చైనా
అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు మోదీ అపురూపమైన బహుమతులు ఇచ్చారు. అనధికారిక
చర్చలు జరిపేందుకు మహాబలిపురం వచ్చిన ఇరువురు నేతలు ఆత్మీయ స్నేహితులుగా
మెలిగారు. భరత నాట్యం, కథకళి నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఈ నృత్యాల
వివరాలను జిన్‌పింగ్‌కు మోదీ తెలిపారు. ఇరువురు నేతలు కళాకారులతో ఫొటో
దిగారు. అంతకుముందు ఉభయులు మహాబలిపురంలోని శిల్పాలను తిలకించారు. మోదీ ఈ
శిల్పాల ప్రత్యేకతను జిన్‌పింగ్‌కు వివరించి చెప్పారు. ఇరువురు కొబ్బరి
నీళ్ళు తాగారు. జిన్‌పింగ్‌కు మోదీ స్వయంగా కొబ్బరి బొండం ఇచ్చారు. ఈ
సందర్భంగా జిన్‌పింగ్‌కు మోదీ నృత్య సరస్వతి చిత్ర పటం, నచియార్‌కోయిల్ హంస
దీపం బహుమతిగా ఇచ్చారు. తంజావూర్
పెయింటింగ్ ప్రముఖుడు బి లోగనాథన్ రూపొందించిన నృత్య సరస్వతిని
జిన్‌పింగ్‌కు బహూకరించారు. ఇది 16వ శతాబ్దంనాటి చిత్ర కళా రూపమైన
తంజావూర్ పెయింటింగ్. నాయక, మరాఠా రాజుల పరిపాలనా కాలంలో ఈ చిత్ర కళ వృద్ధి
చెందింది.
ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
11, అక్టోబర్ 2019, శుక్రవారం
30, ఆగస్టు 2019, శుక్రవారం
‘సాహో’ రివ్యూ
బ్యానర్: యు.వి.క్రియేషన్స్
నటీనటులు:
ప్రభాస్, శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్,
వెన్నెలకిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ,
చుంకీపాండే, లాల్, మందిరాబేడి, మహేశ్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, షాసా
చెట్రి తదితరులు
మ్యూజిక్: తనిష్క్ బగ్చి, గురురంద్వా, బాద్షా, శంకర్ ఎహ్‌సాన్‌లాయ్
బ్యాగ్రౌండ్ స్కోర్: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
దర్శకత్వం: సుజిత్
తెలుగు
సినిమా స్థాయిని ప్రపంచానికి `బాహుబలి`తో తెలియజేసిన హీరో ప్రభాస్. ఈ
హీరో తదుపరి సినిమా ఎవరితో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాంటి
తరుణంలో.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒకే ఒక్క సినిమా అనుభవమున్న సుజిత్ అనే యువ
దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రభాస్. బాహుబలితో
ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరడంతో నిర్మాతలు సాహోను ప్యాన్
ఇండియా మూవీగా తెరకెక్కించారు. బాలీవుడ్ తారలు, హాలీవుడ్ టెక్నీషియన్స్ఈ
సినిమాకు పనిచేయడం, బాహుబలి ఇమేజ్, టీజర్, ట్రైలర్ ఇవన్నీ
సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. మరి సాహో ఈ అంచనాలను అందుకుందా?
లేదా? ప‌్రభాస్ ఇమేజ్ పెరిగిందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే
కథేంటో చూద్దాం...
కథ
ముంబైలో
అతి పెద్ద దొంగతనం జరగుతుంది. రెండు వేల కోట్ల రూపాయలను ఓ దొంగ
చిన్న సాక్ష్యం కూడా దొరక్కుండా కొట్టేస్తాడు. కేసుని దర్యాప్తు చేస్తున్న
పోలీస్ ఆఫీసర్ డేవిడ్(మురళీశర్మ), కానిస్టేబుల్
గోస్వామి(వెన్నెలకిషోర్) దొంగెవరో తెలుసుకునే ప్రయత్నంలో విఫలమవుతారు.
దీంతో ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్ అశోక్ చక్రవర్తి(ప్రభాస్)ను
నియమిస్తుంది. అశోక్ కేసుని ఛేదిస్తుండగా చివరకు జై(నీల్ నితిన్
ముఖేష్)నే ఆ దొంగ అని తెలుస్తుంది. అయితే జైకు పోలీసుల నుంచి సమాచారం
వస్తుండటంతో తప్పించుకుంటూ ఉంటాడు.
జైనే అసలు
దొంగ అని సాక్ష్యాలతో పట్టుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని.. అతనితో స్నేహం
చేయడానికి హీరో అతనుండే పబ్‌కి వెళతాడు. అదే సమయంలో
అమృతానాయర్(శ్రద్ధాకపూర్)కి డ్యూటీ వేస్తాడు. క్రమంగా అశోక్ ఆమెను
లవ్ చేస్తుంటాడు. ఓసారి తాగిన మైకంలో జై ఓ క్లూ అశోక్‌కు ఇస్తాడు. వాజీ
నగరంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో కోట్ల రూపాయలున్నాయని అది దక్కితే తానే
అదృష్టవంతుడినని, అందుకోసం తాను ప్రయత్నిస్తున్నట్లు చెబుతాడు. ఆ
బ్లాక్ బాక్స్ దొంగతనం చేసే క్రమంలో అతన్ని రెడ్ హ్యాండ్‌గా
పట్టుకోవాలని ప్రభాస్ పోలీసులతో కలిసి ప్లాన్ చేస్తాడు.
ఈ
క్రమంలో సిటీలో పెద్ద డాన్ రాయ్(జాకీ ష్రాఫ్)ను కొందరు చంపేస్తారు.
ఆయన స్థానంలో డాన్ అయిన ఆయన తనయుడు విశ్వాంక్(అరుణ్ విజయ్) తండ్రిని
చంపిన వారిని పట్టుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ
క్రమంలో అనుకోని షాకింగ్ విషయాలు రివీల్ అవుతూ వస్తాయి. అసలు అశోక్
ఎవరు? అతనికి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు బ్లాక్ బాక్స్
రహస్యమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
బాహుబలి
తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరగడంతో సాహోపై అంచనాలు ఆకాశాన్ని
అంటాయి. ఈ అంచనాలకు తగ్గట్లే నిర్మాతలు, హీరో, నటీనటులు, సాంకేతిక
నిపుణులు భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో సాహో సినిమాను
రూపొందించారు. రాజమౌళి వంటి దర్శకుడి తర్వాత సుజిత్ వంటి దర్శకుడితో
ప్రభాస్ సినిమా చేయడమంటే .. నిజంగా అతని తెగువకు అభినందించాల్సిందే.
అయితే ఈ అంచనాల కారణంగా సాహో ఇండియన్ మూవీ అనే అంచనాలతో ప్రేక్షకుడు
థియేటర్‌కు వస్తాడనడంలో సందేహం లేదు. ఈ అంచనాలకు ధీటుగా సినిమా
ఉండాలి. దీని వల్ల సినిమాలో సాంకేతిక హంగులు పెరిగాయి. దీంతో సినిమా
బాలీవుడ్ రంగు పులుముకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. యాక్షన్ డ్రామా..
భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు.
ఎంత
పెద్ద భారీ చిత్రమైనా ఓ భావోద్వేగం కూడా చాలా ముఖ్యం. ఈ ఎమోషన్ పార్ట్
సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా, కనెక్టింగ్‌గా ఉండదు. సినిమా ప్రథమార్థం
అంతా నెమ్మదిగా సాగుతోంది. అయితే అదంతా కథలోకి తీసుకెళ్లడానికి
దర్శకుడి ప్రయత్నాలని అర్థం చేసుకోవాలంటే, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో
తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో వరుస ట్విస్టులతో షాకులిచ్చే ప్రయత్నం
చేశాడు కానీ.. ఈ షాకుల వల్ల ప్రేక్షకుడు గందరగోళానికి లోనవుతాడు. ప్లాష్
బ్యాక్ పార్ట్‌ను మిక్స్ చేసి చూసిన తర్వాత ఇది రివేంజ్ డ్రామానా
అనిపిస్తుంది. సినిమాలో యాక్షన్ పార్ట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నా.. వాటిని
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు నచ్చేలా తెరకెక్కించడం
కష్టమైందనే చెప్పాలి.
ప్రభాస్
యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా చేసినా.. ఎవరితో, ఎందుకు
చేస్తున్నాడనే కన్‌ఫ్యూజన్ కనపడుతుంది. ప్రతి విషయంలో ట్విస్ట్,
థ్రిల్లింగ్ ఇవ్వాలనే తలంపుతో ప్రతి విషయాన్ని దాచి పెట్టడం..
చివరకు రివీల్ చేయడంతో కాస్త తికమకగా తయారైంది. సినిమాలో కామెడీ
పార్ట్ ఉన్నదే అనుకుని సంతృప్తిపడాలి. ఇక నటీనటుల పరంగా చూస్తే ప్రభాస్
గురించి మనం తక్కువ చేయలేం. బాహుబలితో అతనేంటో ప్రూవ్ అయ్యింది. ఈ
సినిమాలో నటుడిగా చాలా రిస్కులతో నటించాడు. అలాగే శ్రద్ధాకపూర్
గ్లామర్ సినిమాకు పెద్ద ప్లస్. పాటల పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది
కానీ.. హిందీ పాటల్లా అనిపిస్తాయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది.
మది కెమెరా వర్క్ ఎక్స్‌ట్రార్డినరీ. యాక్షన్ ఎలిమెంట్స్ సూపర్బ్.
ఇతర నటీనటులందరూ వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
28, ఆగస్టు 2019, బుధవారం
రాజుకున్న రాజధాని

తారస్థాయిలో అమరావతి రాజకీయం
తెదేపా అపోహలు సృష్టించొద్దు.. స్పష్టమైన ప్రకటన చేయాలి
తారస్థాయిలో అమరావతి రాజకీయం
తెదేపా అపోహలు సృష్టించొద్దు.. స్పష్టమైన ప్రకటన చేయాలి
భాజపా మార్పు అసాధ్యం.. మారిస్తే ఊరుకునేది లేదు
భాజపా మార్పు అసాధ్యం.. మారిస్తే ఊరుకునేది లేదు
కాంగ్రెస్ అమరావతిలోనే కొనసాగించాలి
కాంగ్రెస్ అమరావతిలోనే కొనసాగించాలి
సీపీఎం ప్రజలు ఊరుకోరు.. రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సిందే
సీపీఎం ప్రజలు ఊరుకోరు.. రాజధానిపై స్పష్టత ఇవ్వాల్సిందే
రోడ్డెక్కిన రైతులు
రోడ్డెక్కిన రైతులు
ఆందోళన వద్దన్న ఉపరాష్ట్రపతి
ఆందోళన వద్దన్న ఉపరాష్ట్రపతి
సుజనా, తెదేపా నేతలు భూములు కొన్నారన్న బొత్స..
సుజనా, తెదేపా నేతలు భూములు కొన్నారన్న బొత్స..
వారు మినహా మిగతా వారికి న్యాయం చేస్తామని హామీ
వారు మినహా మిగతా వారికి న్యాయం చేస్తామని హామీ
సెంటు భూమీ కొనలేదన్న సుజనా
ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై రాజధాని కీలక చర్చనీయాంశమైంది. రాజధాని రైతుల్లో ఆందోళనలకు, పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. రాజధాని అమరావతిలో కొనసాగడంపై ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజుకున్న ఈ రాజకీయం మంగళవారం తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధానిని అక్కడే కొనసాగించాలని ఆందోళనకు దిగాయి. రాజధాని రైతులూ రోడ్డెక్కారు. మరోవైపు ప్రభుత్వం.. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని, రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి, చంద్రబాబు బంధువులకు భూములన్నాయని ఆరోపించింది. అలాంటి వారిని పక్కనబెట్టి మిగిలిన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేసింది.
రాజధానిని కదిలిస్తే ఊరుకోబోమని భాజపా హెచ్చరించింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ సుజనా చౌదరి వైకాపా తీరుపై ధ్వజమెత్తారు. బాధ్యతారహిత ప్రకటనలపై సీఎం జగన్ స్పందించాలని డిమాండు చేశారు. రాజధానిపై స్పష్టత ఇవ్వకపోతే ప్రజాగ్రహం తప్పదని సీపీఎం నేత మధు హెచ్చరించారు. రాజధాని గ్రామాల్లో సీపీఎం నేతలు పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. రాజధానిని ప్రస్తుతమున్న ప్రాంతంలోనే కొనసాగించాలని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాజధానిపై రాజకీయాలు చేయొద్దని కోరుతూ మంగళగిరి మండలం యర్రబాలెం రైతులు రహదారిపై ఆందోళనకు దిగారు.
ఊరట: ఈ రాజకీయ వివాదం మధ్య రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు సొమ్మును విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం వారికి ఊరటనిచ్చింది.
|
అన్నీ బయటపెడతాం
|
రాజధాని ప్రాంతంలో సుజనా, చంద్రబాబు బంధువులకు భూములు
|
ఏ ఒక్కరికో మేలు జరిగేలా వ్యవహరించం: మంత్రి బొత్స
![]() |
|
‘వరదల్లో
ఇల్లు మునిగిపోతుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హైదరాబాద్
వెళ్లారు. వరదలు తగ్గాక వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు
ఇంటిని ముంచాలనుకుంటే.. ఇంకో అరగంట ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవకపోతే
సరిపోయేది కదా’ అని వ్యాఖ్యానించారు. భాజపా నేతలు ఎందుకు మారారో? |
|
‘రాజధాని
ఒక కుంభకోణం.. అవినీతి జరుగుతోందని భాజపా గతంలో ఆరోపించింది. రూ.వేల కోట్ల
టెండర్లు పిలిచారని, భూ సమీకరణలో అక్రమాలు జరిగాయని వైకాపాతోపాటు ఆ పార్టీ
చెప్పింది. వాళ్లు ఇప్పుడెందుకు విధానాన్ని మార్చుకున్నారో అర్థం కావటం
లేదు’ అని బొత్స పేర్కొన్నారు. రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తాం |
|
రాజధానికి
భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.
పింఛన్లు ఇస్తున్నాం. కౌలు చెల్లిస్తున్నాం. భూములు అభివృద్ధి చేసి ఇస్తాం.
రాజధానికి భూములిచ్చిన రైతులు నన్ను కలిసి ఈ ఏడాది కౌలు చెల్లించాలని
కోరారు. వెంటనే రూ.187.40 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చాం. బొత్స ప్రధాన ఆరోపణలు |
| * సుజనా చౌదరి బంధువు, గ్రీన్‌టెక్ కంపెనీలో డైరెక్టరు అయిన జితిన్ కుమార్ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాల భూములున్నాయి. ఈడీ ఇచ్చిన జాబితా ప్రకారం ఆయనకు ఉన్న 120 సంస్థల్లో ఇదీ ఒకటి. ఆయన సోదరుడి కుమార్తె అయిన యలమంచిలి రుషికన్య పేరుతో వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలున్నాయి. ఆయన రాజధాని ప్రాంతంలో ఎకరా ఉంటే చూపించమన్నారు. 124 ఎకరాలు చెప్పా. |
| * చంద్రబాబు వియ్యంకుడికి వియ్యంకుడు అయిన ఎంఎస్‌బీ రామారావుకు చెందిన వీబీసీ సంస్థకు ఏపీఐఐసీ ద్వారా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఎకరా రూ.లక్ష చొప్పున 493 ఎకరాలిచ్చారు. ప్రభుత్వంలో ఉన్న వారెవరైనా ఎకరా రూ.లక్ష చొప్పున ఇంట్లో వాళ్లకు ఇచ్చుకోవడం ఎక్కడైనా జరిగిందా? దీన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనాలా? క్విడ్ ప్రో కో అనాలా? |
|
*
చంద్రబాబు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందంటున్నారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమహేంద్రవరంలలో పెరిగాయని నా
స్నేహితులు చెబుతున్నారు. చంద్రబాబు ఆలోచనేంటి? అక్కడెక్కడా పెరగకుండా
అమరావతిలోనే పెరగాలా? మెట్రోకు అంత అవసరమా? |
|
‘మొత్తం
67 కిలోమీటర్ల దూరంతో అమరావతి మీదుగా వెళ్లేలా రూ.24,460 కోట్ల అంచనా
వ్యయంతో విజయవాడ మెట్రోకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేశారు. ఇంత
మొత్తంతో మెట్రో అవసరమా? |
|
భూములు కొన్నవారి చిట్టా త్వరలోనే...
|
ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఈనాడు
డిజిటల్, అమరావతి: రాజధాని అమరావతిలో బినామీ పేర్లతో భూములు కొన్నవారి
చిట్టా త్వరలోనే బయటకు వస్తుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
‘‘అమరావతిలో భూములు కొన్నవారంతా రాజధాని తరలిపోతే రూ.కోట్ల పెట్టుబడులు
ఏమైపోతాయోనని పీడకలలు కంటున్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం
హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆయనకు రియల్
ఎస్టేట్ తప్ప ఇంకెలాంటి సమస్యలు కనిపించడం లేదా?’’ అని మంగళవారం
ట్విటర్‌లో విమర్శించారు. ఎంపీ సుజనాచౌదరి భాజపాలో చేరినా ఆయన మదిలో
చంద్రబాబే ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు. |
|
సెంటు భూమీ కొనలేదు: సుజనా
![]() |
|
రాజధానిని కదిలిస్తే ఊరుకోం
|
భాజపా నేతలు లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి
![]() ![]() |
|
పాదయాత్రలో
జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి రాజధానిని మార్చేది లేదని చెప్పినట్లు తనకు
గుర్తుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధానిని మారుస్తామంటూ మంత్రులు
మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అమరావతిని
తరలిస్తామంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు. ‘ఇప్పటిదాకా ఈ ప్రాంతం మునిగిన
దాఖలాలు లేవు. 7, 8 మీటర్లు తవ్వగానే నేలలో రాయి తగులుతుంది. మంచి
రవాణావ్యవస్థ ఉంది. ఇన్ని ప్రయోజనాలుంటే అమరావతి రాజధానికి సరైనది
కాదంటున్నారు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతం వరదల్లో
మునుగుతుందని నిరూపిస్తే తన పుట్టింటోళ్లు ఇచ్చిన మూడెకరాలు మంత్రికి
రాసిస్తానని మందడం గ్రామానికి చెందిన బత్తుల గంగాభవాని సవాలు విసిరారు.
విజయవాడ నుంచి సుజనాచౌదరి తొలుత తాళ్లాయపాలెం వచ్చారు. అక్కడ రైతులతో
మాట్లాడుతుండగా వారి పక్కనుంచే సీఎం కాన్వాయ్ వెళుతోంది. ఆ సమయంలో రైతులు
అమరావతి జిందాబాద్, రాజధాని ఇక్కడే ఉండాలని నినాదాలు చేయగా.. సీఎం కారులో
నుంచే రైతుల వైపు చూసి నమస్కరిస్తూ వెళ్లిపోయారు. |
|
ఉప రాష్ట్రపతిని కలిసిన రైతులు
ఉంగుటూరు,
న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చామని..రాజధాని మార్పు
అనే ప్రచారం సాగుతోందని, అక్కడ నిర్మాణాలు నిలిచిపోయినందున అందరిలో ఆందోళన
నెలకొందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురు రైతులు వాపోయారు. |
| కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్‌లో మంగళవారం ఆయనను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన.. రాజధాని విషయంలో ఎటువంటి అధికార ప్రకటన వెలువడనందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను రాజకీయాలు మాట్లాడకూడదని, అయినా రాజ్యాంగబద్ధంగానే తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనాలోచనతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని రైతులకు సూచించారు. |
26, ఆగస్టు 2019, సోమవారం
‘మిస్ ఇండియా’ కీర్తి సురేశ్..

ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్ నాజూకుగా, స్టైలిష్‌గా కనిపించారు. చిత్రం షూటింగ్ దాదాపు విదేశాల్లో జరిగినట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర బృందం పేర్కొంది. ఇది ‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న సినిమాగా కావడం విశేషం.
24, ఆగస్టు 2019, శనివారం
23, ఆగస్టు 2019, శుక్రవారం
ఫోటోగ్రాఫర్ సుధాకర్ కు సన్మానం

విజయవాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు రవాణా శాఖ మాత్యులు పేర్ని వెంకట్రామయ్య (Nani), రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆధ్వర్యంలో పెన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపకులు బడే ప్రభాకర్ అధ్యక్షతన సీనియర్ జర్నలిస్టులకు ఫోటో వీడియో జర్నలిస్టులకు అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సభను ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సాహసంతో కూడుకున్న పని అని, ఈ ఫోటోలు నిరంతరం చిరకాలం జ్ఞాపకాలతో పాటు ప్రతి ఒక్క ప్రతిమలకు కార్యక్రమాలకు గుర్తింపుగా ఉండిపోతుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా జర్నలిజంలో వృత్తిలో పని చేస్తూ ఉన్న ఫోటోగ్రాఫర్లకు సన్మానించారు. కర్నూల్ సీనియర్ ఫోటోగ్రాఫర్ సుధాకర్ గారికి సన్మానం చేశారు . ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా కర్నూలు జిల్లాలో ఎంపికయిన సుధాక రు ను. సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మంచి ఫోటో గుర్తింపు గా సన్మానం అందుకోవడం అదృష్టమన్నారు. ఇందులో పలువురు సీనియర్ నాయకులు పాత్రికేయులు పాల్గొన్నారు.
18, ఆగస్టు 2019, ఆదివారం
ఎపిని మార్చడమే నా కల
* పరిశ్రమలకు ఎర్ర తివాచీతో స్వాగతం
* ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పాత్ర గొప్పది
* డల్లాస్ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి
రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తన కల అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంవత్సరానికి ఒకటి, రెండు సార్లయినా సొంత గ్రామాలకు వచ్చి అందరినీ పలకరించాని, పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేస్తూ మీరు రావాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని సిఎం చెప్పారు. గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు, గ్రామాల్లో వైద్యశాలలు మార్చాలని తపన ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి గ్రామాలను బాగుపరుచుకుందామని, ప్రభుత్వ ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమలకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామని, పిపిఎల సమీక్ష ద్వారా పరిశ్రమలకు మేలు కలుగుతుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పదని, చరిత్రాత్మక విజయం వెనుక మీ కృషి ఉందని అన్నారు. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ప్రతి మనిషీ, ప్రతి కుంటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు చేశామని చెప్పారు. అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరక్క అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదన్నది, రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదన్నది, పల్లెలు కళకళలాడాలని, ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది తన కోరికని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలని, పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది, సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నది, పేదరికం, నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది తన కల అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది తన కల అని తెలిపారు. రెండున్నర నెలల వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నానన్నారు. అణగారిన వర్గాలు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడాలేని చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలను కుదుర్చుకుంటున్నామని తెలిపారు. మూడేళ్లలో పాఠశాలలు, ఆస్పత్రుల పరిస్థితిని మారుస్తామని, నాడు, నేడు అని ఫొటోలు చూపిస్తామని చెప్పారు.
* ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పాత్ర గొప్పది
* డల్లాస్ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి
రాష్ట్రాన్ని అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తన కల అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంవత్సరానికి ఒకటి, రెండు సార్లయినా సొంత గ్రామాలకు వచ్చి అందరినీ పలకరించాని, పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేస్తూ మీరు రావాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుంటుందని సిఎం చెప్పారు. గ్రామాల్లో మీరు చదువుకున్న బడులను మార్చాలని ఆరాటం ఉన్నవాళ్లు, గ్రామాల్లో వైద్యశాలలు మార్చాలని తపన ఉన్నవాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి గ్రామాలను బాగుపరుచుకుందామని, ప్రభుత్వ ప్రయత్నాలకు మంచి హృదయంతో మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమలకు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామని, పిపిఎల సమీక్ష ద్వారా పరిశ్రమలకు మేలు కలుగుతుందని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రవాసాంధ్రుల పోషించిన పాత్ర చాలా గొప్పదని, చరిత్రాత్మక విజయం వెనుక మీ కృషి ఉందని అన్నారు. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా రెండున్నర నెలల పాలనలో విప్లవాత్మక చర్యలు చేపట్టామని, ప్రతి మనిషీ, ప్రతి కుంటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు చేశామని చెప్పారు. అన్నం పెడుతున్న రైతులకు అన్నం దొరక్క అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాకూడదన్నది, రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదన్నది, పల్లెలు కళకళలాడాలని, ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు ఉండాలన్నది తన కోరికని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గొప్పగా ఉండాలని, పేదవాడు వైద్యం ఖర్చు భరించలేక, చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పటికీ రాకూడదన్నది, సొంత ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్నది, పేదరికం, నిరుద్యోగంతో పస్తులు ఉండకూడదన్నది తన కల అని చెప్పారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్ష లేని పరిపాలన అందించాలన్నది తన కల అని తెలిపారు. రెండున్నర నెలల వ్యవధిలోనే గ్రామ వాలంటీర్లను, గ్రామ సచివాలయాలను తీసుకువస్తున్నానన్నారు. అణగారిన వర్గాలు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా దేశంలో ఎక్కడాలేని చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సత్సంబంధాలను కుదుర్చుకుంటున్నామని తెలిపారు. మూడేళ్లలో పాఠశాలలు, ఆస్పత్రుల పరిస్థితిని మారుస్తామని, నాడు, నేడు అని ఫొటోలు చూపిస్తామని చెప్పారు.
13, ఆగస్టు 2019, మంగళవారం
విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి : రాహుల్
గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్

కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిన్న మండిపడ్డారు. రాహుల్‌ను తాను కశ్మీర్‌కు ఆహ్వానించానని, ఆయనకు విమానం కూడా పంపుతానని, వచ్చి ఇక్కడి పరిస్థితి గమనించి అప్పుడు మాట్లాడాలని ఆయన అన్నారు.
12, ఆగస్టు 2019, సోమవారం
మరో వారంలో జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్2

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయాన్ 2 విశేషాలను పంచుకున్నారు. ‘జులై 22న చంద్రయాన్-2ను ప్రయోగించిన తర్వాత ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టాం. అవన్నీ విజయవంతమయ్యాయి. అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నాం. ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ ప్రక్రియ జరుపుతాం. దీంతో చంద్రయాన్ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ చేపడతాం. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుంది’ అని శివన్ తెలిపారు.
ప్రస్తుతం వ్యోమనౌక పక్కాగా ఉందని, అన్ని సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. జులై 22న జీఎస్‌ఎల్వీ మార్క్ 3 ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
9, ఆగస్టు 2019, శుక్రవారం
జాతీయ అవార్డులు: ఉత్తమ నటి కీర్తిసురేశ్
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన


* ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(ఉరి)
* ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరి)
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)
* ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్‌కిరే(చంబక్)
* ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్ హో)

* ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్ హో
* ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్: మరాఠీ)
* జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్

* జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
* జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
* ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
* జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజీఎఫ్
* ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ‘అ!’(తెలుగు) కేజీఎఫ్(కన్నడ)
* ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ మేకప్: ‘అ!’
* ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: మహానటి
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మార సంభవం(మలయాళం)

* ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీప్‌ప్లే: అంధాధున్
* ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బెంగాలీ)
* ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
* ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్(పద్మావత్: బింటే దిల్)
* ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేసి, శ్రీనివాస్ పోకాలే
* నర్గీస్ దత్ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




