ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఆకలి నివారించాల్సిన పాలకులకు చిత్తశుద్ది లేదు. పేదల ఆకలి ఎప్పుడు తీరుతుందో...?
28, జనవరి 2021, గురువారం
13, జనవరి 2021, బుధవారం
ఎపి లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం అవాస్తవం : డిజిపి గౌతం సవాంగ్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, సత్యదూరం అని ఎపి డిజిపి గౌతం సవాంగ్ ఐపిఎస్ స్పష్టం చేశారు. బుధవారం గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తుందన్నారు. దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఎపి లో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని తెలిపారు. తమ రాష్ట్రంలో కూడా ఈ భద్రతా ప్రమాణాలను అమలుపరచడానికి సాధ్యాసాధ్యాలను అధికారులతో పలు రాష్ట్రాల ప్రతినిధుల బృందం చర్చించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో గత సెప్టెంబరు 5 వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేశామన్నారు. 43,824 సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను ఎపి లోని అన్ని ఆలయాలకు కల్పిస్తున్నామని డిజిపి గౌతం సవాంగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతోపాటు 80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను, ముఠాలను అరెస్ట్ చేశామన్నారు. గత సంవత్సరం (2020) సెప్టెంబర్ 5 అనంతరం దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23256 గ్రామ రక్షణ దళాలకు గాను, 15394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని డిజిపి ప్రకటించారు.
కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని అన్నారు. అలా ప్రచారం చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నామని డిజిపి తెలిపారు. ఎపి రాష్ట్రం మత సామరస్యానికి ఒక ప్రతీక దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని హితవు పలికారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు లో ఉన్న అన్ని కేసుల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతోపాటు సిట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. తరచుగా ఈ రకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయలలో నేరాలకు సంబంధించిన 4895 మంది ఎంఒ అఫెండర్స్ ను ఇప్పటికే గుర్తించామని, వారందరినీ జియో మ్యాపింగ్ తో అనుసంధానం చేశామని చెప్పారు. వీరిపై నిరంతర నిఘాను కొనసాగించడంతోపాటు అవసరమైన వారిపై సస్పెక్ట్ షీట్స్ ను ఓపెన్ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఎపి లో దేవాలయాలకు, పవిత్ర స్థలాలకు పటిష్టమైన భద్రతను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కల్పిస్తోందని స్పష్టం చేశారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డిజిపి కోరారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్థనా మందిరాల భద్రతా చర్యలను జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్ 100 కి, దేవాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా 9392903400 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని డిజిపి గౌతం సవాంగ్ కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఎల్లవేళలా నిరంతరం ప్రజలుకు అందుబాటులో ఉంటుందని డిజిపి పేర్కొన్నారు.
మోడీ విధానాలు .. ప్రజాస్వామ్యానికి ముప్పు : జర్నలిస్ట్ పి. సాయినాథ్

చంఢీఘర్ : ఒక్కో రంగాన్ని దశలవారీగా ధ్వసం చేసే మోడీ ప్రభుత్వ విధానంతో.. ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, రైతుల పోరాటం .. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధానంగా ఉధ్భవించిందని ప్రముఖ జర్నలిస్ట్ పి. సాయినాథ్ అన్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీని అభినందించారు. ఈ ఉద్యమంతో దేశంలోని రైతులు తాము కోల్పోయిన ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. చంఢఘీర్‌లో రైతుల తిరుగుబాటుపై ఆయన ప్రసంగిస్తూ..రిపబ్లిక్ డే రోజున రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీ చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఇది ప్రజల పరేడ్ అని, ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించాలని అన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేయాలన్న మోడీ ప్రభుత్వ ప్రతి వ్యూహాన్ని ధైర్యంగా తిప్పి కొట్టారని అన్నారు. కార్పోరేట్ మీడియా, పోలీసుల దాడి ఇలా ప్రతి వ్యూహాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. ప్రధాని దూకుడుగా దాడి చేస్తున్నారని, ఒకదాని తర్వాత మరోకటి రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తూనే ఉన్నారని అన్నారు. రైతుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రాంతీయ, మత, కులాల పరంగా విభజనలు సృష్టించడం (ఖలిస్తానీయులని), పోలీసులను ప్రయోగించడం, ఇందులో కొందరు మేథావులు కూడా పాల్గొన్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం తప్పుడు మార్గంలో ప్రయాణిస్తోందని అన్నారు. వలస పాలకులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలకు ఇప్పుడు రైతులు చేపడుతున్న ఉద్యమానికి చాలా పోలీకలు ఉన్నాయని, చరిత్ర విద్యార్థిని గనుక తాను స్పష్టం చేయగలుగుతున్నానని అన్నారు. అప్పుడు కూడా చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే అశాభావంతో ఉన్నానని అన్నారు. గత మూడేళ్లలో దేశంలోని మధ్యతరగతి ప్రజలు రైతుల పట్ల సానుభూతి చూపుతున్నారని, గతంలో అలా జరగలేదని అన్నారు. ఈ సందర్భంగా కార్పోరేట్ మీడియా తీరును కూడా ఎండగట్టారు. దేశంలోని అతిపెద్ద కార్పోరేట్ మీడియాలకు ఈ చట్టాలతో భారీ ప్రయోజనాలు చేకూరుతాయని, దీంతో మీడియాలో అధిక భాగం వారి యజమానుల ప్రయోజనాలకు విరుద్ధమైన వైఖరిని తీసుకోలేరని అన్నారు.
7, నవంబర్ 2020, శనివారం
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. పెన్సెల్వేనియాలో తుది ఫలితం ప్రకటించడంతో జో బిడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. పెన్సెల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. అక్కడ జో బైడెన్ ఆధిక్యం కనబర్చడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. జో బైడెన్ కు మొత్తం 284 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజారీటికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ దాటేయడంతో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కాగా నార్త్ కరోలినా ఫలితం తేలకపోవడంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. దీంతో.. 46వ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా విజయం సాధించారు. కాగా అమెరికాకు ఎన్నికైన తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
మధ్యతరగతి జో ముచ్చటగా మూడోస్సారి..
అధ్యక్ష పదవికి గతంలోనూ బైడెన్ యత్నాలు 1987లో, 2008లో నిలబడేందుకు సిద్ధం పార్టీలో మద్దతు కూడగట్టలేక ఉపసంహరణ
- మూడో ప్రయత్నంలో దక్కిన అభ్యర్థిత్వం
జోబైడెన్ (77).. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో సై అంటే సై అన్నట్టుగా ఢీకొని, గెలుపు దిశగా దూసుకుపోతున్న బలమైన ప్రత్యర్థి. 2016లో హిల్లరీ క్లింటన్ ఇచ్చిన పోటీ కంటే బలమైన పోటీతో బెంబేలెత్తించిన బైడెన్‌ను అమెరికా రాజకీయాల్లో ముద్దుగా ‘మిడిల్ క్లాస్ జో’ అని పిలుచుకుంటారు. బరాక్ ఒబామా బృందంలో సభ్యుడిగా, ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి మాత్రమే మనలో చాలా మందికి తెలుసు. కానీ.. జో బైడెన్ మూడున్నర దశాబ్దాల కల అధ్యక్ష పదవి. ఈ పదవిని అధిష్ఠించేందుకు ఆయన 1988లో ప్రయత్నించారు. కానీ, పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మళ్లీ 2008లో కూడా ప్రయత్నించారు. అప్పుడూ ఒబామా, హిల్లరీ కరిష్మా ముందు తేలిపోయారు. ముచ్చటగా మూడోసారి.. అంటే ఇప్పుడు మాత్రం డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి నామినేట్ కావడంలో విజయం సాధించారు. 1942 నవంబరు 20న.. పెన్సిల్వేనియాలోని స్ర్కాన్‌టన్‌లో బైడెన్ జన్మించారు. బైడెన్ చిన్నప్పుడే ఆయన కుటుంబం డెలవెర్‌లో స్థిరపడింది. నిజానికి వారిది సంపన్న కుటుంబమేగానీ.. బైడెన్ పుట్టే సమయానికి ఆయన తండ్రి తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. దీంతో చాలాకాలంపాటు బైడెన్ కుటుంబం పేదరికంలో గడిపింది. తర్వాత కొద్దిగా కోలుకుని మధ్యతరగతి జీవనం గడిపింది. బైడెన్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికం. ఈ క్రమంలోనే స్కూల్ లీడర్‌గా వ్యవహరించారు. 1965లో చరిత్ర, రాజనీతి శాస్త్రంలో బీఏ చేశారు. బైడెన్‌కు మొదట్లో నత్తి ఉండేది. కానీ, అద్దం ముందు నుంచి కవితలు చదవడం ద్వారా ప్రయత్నపూర్వకంగా దానిపై ఆయన విజయం సాధించారు.
1966లో ఆయనకు తొలిసారి వివాహమైంది. ఆయన మొదటి భార్య నీలియా హంటర్. వారికి ముగ్గురు పిల్లలు. 1968లో బైడెన్ న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఒక న్యాయసంస్థలో పనిచేశారు. అప్పట్లో ఆయనకు డెలవేర్ గవర్నర్ అయిన డెమొక్రాటిక్ నాయకుడి విధానాలపై ఆగ్రహం ఉండేది. రిపబ్లికన్ అభ్యర్థి భావాలు నచ్చేవి. అయితే, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రిచర్డ్ నిక్సన్ అంటే ఇష్టం ఉండేది కాదు. 1969లో ఆయన.. డెమొక్రాటిక్ పార్టీలో చురుగ్గా వ్యవహరించే ఒక వ్యక్తి నిర్వహించే న్యాయసంస్థలో పనిచేశారు. అక్కడ ఉండగానే ఆయన తన భావాలు మార్చుకొని డెమొక్రాట్‌గా తన పేరు నమోదు చేసుకున్నారు. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తొలుత స్థానిక కౌంటీ కౌన్సిల్‌కు ఎన్నికైన బైడెన్.. 1972లో జూనియర్ సెనెటర్‌గా ఎన్నికయ్యారు. చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులు ఇంటింటికీ తిరగి కరపత్రాలు పంచి ప్రచారం చేశారు. ఆయన ప్రత్యర్థి భారీగా ప్రచారం చేశారు. అయినా బైడెనే గెలిచారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది ఆయన భార్య, ఏడాది వయసున్న కుమార్తె ప్రమాదంలో చనిపోయారు. ఆ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమారులిద్దరూ ఆస్పత్రిలో ఉండగా.. సెనెట్ సభ్యుడుగా బైడెన్ ఆస్పత్రిలోనే ప్రమాణ స్వీకారం చేశారు.
1977లో ఆయన జిల్ ట్రేసీ జాకబ్స్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె. 30 ఏళ్ల వయసుకే సెనెటర్‌గా ఎన్నికైన బైడెన్ చురుగ్గా పనిచేయడంతో టైమ్ మేగజైన్ 1974లో ఆయన్ను ‘200 ఫేసెస్ ఫర్ ద ఫ్యూచర్’లో ఒకరిగా పేర్కొంది. సెనెటర్‌గా ఆయన వినియోగదారుల హక్కులు, పర్యావరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించారు. సెనెట్‌కు సంబంధించిన పలు కమిటీలకు నాయకత్వం వహించారు.రాజకీయంగా ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ వచ్చారు. 1988 ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఆశపడినా.. ఆయన ప్రచార బృందం చేసిన కొన్ని తప్పుల వలన, ఆయన గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల అభ్యర్థిత్వం దక్కలేదు. మళ్లీ 2007లో కూడా ప్రయత్నించి 2008 జనవరిలో ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ ఏడాది డెమొక్రాట్ అభ్యర్థిగా నామినేట్ అయిన ఒబామా.. బైడెన్ సమర్థతను గుర్తించి, ఆయనను పిలిచి మరీ ఉపాధ్యక్షుడిగా చేసుకున్నారు. అధ్యక్షుడిగా ఒబామా తీసుకున్న పలు నిర్ణయాల్లో బైడెన్ కీలకపాత్ర పోషించారు.
బైడెన్.. హిలాల్ ఇ పాకిస్థాన్
ప్రచార సమయంలో ట్రంప్‌తో వాగ్యుద్ధం జరుగుతున్నప్పుడు బైడెన్ ‘ఇన్షా అల్లా’ అని వ్యాఖ్యానించడంతో ప్రపంచమంతా ఒక్కసారి ఆయన వైపు చూసింది. ట్రంప్ పన్నుల చెల్లింపు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆ రికార్డులన్నీ ఎప్పుడు చూపిస్తారంటూ వ్యంగ్యంగా ఆయన ఆ మాట అన్నారు. అసలే ఇస్లామోఫోబియాతో భయపడే చాలా మంది అమెరికన్లు ఆ వ్యాఖ్యతో సందేహంలో పడ్డారు. ఇన్షా అల్లా అంటే అర్థం ఏమిటో గూగుల్‌లో వెతికారు. అయితే.. చాలామందికి తెలియని విషయమేంటంటే 2008లో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ బైడెన్‌కు హిలాల్ ఇ పాకిస్థాన్’ అవార్డును ప్రకటించారు. ఆ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అది. రిపబ్లికన్ సెనెటర్ రిచర్డ్ లుగర్‌తో కలిపి సంయుక్తంగా ఆ పురస్కారాన్ని ఇచ్చారు. వారిద్దరూ కలిసి పాకిస్థాన్‌కు సైనికేతర వినియోగం నిమిత్తం 150కోట్ల డాలర్ల సాయం అందించే ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం.
22, అక్టోబర్ 2020, గురువారం
ఉచిత వ్యాక్సిన్‌కు రూ.50వేల కోట్లు, ఒక్కొక్కరికీ రూ.450 ఖర్చు

న్యూఢిల్లీ: కరోనా నివారణకు వ్యాక్సిన్ సిద్దమయిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమౌతోందని ఎన్‌డిటివి పేర్కొంది. ప్రభుత్వ వర్గాల్లో ఉన్న వ్యక్తుల ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు 50 వేల కోట్ల రూపాయలను సిద్దం చేసిందని ఒక నివేదికలో ఎన్‌డిటివి తెలిపింది. వచ్చే ఏడాది మార్చిలోపే ఈ డబ్బును వాడుకునేవిధంగా సిద్దం చేసిందని చెప్పింది. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు రెండు దఫాలుగా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు దఫాల వ్యాక్సిన్‌కు ఒక్కొరికీ 150 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనికితోడు వ్యాక్సిన్‌ను అన్ని ప్రాంతాలకు తరలించేందుకు, వాటి నిల్వ ఉంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పించేందుకు ఒక్కొక్కరికీ మరో మూడు వందల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తం ఒక్కొ వ్యక్తిపై 450 రూపాయలవరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ అంచనాల మేరకే మొత్తం 50 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసుకున్నట్లుగా ఎన్‌డిటివి తెలిపింది.
20, అక్టోబర్ 2020, మంగళవారం
బీహార్‌లో గెలిచేదెవరో చెప్పేసిన సర్వే
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 3 విడతల్లో జరగనున్నాయి. ఈ నెల 28న తొలి విడత, నవంబర్ 3న రెండో విడత, నవంబర్ ఏడున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ పదిన ఫలితాలు ప్రకటిస్తారు.
11, అక్టోబర్ 2020, ఆదివారం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అంగారక గ్రహం(మార్స్) మంగళవారం నాడు భూమితో కలిసి ఒకే సరళ రేఖపైకి రానుంది. ఆ సమయంలో అది మునుపటి కన్నా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రతి 26 నెలలకు అంటే దాదాపు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అమరిక కుదురుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి, అంగారకుడు తిరిగి వాటి వేర్వేరు కక్ష్యల్లోకి సాధారణ స్థితికి వెళ్లడానికి ముందు దగ్గరగా తిరుగుతాయి. కాబట్టి అంగారక గ్రహం భూమిపై ఉన్న మనకు అతి పెద్దగా, కాంతిమంతంగా గోచరిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు అపోజిషన్(వ్యతిరేకత) అని పిలిచే ఈ ఖగోళ అద్భుతాన్ని మంగళవారం రాత్రి చూడొచ్చు. రాత్రి 11.20 గంటల సమయంలో సూర్యుడు, భూమి, అంగారకుడు ఈ మూడు ఒకే సరళ రేఖపైకి రానున్నాయి. అ అపురూప దృశ్యాన్ని తిలకించడం కోసం అర్ధరాత్రి వరకూ వేచివుండక్కర్లేదని, సాయంత్రం 9 లేదా 10 గంటల సమయంలో ఆగేయ ప్రాంతంలో సులువుగా చూడొచ్చని ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డామియన్ పిచ్ చెప్పారు.
9, అక్టోబర్ 2020, శుక్రవారం
ఐక్య రాజ్య సమితి ఆకలిపోరాటానికి శాంతి పురస్కారం
క్యూబా డాక్టర్లను నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించాలన్న ప్రపంచ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి నార్వే నోబెల్ అకాడెమీ ఈ ఏడాది శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి)కి ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి విభాగమైన డబ్ల్యుఎఫ్‌పి ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్థఅని, ఆకలిదప్పులను నిర్మూలించి, ఆహారభద్రతకు పాటుపడుతోందని నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెస్ ఆండర్సన్ ఈ సందర్భంగా అన్నారు. ఈ దిశలో ఆ సంస్థ జరిపిన బహుముఖ కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఆ సంస్థకు ఇస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రతపై పాలకులకు మరిన్ని సందేశాలు ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) ద్వారా భవిష్యత్తులో ఇవ్వాలని ఆశిద్దాం.
బీహార్ ఎన్నికలపై పాశ్వాన్ మృతి ప్రభావం ఎంత?

మరికొద్ది రోజుల్లో బీహార్‌లో ఎన్నికలు జరగుతుండగా ఆ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడైన రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయన మృతి ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) బాధ్యతలు స్వీకరించిన ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ నితిష్‌కుమార్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాడు. కానీ బిజెపికి మాత్రం సహకరిస్తున్నాడు. బిజెపి పోటీచేసే సీట్లలో పోటీ పెట్టకుండా కేవలం జెడియు పోటీ చేసే స్థానాలపైనే గురి పెట్టాడు. రామ్ విలాస్ పాశ్వాన్.. మృతికి ముందు కొద్ది నెలల నుంచి అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఎన్డీయే నుంచి బయటకొచ్చి పోటీ చేయాలన్న చిరాగ్ నిర్ణయంపై బిజెపి నేత సుశీల్ మోడీ మాట్లాడుతూ రామ్ విలాస్ పాశ్వాన్ క్రియాశీలకంగా ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని అన్నాడు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూడా మాట్లాడుతూ సీనియర్ పాశ్వాన్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న మంచి సంబంధాల కారణంగానే పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలో ప్రజల అంతరంగాన్ని అంచనా వేయడంలో రామ్‌విలాస్ పాశ్వాన్ దిట్ట. అందుకనే ఆయన్ను రాజకీయ పండితుడు అని కూడా అంటారు. 1999లో పాశ్వాన్ తన బిజెపి వ్యతిరేక వైఖరిని విడిచి పెట్టి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో నితీష్‌కుమార్‌తో కలిసి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో 54 పార్లమెంట్ సీట్లలో ఆర్‌జెడి ఏడు సీట్లకు మాత్రమే పరిమితమైంది. లాలూప్రసాద్ తన స్వంత నియోజకవర్గమైన మాధేపూర్‌ను కూడా కోల్పయాడు. తర్వాత 2004 ఎన్నికల్లో బిజెపిని వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏతో కలిశాడు. ఈ ఎన్నికల్లో లాలూ ప్రసాద్, పాశ్వాన్, కాంగ్రెస్ కూటమి నితీష్‌కుమార్ నేతృత్వంలోని కూటమిని చిత్తుగా ఓడించింది. ఒక్క 2009లో మాత్రం రామ్ విలాస్ పాశ్వాన్ తన హాజీపూర్ స్థానాన్ని కోల్పయాడు. 2014 వరకు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఆ తర్వాత 2014లో మోడీని ఎవ్వరూ నిలువరించలేరని భావించిన పాశ్వాన్ తిరిగి బిజెపితో చేతులు కలిపాడు. ఇదే సమయంలో బిజెపిని వీడిన నితీష్‌కుమార్ మూడేళ్ల కాలంలోనే ఆర్జేడి,కాంగ్రెస్‌కు మోసం చేసి తిరిగి ఎన్డీయేలో చేరాడు.
రామ్‌విలాస్ పాశ్వాన్ చనిపోగానే బీహార్‌లోని కొందరు రాజకీయ విశ్లేషకులు చిరాగ్ పాశ్వాన్ రాజకీయ వ్యూహంలో మార్పులు జరిగే అవకాశముందని అంచనా వేశారు. అయితే ఇప్పటికే చిరాగ్ పెద్ద రాజకీయ ఎత్తుగడే వేశాడు. ఈ ఎత్తుగడ అతన్ని చావో రేవో అని తేల్చుకునే పరిస్థితిలోకి నెట్టింది. బీహార్‌లో 223 అసెంబ్లీ సీట్లకు గాను అక్టోబర్ 28, నవంబర్ 3, నవరబర్ ఏడు తేదీల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. నవరబర్ పదో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల్లో తనవైఖరిపై చిరాగ్ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశాడు. నితీష్‌కుమార్‌ను ఓడించాలనేదే తన లక్ష్యమని, బిజెపి స్థానాల్లో పోటిపడబోమని, బిజెపికి ఎటువంటి నష్టం కల్గించబోమని తెలిపాడు. తన తండ్రి అరోగ్యం గురించి విలేకర్లు నితీష్‌కుమార్‌ను ప్రశ్నించినప్పుడు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరించారని ఆరోపించారు. కానీ జెడియు నేతలు మాత్రం ఈ విషయంలో చిరాగ్‌ను సంప్రదించేందుకు నితీష్‌కుమార్ ప్రయత్నించాడని, కానీ అతను స్పందించలేదని చెబుతున్నారు.
మరి పాశ్వాన్ మృతి చిరాగ్ ఎన్నికల వ్యూహంపై ఎటువంటి ప్రభావాన్ని చూపనుంది? మొదట చిరాగ్ బిజెపి పోటీచేసే అన్ని స్థానాలు మినహా మిగిలిన 122 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు, మూడు దశల్లో ఎన్నికలు జరిగే స్థానాల్లో చిరాగ్ పెద్దగా అభ్యర్దులను నిలబెట్టకపోవచ్చుని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే 42 మంది అభ్యర్ధులు నామినేషన్ వేసేవారు. వారిలో ఆరుగురు బిజెపి నుండి వచ్చిన అసంతృప్త నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా బిజెపి పోటీ చేయని స్థానాల్లోనే నామినేషన్ వేశారు.
అయితే నితిష్‌కుమార్ చిరాగ్ పాశ్వాన్ గురించి అంతగా టెన్షన్ పడడం లేదని జెడియు నేతలు చెబుతున్నారు. కేవలం ఐదు శాతం మాత్రమే ఓట్లు ఉన్న పాశ్వాన్ దళితులు 2005 నుండి తనకెప్పుడూ వ్యతిరేకంగానే ఓటు వేశారని, ఎల్‌జెపి అభ్యర్ధులు పోటీ చేయడం వల్ల తనకు వచ్చే నష్టమేమీ లేదని నితీష్ భావిస్తున్నాడు. మరో వైపు పాశ్వాన్లు మినహా మిగిలిన దళిత కులాల ఓట్లన్నింటికీ ప్రాథినిధ్యం వహిస్తున్న మహా దళిత గ్రూపుకు నాయకుడైన జతిన్ రామ్ మాంజీ తనకు మద్దతు ఇస్తున్నందున, అది తనకు కలిసివచ్చే అవకాశమని నితీష్ భావిస్తున్నాడు. అందుకు మంజీ నేతృత్వంలోని పార్టీకి నితీష్ తనకు వచ్చిన కోటాలో నుండి ఏడు సీట్లును కేటాయించాడు.
ఈ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్‌తో బిజెపి ఎలా వ్యవహరిస్తుందనేది కీలకం. ఒకవైపున నితీష్‌తో పొత్తు కొనసాగుతూనే చిరాగ్‌ను కూడా బిజెపి ట్రంప్ కార్డు లాగా వాడుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపున చిరాగ్ కేంద్ర కేబినెట్‌లో తన తండ్రి స్దానాన్ని తాను పొందాలని కోరుకుంటున్నాడు. బీహార్‌లో బిజెపికి లాభం చేకూర్చే వైఖరి తీసుకోకుండా కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లడం కష్టమని చిరాగ్‌కు కూడా తెలుసు.


