లు. 190 ఎకరాల్లో ఉద్యానవనాలున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. రాష్ట్రపతి భవన్ వెనుకాలుండే ఉద్యానవనాన్ని మొఘల్, బ్రిటిష్ శైలిలో నిర్మించారు. దీన్ని మొఘల్ గార్డెన్ అని పిలుస్తున్నారు. ఇందులోని 13 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో రకాల ఆకర్షణీయమైన పుష్పాలున్నాయి. 160 రకాల గులాబీలు ఇక్కడ పూస్తున్నాయి. ప్రతి ఏటా ఫిబ్రవరిలో మొఘల్ గార్డెన్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. పష్పాలే కాదు, మొఘల్ గార్డెన్‌లోని ఫౌంటైన్లు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మొత్తం ఆరు ఫౌంటైన్లు తామరపూల ఆకారంలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటి మొఘల్ గార్డెన్స్. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. ఇక్కడే మన రాష్ట్రపతి రోజూ వాకింగ్ చేస్తుంటారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఐదువేల చెట్లున్నాయి. 160 రకాల పూలమొక్కలు కనువిందు చేస్తాయి.
రాష్ట్రపతి భవన్ పాతదైపోవడంతో దీనికి 1985-89 మధ్యకాలంలో కొన్ని అదనపు హంగులు అద్దారు. 2010లో డిజైనర్లు చార్లెస్ కొరియా, సునీతా కోహ్లీ మరిన్ని హంగులు చేర్చారు. అయినా అసలు అందాలకు మాత్రం ఎక్కడా ముప్పు రానివ్వలేదు. రాష్ట్రపతి భవన్‌ను 2001లో గ్రేడ్ వన్ హెరిటేజ్ స్టక్చర్‌గా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యద్భుత ఐకానిక్ లివింగ్ హెరిటేజ్ సైట్ మన రాష్ట్రపతి భవన్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పరిరక్షకునిలాంటి రాష్ట్రపతి ఇందులో నివసిస్తారు. భారత ప్రజాస్వామ్యానికే ఇదో సౌధం లాంటిది.
హైదరాబాద్ - సిమ్లా నివాసాలు:
విశ్రాంతి తీసుకునేందుకు రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని బొల్లారం, సిమ్లాలో నివాసాలున్నాయి. చలికాలం హైదరాబాద్‌లో వేసవికాలం సిమ్లాలో రాష్ట్రపతి విశ్రాంతి తీసుకుంటుంటారు. బ్రిటిష్ వారి కాలంలోనే బొల్లారంలో వైస్రాయ్ నివాసాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటీషు వారి త‌ర్వాత నిజాం రాజులు స్వాధీన ప‌ర్చుకున్నారు. అయితే స్వాతంత్ర్యానంత‌రం 1950లో కేంద్ర ప్రభుత్వం 60 లక్షలకు కొనుగోలు చేసి రాష్ట్రపతికి దక్షిణాది విడిదిగా దీనిని తీర్చిదిద్దింది. తర్వాత పురాతన, వారసత్వ కట్టడంగా ప్రకటించింది. 70 ఎకరాల విస్తీర్ణంలో దట్టమైన చెట్ల నీడలో రాష్ట్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, డాక్టర్ నీలం సంజీవరెడ్డి, ప్రణబ్ క్రమం తప్పకుండా ఏడాదికి 15 రోజులు హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఇందులో 20 గదులున్నాయి. వీటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వాహణ, సమావేశాల ఏర్పాటుకు కేటాయించారు. ప్రకృతి ప్రేమికులను బొల్లారం భవనం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఔషధ మొక్కలను సైతం పెంచుతున్నారు.
ఇక సిమ్లాలోని రాష్ట్రపతి నివాస్‌లో బ్రిటిష్ కాలంనాటి అరుదైన ఫొటోలున్నాయి. లార్డ్ డఫ్రిన్ కాలంలో 1888లోనే సిమ్లాలోని రాష్ట్రపతి నివాస్‌ను నిర్మించారు. హెన్రీ ఇర్విన్ అనే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ దీనికి ఆకృతినిచ్చారు. పచ్చదనంతో అలలారే ఇక్కడి తోటలు రాష్ట్రపతి నివాస్‌కు ప్రత్యేక అందాన్నిచ్చాయి. అబ్జర్వేటరీ హిల్స్ పైన నిర్మించిన ఈ భవంతిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా సేవలకోసం ఉపయోగించాలని నిర్ణయించి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు దీనిని బదలాయించారు. తర్వాత ఇందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌ను నెలకొల్పారు. ఈ భవనం కొద్దిరోజులు మాత్రమే రాష్ట్రపతికి వేసవి విడదిగా ఉంది. తర్వాత సిమ్లాలోనే ఉన్న మషోబ్రా వద్ద రాష్ట్రపతి కోసం మరో విడిదిని కేటాయించారు. దానినే రిట్రీట్ బిల్డింగ్ అని పిలుస్తారు.

5, మార్చి 2017, ఆదివారం

అవధాన పితామహ సివి సుబ్బన్న అస్తమయం

                                                    

                 2017 మార్చి 6న  అంత్యక్రియలు

              అవధాన సౌర్వభౌముడిగా, అవధాన పితామహుడుగా పేరుగాంచిన డాక్టర్‌ కడప వెంకటసుబ్బన్న (88) 2017 మార్చి 5న (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటకు తుదిశ్వాస విడిచారు.  కొంతకా లంగా అనారోగ్యంగా ఉండడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు  కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. 1929 నవంబర్‌ 12న ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరంలో జన్మించిన సివి సుబ్బన్న ప్రాథమిక విద్య ప్రొద్దుటూరులో పూర్తి చేశారు. ఇంటర్‌ మీడియట్‌ విద్యను మదనపల్లెలో అనంతరం ఎంఎ డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాయంలో పూర్తి చేశారు. డాక్టర్‌ సుబ్బరామప్ప పర్యవేక్షణలో ‘అవధాన విద్య’ అనే అంశంపై పరిశోధన చేసి మైసూర్‌ విశ్వవిద్యాయం నుండి పిహెచ్‌డి పట్టాను తన 52వ ఏట 1981లో పొందారు. ఇంటర్‌ మీడియట్‌ చదువుతున్న సమయంలోనే 1950లో శివరాత్రి పర్వదినాన తొలి సారి అవధాన ప్రక్రియలో పాల్గొన్నారు. అవధాన ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముగ్గురు పేరుపొందిన కవులు ఉన్నారు. వారిలో ఇద్దరు తిరుపతి వెంకటకవులైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి , దివాకర్ల తిరుపతి శాస్త్రి కాగా మూడవ వ్యక్తి సివి సుబ్బన్న. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మృతిచెందిన నాటినుంచి సుబ్బన్న అవధానం ప్రారంభించారు.  తెలుగు ముంగిళ్ళల్లో అవధానం కనుమరుగు అవుతున్న సమయంలో జనం మధ్యకు అవధానాన్ని తీసుకెళ్ళి ఆ కళను సుసంపన్నం చేసిన ఘనుడు సివి సుబ్బన్న. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శివైక్యం పొందిన 1950 సంవత్సరం  మహాశివరాత్రి నాడు  సుబ్బన్న అవధానం ప్రారంభించడం  యాదృచ్చికం. సుబ్బన్న ఐదువందలకు పైగా అవధానాలు చేశారు. సుబ్బన్నకు 1964లో గుంటూరు జిల్లా భట్టిప్రోలులో కనకాభిషేకం చేసి గజారోహణ మహోత్సవం నిర్వహించారు. 1965లో ఇదే జిల్లా తెనాలిలో అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి సుబ్బన్న వామపదానికి గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు. పది పర్యాయాలు కనకాభిషేకం పొందడం విశేషం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, పీఠాధిపతుల ద్వారా  సత్కారాు, సన్మానాలు అనేకం. కృష్ణదేవరాయ విశ్వవిద్యాయం గౌరవ డి.లిట్‌ పట్టా ఇచ్చి సుబ్బన్నను గౌరవించింది. శతవధాన సభలో ఉద్దండుడైన కవులను, పండితులను తన కవితా వాక్ఫటిమతో ఎదుర్కొన్న శతావధాని సివి సుబ్బన్న. ఆయన 15 కావ్యాులు, నాలుగు శతకములు, రెండవ వచనముతో పాటు 1955లో చెంచుక్ష్మి నాటకాన్ని రచించారు. ఐదు ప్రబంధాలు రాశారు. వ్యాసవిలాస ప్రబంధం, కబీర్‌దాస్‌ ప్రబంధం, బీబీ నాంచారి ప్రబంధం, భద్రాచలరామదాసు ప్రబంధం రాశారు. నాలుగు లఘు కావ్యాు లు రచించారు. సివి సుబ్బన్నపై అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు, లక్ష్మణ కుమారశస్టి, బి.సూరి, చెన్నారెడ్డి లఘు గ్రంధాలు రాశారు. ఆయన అవధాన సంపుటాలు 3 అచ్చయ్యాయి.
        రెండు  తెలు గు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో శిష్య బృందం ఉంది. ప్రముఖ అవధాన శిశ్యులలో అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు ఒకరు. కవులు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి, నండూరి కృష్ణమాచార్యు, గడియారం వెంకటశాస్త్రి, పుట్టపర్తి నారాయణచార్యులు, కరుణశ్రీ జంద్యాల పాపయ్య శాస్త్రి మొదలగు వారిచే ప్రశంసలు పొందారు. స్వయంకృషితో సాహితీదిగ్గజంగా ఎదిగిన సివి సుబ్బన్న పేరుతో విశ్వవిద్యాయాలు ‘ సివిసుబ్బన్న అవధాన సాహితీపీఠం’ ఏర్పాటు చేయాలని ఆయన రచనలపై పరిశోధనలు చేయించాలని ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించాలని రచయితల జిల్లా సంఘం అధ్యక్షుడు జింకా సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. సుబ్బన్న అంత్యక్రియలు సోమవారం పద్మశాలీయ స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
                                                        డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సంతాపం
             అవధాన శిశ్యులలో ప్రముఖులు అష్టావధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు సివి సుబ్బన్న అస్తమయం పట్ల ప్రఘాడ సంతాపాన్ని ప్రకటించారు. తిరుపతి వేంకట కవుల తరువాత అంతటి పేరుగాంచిన సివి సుబ్బన్న లేని లోటు సాహితీ లోకానికి తీర్చలేనిదని పేర్కొన్నారు. ఆయన స్వయం సాధనతో అవధాన విద్యలో అత్యున్నతస్థాయికి ఎదిగారని తెలిపారు.

2, ఫిబ్రవరి 2017, గురువారం

తెలుగు భాష, లిపి చరిత్ర

సంస్కృతంబులోని చక్కెర పాకంబు,
అరవ భాషలోని అమృతరాశి,
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు!!

-- మిరియాల రామకృష్ణ 


    సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగు. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడం భాషలకు 2008లో “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించింది.
    ఆంధ్రప్రదేశ్ తరవాత తెలుగువాళ్లు ఎక్కువగా యానాం (పుదుచ్చేరి), తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. తెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎనిమిదన్నర కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీ, బెంగాలీల తరవాత) మూడో స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచింది.
తెలుగు భాష చరిత్ర
                తెలుగు ద్రావిడ భాష. ద్రావిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, గోండీ మొదలైన 85 భాషలుండగా, అత్యధికంగా మాట్లాడుతున్న ద్రావిడభాష తెలుగే. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీ, తెలుగుకు మాతృక సంస్కృతమేననీ జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నది. కానీ సంస్కృతం, హిందీ, బెంగాలీ మొదలైన ఉత్తర భారతదేశ భాషలు “ఇండో-ఆర్యన్” భాషావర్గానికి చెందినవి కాగా, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలనీ భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగుతో పాటు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ద్రావిడభాషలన్నీ ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడి, వేరువేరుగా స్థిరపడ్డాయని పరిశోధకుల అంచనా.
                తెలుగు అనే పదం ఎలా ఏర్పడిందనే విషయంపై మనకు విభిన్న వాదనలు వినిపిస్తాయి. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారనీ, త్రిలింగ పదం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది. కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు. 
   తమిళం, గోండీ భాషల్లో తెలు, తెలి అంటే తెలుపు లేదా చక్కదనం, “0గ” అనేది బహువచన సూచకం. ఆవిధంగా చక్కనివారు, తెల్లనివారు అనే అర్ధంలో తెలింగ, తెలుంగ అనే పదాలు ఉద్భవించాయని మరో వాదన. తమిళనాడులోనూ, కేరళంలోనూ ఇప్పటికీ తెలుగును “తెలుంగు” అనే పిలవడం మనం గమనించవచ్చు.
    భాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన “గాధాసప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినది. తెలుగు భాష చరిత్ర క్రీ.శ. పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది.
తెలుగు లిపి
    తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించింది. అశోకుని మౌర్య సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు. దక్షిణ భారత భాషలన్నీ మూలద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచే పుట్టాయి. మౌర్యుల బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్తూపంలోని శాసనాల్లో లభించాయి. ఈ భట్టిప్రోలు లిపి నుంచే దక్షిణ భారతదేశ లిపులన్నీ పరిణామం చెందాయి. చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు తెలుగు, కన్నడ దేశాలను కలిపి పాలించడం వల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామం చెందింది. క్రీ.శ. ఐదో శతాబ్దం నాటికి ఈ భట్టిప్రోలు లిపి నుంచి పాత తెలుగు లిపి ఆవిర్భవించిందని పరిశోధకుల అంచనా.
               ప్రాచీన తెలుగు లిపిలో ఖ, ఘ, ఛ, ఝ, థ, ఠ మొదలైన మహాప్రాణ అక్షరాలు లేవనీ, ఈ శబ్దాలు ఇండో-ఆర్యన్ భాషల ప్రజలు మాత్రం విరివిగా వాడేవారనీ, ద్రావిడ భాషల ప్రజలు ఈ శబ్దాలను సాధారణ వ్యవహారిక భాషలో అసలు వాడేవారు కాదనీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇప్పటికీ మన పల్లెల్లో ఈ మహాప్రాణ అక్షరాలను చాలామంది రోజువారీ పలుకుబడి భాషలో వాడకపోవడం మనం గమనించవచ్చు. నన్నయ కాలంలో సంస్కృత సాహిత్యం విరివిగా తెలుగులోకి అనువాదం అయినప్పుడు, ఈ సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో రాయడం కోసం ప్రత్యేకంగా తెలుగు లిపిలో అక్షరాలను రూపొందించారు.
తెలుగు అక్షరాలు (37)
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ, సున్నా
క గ చ జ ట డ ణ త ద న ప ఫ బ మ య ర ల వ శ ష స హ ళ ఱ
సంస్కృత శబ్దాలను తెలుగులో రాయడం కోసం రూపొందించిన అక్షరాలు (19)
ఌ ఌ ఋ ౠ అః (విసర్గ)
ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ థ ధ భ క్ష రుత్వం, రుత్వం దీర్ఘం  

 తెలుగులోని మాండలికాలు
    మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువమంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. మాండలిక భాషలన్నీ ప్రధానభాషలోని వివిధ వ్యవహారికాలు మాత్రమే, అన్ని మాండలికాలూ కలిపితేనే ప్రధాన భాష అవుతుంది. ప్రతి భాషకీ మాండలిక భేదాలున్నట్టుగానే, తెలుగుకీ ఉన్నాయి.
    భౌగోళిక పరిస్థితులను బట్టీ, పాలకుల భాషను బట్టీ, కులమతాలను బట్టీ, వృత్తిని బట్టీ మాండలికాలు ఏర్పడతాయి. ఉదాహరణకి తెలంగాణ తెలుగుపై మొదట తమిళ, కన్నడ భాషల ప్రభావమూ, ఆ తరవాత ఉర్దూ ప్రభావమూ పడటం వల్ల ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళిక, చారిత్రక కారణాల రీత్యా రాయలసీమ తెలుగుపై తమిళ, కన్నడ భాషల ప్రభావం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అదో భిన్నమైన ప్రత్యేకతను సంతరించుకున్నది. కోస్తాంధ్ర తెలుగుపై సంస్కృతం, ఇంగ్లీషు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అదో ప్రత్యేకతను సంతరించుకున్నది.
  జిల్లాలను బట్టి కూడా వేరువేరు మాండలికాలు ఉన్నప్పటికీ తెలుగులో ప్రధానమైన మాండలిక భాషలు నాలుగున్నాయి.
1) రాయలసీమ భాష: చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల భాష
2) తెలంగాణ భాష: తెలంగాణ పది జిల్లాల ప్రాంతపు భాష
3) తీరాంధ్ర/కోస్తాంధ్ర భాష: కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల భాష
4) కళింగాంధ్ర/ఉత్తరాంధ్ర భాష: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాష
తెలుగు సాహిత్యం
               నన్నయ పదకొండో శతాబ్దంలో రచించిన మహాభారతం తెలుగులో ఆదికావ్యమనీ, నన్నయ ఆదికవి అనీ చెప్పబడుతున్నది. అంతకు ముందు సాహిత్యం అసలే లేకుండా, ఉన్నట్టుండి ఇంత అద్భుతమైన, పరిపక్వమైన కావ్యం రచించడం అసాధ్యం కాబట్టి, నన్నయకు ముందే మరింత తెలుగు సాహిత్యం ఉండవచ్చని సాహిత్యకారుల అభిప్రాయం.
    పదహారో శతాబ్దంలో విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో తెలుగు వైభవంగా వెలిగింది. ఎంతో సాహిత్యం సంస్కృతం నుంచి తెలుగు, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యింది. ఈకాలంలో వివిధ సాహితీప్రక్రియల్లో వెల్లువలా సృష్టించబడ్డ ఎంతో సాహిత్యం సాహిత్యాభిమానుల, విద్యావంతుల అభిమానాన్ని చూరగొనగలిగినప్పటికీ, సంస్కృతభాష ప్రభావం కారణంగా చాలామటుకు గ్రాంథిక భాషలో ఉండడం వల్ల ప్రజాబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారం పొందలేకపోయాయి. పల్లె ప్రజలకు, నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థం అయ్యే విధంగా వాడుకభాషలో సరళమైన రీతిలో వెలువడ్డ వేమన పద్యాలు, బ్రహ్మంగారి సాహిత్యమూ, అన్నమయ్య, కంచెర్ల గోపన్న రాసిన కీర్తనలు ఇప్పటికీ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయి.
    ఆధునిక యుగంలో గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేత గిడుగు రామ్మూర్తి, శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, నండూరి రామ్మోహనరావు ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.

-- వెల్లంపల్లి అవినాష


1, ఫిబ్రవరి 2017, బుధవారం

భూగర్భంలో లగ్జరీ హౌస్‌

              


‘ఆదిత్య 369’ సినిమాలో హీరోయిన్‌.. కమెడియన్‌తో సహా హీరో బాలకృష్ణ టైం మిషన్‌ ఎక్కి గతంలోకి ప్రయాణించి ఆ తర్వాత భవిష్యత్‌లో కాలంలోకి వెళ్తాడు. ఆ కాలంలో మూడో ప్రపంచయుద్ధం జరిగి అణుశక్తి ప్రభావంతో భూమిపై మనుషులు జీవించే వీలులేకుండా పోతుంది. దీంతో ప్రజలు భూగర్భంలో నగరాలు నిర్మించుకొని జీవిస్తుంటారు. ఆ సన్నివేశాలు గుర్తున్నాయా? ఆ సంగతి ఇప్పుడెందుకు అంటారా? అచ్చం అలానే మూడు దశాబ్ధాల క్రితమే ఓ పెద్ద మనిషి యుద్ధం కారణంగా భూమిపై జీవించే వీలు ఉండదనుకొని ఇలాగే భూగర్భంలో ఓ ఇంటిని నిర్మించాడు.             1970లో అమెరికాలో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. దీంతో అణుబాంబు ప్రయోగాలు జరిగి భూమి సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాన్ని చూసుకోవాలని.. సరిపడ ఆహార పదార్థాలను దాచుకోవాలని సూచించింది. దీంతో గిరార్డ్‌ బ్రౌన్‌ హెండర్సన్‌ అనే వ్యాపారవేత్త భయపడిపోయాడు. ఎక్కడ అణుబాంబులు పేలి తాను బతికే వీలులేకుండా పోతుందేమోనని .భయపడ్డాడు. వెంటనే తన ఇంట్లోనే భూమికి 26 అడుగుల లోతులో లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడు. 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్‌ రూమ్స్‌.. ఒక కిచెన్‌.. బాత్రూమ్స్‌.. స్విమ్మింగ్‌పూల్‌.. గార్డెన్‌.. లాన్‌ వాటర్‌ ఫాల్‌.. గోల్ఫ్‌ కోర్స్‌ ఇలా సర్వ సదుపాయాలతో అద్భుతంగా కట్టించాడు. అంతేకాదు.. కొన్ని ఏళ్లు జీవించడానికి సరిపడ సరుకులు సమకూర్చాడు. రాత్రి పగలు తేడా తెలిసేలా సమయాన్ని బట్టి వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా లైట్లను ఏర్పాటు చేశారు.
                   అయితే కోల్డ్‌వార్‌ అలాంటి భయంకర ప్రమాదాలు జగరకుండా ముగిసినా హెండర్సన్‌ మాత్రం ఆ భూగర్భ నివాసంలోనే జీవించాడు. 1983లో అతను మరిణించిన తర్వాత దాన్ని ఆయన బంధువులు స్వాధీనం చేసుకున్నారు. 2014లో ‘సోసైటీ ఫర్‌ ర ప్రిసర్వేషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ ఎక్సిటిక్ట్‌ స్పీసెస్‌’ అనే సంస్థ కొనుగోలు చేసింది.

11, జనవరి 2017, బుధవారం

విద్యతోపాటు విలువలు పెంచుకోవాలి

                                                  జిల్లాపరిషత్‌ సిఇఒ క్ష్మీనారాయణ
           సమాజంలో విద్యకు ఉన్న విలువ దేనికీ లేదని, అందరూ కనీస విలువలు పెంచుకోవాలని తెంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ సిఇఒ వి.లక్ష్మీనారాయణ అన్నారు. 2017 జనవరి 10న గోపాల్‌పేట మండల బుద్దారం గ్రామానికి చెందిన  పలుస శేఖర్‌ గౌడ్‌ ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో డాక్టరేట్‌ పట్టా పొందిన సందర్భంగా ఆయనకు విశ్వవాణి యువజన సంఘం , బుద్దారం ఆత్మీయ మిత్ర బృందం  ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన  ఈకార్యక్రమానికి వి.లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు గ్రామాల్లో పాఠశాలు ఉండేవి కావని అన్నారు. చదువుకోవాలనుకునే వారు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాలు ఉడటం వల్ల సామాన్యునికి విద్య అందుబాటులోకి వచ్చిందని అన్నారు. బుద్దారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్న శేఖర్‌ గౌడ్‌ ఆంగ్లంలో పిహెచ్‌ డి  చేసి డాక్టరేట్‌ పట్టా తీసుకోవడం అభినందించ దగిన విషయమని అన్నారు. ఆయన్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉ న్నత చదువులకు వెళ్లాలని సూచించారు. 
                                                  బుద్దారం పాఠశాలకు రూ.5 లక్షలు
          బుద్దారం నుంచి ఈ సందర్భంగా  వినతులు అందాయని కాని పాఠశాలకు నా పరిధిలోని  సహాయం చేయానకున్నానని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల అదనపు భవనా నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సిఇఒ క్ష్మినారాయణ ప్రకటించారు. త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పూర్తి చేసుకున్న వారికి వెంటనే నిధులు వచ్చేలా చూస్తామని చెప్పారు. భవిష్యత్తులో నిర్మించుకోబోయే వారికి కూడా సహకరిస్తామని చెప్పారు. గ్రంథాలయ నిర్మాణానికి నిధులు కేటాయించాలని శేఖర్‌ గౌడ్‌ చేసిన విజ్ఞప్తిని ఇప్పుడే అములు చేయలేనని సున్నితంగా తిరష్కరించారు.
                                  పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన శేఖర్‌గౌడ్‌ : చందోజీ రావు
        పేదరికం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన శేఖర్‌ గౌడ్‌ అభినందనీయుడని డిగ్రికళాశాల ప్రొఫెసర్‌ చందోజీ రావు అన్నారు. శేఖర్‌గౌడ్‌ జీవిత విశేషాలను ఆసక్తికరంగా వివరించారు. సంపద ఎంత సంపాదించినా పోతుందని  విద్యమాత్రం ఎప్పటికీ చెరగని, తరగని దని పద్యం రూపంలో తెలిపారు. ఆయన చదువుకుని అందరికీ విద్యను బోధించే అలవాటు చిన్ననాటినుంచే అలవరుచుకున్నారని చెప్పారు. ట్యుటోరియల్‌, లయోలా జూనియర్‌ కళాశా ల ఏర్పాటు చేసి ఎందరినో విద్యావంతులను చేయడానికి కృషి చేశారని చెప్పారు. ప్రస్తుతం ఉపాధ్యాయునిగా సేవందిస్తున్నారని చెప్పారు. సభికులను ఆకట్టుకునేలా చమత్కారమైన భాష, చందోజిరావు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
                                               పీహెచ్‌డీ అత్యున్నత డిగ్రీ : పానుగంటి చంద్రయ్య
              డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) అనేది ఒక వ్యక్తి డాక్టరేట్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయటం ద్వారా విశ్వవిద్యాలయం నుండి పొందే ఒక అత్యున్నత డిగ్రీ అని ప్రజాశక్తి ఎడిషన్‌ ఇన్‌ఛార్జి పానుగంటి చంద్రయ్య చెప్పారు. సాహిత్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సైన్స్‌, గణితం, ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ/డిఫిల్‌ వంటి అనేక భిన్న రంగముల కొరకు పీహెచ్‌డీ  డిగ్రీలు ఉన్నాయని చెప్పారు. డాక్టరేట్‌ చాలా దేశాల్లో అతి పెద్ద డిగ్రీగా పరిగణించబడుతుందని వివరించారు.  ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క హాబిలిటేషన్‌ తప్ప డాక్టరేట్‌ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవని చెప్పారు.  డాక్టరేట్‌ అనే పదం లాటిన్‌ భాషలోని డాక్టర్‌ నుండి ఉదయించిందనీ, డాక్టర్‌ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం  చెప్పారు. ఉపాధ్యాయుడు అంటే మామూలు ఉపాధ్యాయుడు కాదని ఆయన ఎంచుకున్న రంగంలో నిష్నాతుడయిన ఉపాధ్యాయుడని తెలిపారు.  ఈ డిగ్రీ మధ్య యుగంలో వచ్చిందని, ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో బోధించాంటే డాక్టరేట్‌ తప్పనిసరిగా కావాల్సి ఉండేదన్నారు. డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ , ఒక రంగంలో నిష్నాతులైన డాక్టరుకు మధ్య తేడాను వివరించారు. ఆంగ్లంలో నిష్నాతుడైన శేఖర్‌గౌడ్‌  డాక్టరేట్‌ పట్టాపొందారని చెప్పారు. ఈసందర్భగా అమ్మ గొప్పదనంపై  చంద్రయ్య పాట పాడారు.
                ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బాలాజీ, బుద్దారం సర్పంచి పానుగంటి శివకుమార్‌, ఎంపిటిసి శేఖర్‌ గౌడ్‌, మాజీ సర్పంచు అచ్యుతరామారావు, జాంప్లానాయక్‌, మాజీ ఎంపిటిసి పూల్యానాయక్‌, పాలెం డిగ్రీ కళాశా ప్రిన్సిపాల్‌ రాజెంద్రసింగ్‌, రిటైర్డ్‌ ప్రధానోపా ధ్యాయు గోపాల్‌రెడ్డి, ఉపాధ్యా యు శ్రీనివాస్‌, పానుగంటి రాము, ప్రతాప్‌,  నరసింహా, డీర్‌ అమర్‌నాథ్‌, అంబేద్కర్‌ విజ్ఞాన సేవాసంఘం అధ్యక్షు పానుగంటి ఓంకార్‌, స్థానికు కుర్మయ్య, రిటైర్డ్‌ పిజికల్‌ డైరెక్టర్‌ పాం డురంగారావు, శ్రీకాంత్‌, నాగేంద్రం, పాఠశాల ప్రధానో పాధ్యాయులు , ఉపాధ్యాయు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు శేఖర్‌ గౌడ్‌ ను పూలమాలలు, శాలువాతో సన్మానించారు.

2, అక్టోబర్ 2016, ఆదివారం

ప్రజాపాటల ఉద్యమగొంతుక మూగబోయింది

ఆర్‌.ఏ.వాసుదేవుడు కన్నుమూత

                ప్రజానాట్యమండలి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆర్‌.ఏ వాసు ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. జనంభాషలో జానపదాలు రాస్తూ ఇప్పటివరకు 30 పాటల సీడీలు రికార్డు చేయడం మామూలు విషయం కాదు. జానపద సాహిత్యంలో ఈయన పాటలు చరిత్రను సృష్టించాయి. అంతటి కవి, పల్లెపాటల ప్రజాకవి మన జిల్లాలో ఉన్నాడంటే ఎవరబ్బా అని ఆలోచిస్తారు. ఆహర్యాన్ని చూసి ఈయనేం రాశాడబ్బా అనుకుంటారు. కాని ఆ రచయిత గూర్చి చెప్పాలంటే ఎన్ని పుటలైనా సరిపోవు. చెమటచుక్కల్ని అక్షరాలుగా పేర్చగలడు. కన్నీళ్ళను ఆనందభాష్పాలుగా మార్చేయగలడు. కొట్టంబడిలో సదువుకున్నది ఐదేండ్ల సదువు ఐదవతగతి అయినా ఆయన రాసిన పాటలు తొలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రగతిశీ ప్రజాతంత్ర ఉద్యమాల్లో వందలాది మంది కార్యకర్తల గొంతుకల్లో చైతన్యగీతాలై ప్రజల పక్షాన పోరాడతాయి. ప్రజా సమస్యల్ని చాలా దగ్గర్నుంచి చూసి పాటల్ని అల్లేస్తాడు. తిరిగి వాటికి అక్షరరూపమిచ్చి పాడతాడు రాళ్ళపోగు అన్నవరం వాసుదేవుడు అలియాస్‌ ఆర్‌.ఏ.వాసు
                 ‘అమ్మనేను ఆగమైతి అక్షరాలు రెండు నేర్వక..’ అనే పాట చాలా మంది వినే వుంటారు. ఈ పాట నేటికీ బాలకార్మక కష్టాు తెలిపే ఉద్యమగీతం. కర్నూలు జిల్లాలోనే తొలిసారిగా బాకార్మికగీతంగా చరిత్రకెక్కింది. ఈపాటలు రాసిన ఆర్‌ఏ వాసు 1972 జూన్‌ 1న కర్నూలు ప్రజా ఉద్యమకేంద్రం ఇందిరాగాంధీ నగర్‌లో పెద్దయ్య, బీసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి కర్నూలు ప్రభుత్వ ప్రెస్‌లో మజ్ధూర్‌గా పని చేసేవారు. మహబూబ్‌నగర్‌ జిల్లా తుమ్మ్లెల వీరి స్వగ్రామం. వాసు పూర్వీకులు కర్నూలుకు వస వచ్చారు. ఇందిరాగాంధీనగర్‌లోని ప్రాథమికపాఠశా పూరిగుడిసెలో నిర్వహిస్తున్న పాఠశాలలో ఐదవతరగతి వరకు చదువుకున్నాడు. చదువు ఒంటబట్టని ఆయన ప్రజాఉద్యమాలవైపు ఆకర్షితుయ్యారు. 1989లో డివైఎఫ్‌ఐ సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం పేపర్‌మ్లిలు కార్మకులు ఇందిరాగాంధీనగర్‌లో నృత్యం నేర్చుకునే వారు. ఆ సందర్భంలో ‘లాల్‌ లాల్‌ జెండా’ అనే నృత్యరూపకంలో ఒక నటుడు అవసరమైతే వాసును తీసుకున్నారు. నటుడిగా తనప్రతిభ చూపించారు. తర్వాత పీర్‌లెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రమహాసభ సందర్భంగా విజయవాడ తుమ్మల పల్లి కళాక్షేత్రంలో నర్స్‌పాత్ర వేశారు. 1990 కర్నూలు జిల్లాలో జరిగిన అక్షరాస్యత ఉద్యమంలో నటుడిగా కళాజాతాలో తిరుగుతూ రిసోర్స్‌ పర్సన్‌ గా నియమితులై 12 మందికి శిక్షణనిచ్చే స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో వేసిన పల్లెసుద్దు గ్రామాల్లో ఎంతో పేరు తెచ్చాయి. అనంతరం పొదుపులక్ష్మీ కళాజాతకు సన్నాహకంలో రచయితగా అరంగేట్రం చేస్తూ నా బంగరు తల్లీ అనే ప్లల వితోకూడుకున్న పాటను రాసి అందరిచే మెప్పు పొందారు. ప్రజా ఉద్యమంలో పరిచయమైన సుజాతతో మనసు కలిపాడు. మనువాడారు. ఆమేకూడా తీయనైనగొంతుతో ప్రజా ఉద్యమగీతాలను ఆపించే సుప్రసిద్ద ప్రజాపాట గాయని. వారికి ఇద్దరు అమ్మాయిలు హరి, వెన్నెలు కూడా చిరుగొంతుతో పాటను ఆపిస్తూ తీయని స్వరా మధురానుభూతు జ్లు కురిపిస్తారు. వాసు పర్యావరణ ఆవశ్యకతను తెలియజేస్తూ వానదేవుడు అనే నాటకం రాశారు. ఇక పాటతోనే చైతన్యం కలిగించాని జనం నుడిలో, జనంయాసలో, జనం భాషలో పాటు రాసే రచయితగా స్థిరపడ్డారు. వాసు రాసిన పాట అంశాన్నీ సామాజిక సమస్యలే. కులవివక్ష, వరకట్నం, మూఢనమ్మకాు, నిరక్షరాస్యత, అధిక ధరలు తదితర వాటిపై ఇప్పటివరకు వంద పాటలు రాశారు. వామపక్ష ఉద్యమగేయాలు , హమాలీ, చేనేత, రజక వృత్తుల స్థితిగతుపై, కరవు, వ్యవసాయకూలీ సమస్యు, రైతు సమస్యు, నీళ్ళు, కుటుంబనియంత్రణ, మహిళాసమస్లలు అదీ ఇదీ అనకుండా సమాజం ఎదుర్కొంటున్న ప్రతి సామాజిక సమస్యను పాటుగా రాశారు. ఆయనకు బాగా పేరు తెచ్చిన పాట చూడండి...
నా సెమట సుక్కో నా సెమట సుక్కో
ఎర్రటి ఎండల్లో నిగనిగలాడే నా సెమట సుక్కా
అంటరానిదంటే అగ్గయి మండే నా సెమట సుక్కా... ఈ పాట విన్న ప్రముఖపాట రచయిత సుద్దాల అశోక్‌తేజ పాటురాసే రచయితకు పాఠ్యాంశమన్నారంటే ఈ పాటలోని సాహిత్యం భాష, జానపదబాణీ అనిర్వచనీయం. ఈ పాట చరణంలో చిత్రకారుల కుంచెలో శిలకూపిరిపోసే శ్పిుల్లో/ వెండిబంగారా వన్నెల్లో కొండజాతి గుండె చిన్నెల్లో/ అందా బొమ్మల్లో ముత్యా ముగ్గులో/ఇంపుగా మురిసింది నా సెమట సుక్కా/ కెంపై మెరిసింది నా సెమటసుక్కా చరణాలు అద్దేపల్లి లాంటి కవు విని అబ్బురపడి వాసును వెన్నుతట్టి ప్రోత్సహించి ప్రజాపాట పూదోట అని అభివర్ణించారు. గతేడాది విశాఖపట్నంలో జరిగిన సిపిఎం ఆలిండియా మహాసభల్లో వాసు కుటుంబం పాటులు పాడి అలరించింది. ఇటీవల అకాల మరణం పొందిన మహిళా ఉద్యమనేత క్ష్మ(క్ష్య)మ్మ పై ఆర్‌ఏ. వాసు రాసిన పాట కమ్యూనిస్ట్‌ పార్టీ కుటుంబసభ్యుల్ని కంటతడి పెట్టించింది. ఆ పాట...
అమ్మా ఓ చ్చుమమ్మ
కన్నీళ్ళకు సెలవమ్మ
చెబుతున్నా నిజమమ్మా

ఉద్యమాలకు ఊపిరిమ్మ... ఆమెపై ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టుకుని అక్షరనీరాజనాలర్పిస్తూ రాసిన వాసును సుప్రసిద్ద పాటలరచయిత అని అనకుండా ఎలా ఉండగల. సన్మానాలకు, సత్కారాలకు దూరంగా వుంటూ, ప్రజాపాటలే ఆహారంగా ఆహర్యంగా ప్రజా ఉద్యమాలే ఊపిరిగా బతుకుతూ ఒకపక్క ప్రజానాట్యమండలిలో క్రియాశీలక నాయకుడిగా బాధ్యతల్లో వుంటూ, మరోపక్క కర్నూలు ప్రజాశక్తి దినపత్రికకు క్చరల్‌ విలేకరిగా పని చేసిన ఆర్‌.ఏ. వాసు ఆకాలమరణం. ప్రజాతంత్ర ూద్యమానికి తీరని లోటు. ప్రజాశక్తి దినపత్రిక కర్నూలు టాబ్లాయిడ్‌లో నిర్వహించే ‘కర్నూలు కవనం’ శీర్షికకు ఈ ఏడాది మే నెలలో కెంగారమోహన్‌ రాశారు.